Home
Deal of the day

7300mAh భారీ బ్యాటరీ, 50MP OIS కెమెరా, క్వాడ్‌ కర్వడ్ డిస్‌ప్లే ఫోన్‌ పై డిస్కౌంట్!

వివో ఈ సంవత్సరం తొలి భాగంలో 7300mAh భారీ బ్యాటరీతో వివో T4 5G స్మార్ట్‌ఫోన్‌ ను (Vivo T4 5G Smartphone) విడుదల చేసింది. ఈ ఫోన్‌ భారీ బ్యాటరీతో లాంచ్‌ అయినా.. సన్నని డిజైన్‌నే కలిగి ఉంది. క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 50MP కెమెరా సహా అనేక ఫీచర్‌లను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

వివో T4 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.21,999, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.23999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.25999 గా ఉండేది. ప్రస్తుతం ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్‌ ధరకు అందుబాటులో ఉంది.

vivo T4 5G smartphone

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ పై రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ ఫోన్ ధరలు వరుసగా రూ.20,999, రూ.22,999, రూ.24,999 ఉన్నాయి. దీంతోపాటు బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఎమరాల్డ్‌ బ్లేజ్‌, ఫాంటమ్‌ గ్రే కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తోంది.

స్నాప్‌డ్రాగన్‌ చిప్‌, 3 సంవత్సరాల అప్‌డేట్స్ :
ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 3 SoC ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. 12GB LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 తో పనిచేస్తోంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

క్వాడ్ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లే :
ఈ హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.77 అంగుళాల FHD+ క్వాడ్ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 5000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మరియు వెట్‌ హ్యాండ్‌ టచ్‌ ఫీచర్‌ ఉంటుంది. ఫలితంగా తడి చేతులతోనూ ఈ ఫోన్‌ను వినియోగించుకోవచ్చు.

ఈ ఫోన్‌ 90W వైర్‌ ఫ్లాష్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7300mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. కేవలం 65 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేస్తుందని వివో చెబుతోంది. ఈ హ్యాండ్‌సెట్ రివర్స్‌, బైపాస్‌ ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది. గేమింగ్‌ వంటి సమయాల్లో బైపాస్‌ ఛార్జింగ్‌ ఫీచర్‌ అనుకూలంగా ఉంటుంది.

ఈ ఫోన్‌ వెనుక వైపు 50MP ప్రైమరీ, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. ఈ ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టును కలిగి ఉంది. 32MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది. ఈ ఫోన్ AI Erase, AI Photo Enhance, సూపర్ డాక్యుమెంట్, Live Text, AI Note Assistant వంటి ఫీచర్లు ఉన్నాయి.

కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.2, GPS, OTG, IR బ్లాస్టర్‌ వంటి ఫీచర్‌లున్నాయి. IP65 రేటింగ్‌తో డస్ట్‌, స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
vivo T4 5G smartphone with 7300mAh large battery now available at Rs20999 price on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X