7300mAh బ్యాటరీ, 50MP కెమెరా 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.2000 డిస్కౌంట్..!
Vivo T4 5G Smartphone : వివో నుంచి గత సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్‌లో అందుబాటులోకి వచ్చాయి. బడ్జెట్ ధర నుంచి ప్రీమియం సెగ్మెంట్ వరకు అనేక ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. ఇవాళ కూడా భారత్ మార్కెట్‌లో వివో X200T స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఈ ఫోన్ గురించి ఇప్పటికే అనేక వివరాలు వెల్లడయ్యాయి. అయితే గత సంవత్సరం తొలి భాగంలోనే ఏకంగా 7300mAh బ్యాటరీతో వివో T4 5G ఫోన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.
రూ.2000 డిస్కౌంట్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వివో T4 5G స్మా్ర్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.22,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.24,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.26,999 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో HDFC బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే గరిష్ఠంగా రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

కలర్ వేరియంట్స్ :
డిస్కౌంట్ అనంతరం ఈ స్మార్ట్‌ఫోన్‌ను వరుసగా రూ.20999, రూ.22999, రూ.24999 ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఎమరాల్డ్ బ్లేజ్, ఫాంటమ్ గ్రే కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు :
వివో T4 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.77 అంగుళాల FHD+ క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 5000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే వెట్ హ్యాండ్ టచ్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా తడి చేతులతోనూ నియంత్రించుకోవచ్చు.
3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ వివో ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 SoC ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 12GB LPDDR4x ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
50MP కెమెరా :
కెమెరా విభాగం వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 2MP సెకండరీ కెమెరా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను అమర్చారు.
7300mAh బ్యాటరీ :
ఈ ఫోన్ 90W వైర్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్టుతో 7300mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ AI Super Document, AI Erase, AI Note Assistant, AI Photo Enhance, Live Text ఫీచర్లున్నాయి. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.2, వైఫై, OTG, GPS, IR బ్లాస్టర్, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.


Click it and Unblock the Notifications








