Home
Deal of the day

7300mAh బ్యాటరీ, 50MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ చిప్‌, క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే 5G ఫోన్‌ పై డిస్కౌంట్‌!

భారత్‌లో ఈ సంవత్సరం తొలిభాగంలో భారీ బ్యాటరీతో ఐకూ తొలి ఫోన్‌ను విడుదల చేయగా.. అనంతరం కొన్నిరోజుల తర్వాత వివో T4 స్మార్ట్‌ఫోన్‌ 7300mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. అయితే భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చినా స్లిమ్‌ డిజైన్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్ 50MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 OS పైన పనిచేస్తుంది. దీంతోపాటు అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది.

వివో T4 5G స్మా్ర్ట్‌ఫోన్‌ (Vivo T4 5G Smartphone) భారత్ మార్కెట్‌ లో విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.21,999, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.23999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.25999 గా ఉండేది.

Vivo T4 5G smartphone telugu news

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1000 తగ్గింపుతో రూ.20999, రూ.22999, రూ.24999 ధరలకు అందుబాటులో ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.1000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ల ధరలు రూ.19999, రూ.21999, రూ.23999 ధరకే కొనుగోలు చేయవచ్చు.

క్వాడ్ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లే :
వివో T4 5G స్మార్ట్‌ఫోన్‌ 6.77 అంగుళాల FHD+ క్వాడ్ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 5000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే వెట్‌ హ్యాండ్‌ టచ్‌ ఫీచర్‌ ఉంది. తడి చేతులతోనూ వినియోగించుకోవచ్చు.

Vivo T4 5G smartphone telugu news

3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 3 SoC చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ 12GB LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 తో పనిచేస్తోంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

50MP OIS కెమెరా :
వివో భారీ బ్యాటరీ ఫోన్ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 2MP సెకండరీ కెమెరాను అమర్చి ఉంది. 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ సూపర్ డాక్యుమెంట్‌, AI Note Assistant, AI Erase, AI Photo Enhance, Live Text వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ 90W వైర్‌ ఫ్లాష్‌ ఛార్జింగ్, బైపాస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7300mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ఫాంటమ్‌ గ్రే, ఎమరాల్డ్‌ బ్లేజ్‌ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్‌, స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది. 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.2, వైఫై, OTG, GPS, IR బ్లాస్టర్‌ ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఉంది.

Best Mobiles in India

English summary
Vivo T4 5G smartphone with 7300mAh battery, Quad curved amoled display gets discount on Flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X