Home
Deal of the day

50MP + 50MP కెమెరాలు, 6500mAh బ్యాటరీ, అల్ట్రా స్లిమ్ కర్వడ్‌ ఫోన్‌పై రూ.3 వేల డిస్కౌంట్‌!

Vivo T4 Pro 5G Smartphone : వివో సంస్థ భారత్‌ మార్కెట్‌లో ఈ సంవత్సరం అనేక స్మా్ర్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. T4 సిరీస్‌తోపాటు V సిరీస్‌ మోడల్స్‌ను తీసుకొచ్చింది. ఈ సంవత్సరం ఆగస్టు నెలలో విడుదల అయిన వివో T4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ ను ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ అల్ట్రా స్లిమ్‌ డిజైన్‌, కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 6 సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ వివో ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.

వివో T4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను వివో వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌ లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.27999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ రూ.29999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.31999 గా ఉంది.

vivo T4 pro 5G smartphone

రూ.3000 డిస్కౌంట్‌ :
ఈ ఫోన్‌ను ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో కొనుగోలు చేసి, గరిష్ఠంగా రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ వివో T4 ప్రో 5G హ్యాండ్‌సెట్‌ బ్లేజ్‌ గ్లోల్డ్‌, నిట్రో బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో ప్రస్తుతం లభిస్తోంది.

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
వివో T4 ప్రో స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 7 జెన్‌ 4 SoC ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 12GB LPDDR4x ర్యామ్‌, 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తోంది. వివో ఫోన్‌ 4 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లే :
ఈ హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.77 అంగుళాల ఫుల్‌ HD+ క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 5000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ మెరుగైన థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం 16,470 sq mm 10 లేయర్‌ VC కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది.

50MP + 50MP + 32MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వివో T4 Pro 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరా యూనిట్‌ తో అందుబాటులో ఉంది. ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 3x జూమ్‌తో 50MP సోనీ IMX882 పెరిస్కోప్‌ టెలిఫోటో లెన్స్‌ తోపాటు 2MP బొకేష్‌ కెమెరాలు ఉన్నాయి. 32MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది.

vivo T4 pro 5G smartphone

AI ఫీచర్లు :
ఈ హ్యాండ్‌సెట్‌ అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇమేజింగ్‌ టూల్స్‌ను కలిగి ఉంది. ఇందులో AI Magic Move, AI Image Expander, AI Erase 3.0, AI Photo Enhance, AI Professional Portrait వంటి ఫీచర్‌లు ఉన్నాయి. దీంతోపాటు AI Spam call protection, AI Captions వంటి కూడా ఉన్నాయి.

ఈ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. IP68, IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. సెక్యూరిటీ కోసం ఈ ఫోన్‌ ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ అమర్చారు.

More from GizBot

Best Mobiles in India

English summary
vivo T4 pro 5G smartphone with 6 years of updates gets Rs3000 discount on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X