Home
Deal of the day

90W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 100X డిజిటల్‌ జూమ్‌, క్వాడ్‌ కర్వడ్‌ డిస్‌ప్లే 5G ఫోన్‌పై రూ.4000 డిస్కౌంట్‌!

వివో సంస్థ ఈ సంవత్సరం T4 సిరీస్‌లో భాగంగా అనేక మోడల్స్‌ను లాంచ్‌ చేసింది. ఇందులో భాగంగా అందుబాటులోకి వచ్చిన వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను (Vivo T4 Ultra 5G Smartphone) ప్రస్తుతం డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ క్వాడ్‌ కర్వడ్‌ డిస్‌ప్లే, 100x డిజిటల్‌ జూమ్‌తో టెలిఫోటో లెన్స్‌, 90W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్‌ అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, సేల్‌ వివరాలు.

వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ఈ సంవత్సరం జూన్‌లో భారత్లో విడుదల అయింది. లాంచ్‌ సమయంలో ఈ ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.37999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.39999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.41999 గా ఉంది.

Vivo T4 Ultra 5G smartphone

రూ.4 వేల డిస్కౌంట్‌! :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.2000 డిస్కౌంట్‌ ధరతో అందుబాటులో ఉంది. ఫలితంగా ఈ ఫోన్‌ ధరలు రూ.35999, రూ.37999, రూ.39999 గా ఉన్నాయి. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై అదనంగా రూ.2000 డిస్కౌంట్ ను పొందవచ్చు. మొత్తంగా ఈ ఫోన్‌ను ప్రస్తుతం రూ.4 వేల తగ్గింపు ధరతో సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ ఫినిక్స్‌ గోల్డ్‌, మెటియర్‌ గ్రే కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లే :
వివో T4 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల 1.5K క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 5000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 300Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. దీంతోపాటు HDR10+ సపోర్టు చేస్తుంది.

ఈ వివో హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 12GB LPDDR5X ర్యామ్‌, 512GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Funtouch 15 పైన పనిచేస్తోంది. 2 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని వివో హామీ ఇచ్చింది.

100x డిజిటల్‌ జూమ్‌ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలు ఉన్నాయి. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా మరియు 3x ఆప్టికల్‌ జూమ్‌, 10x టెలిఫోటో మ్యాక్రో జూమ్‌, 100x డిజిటల్‌ జూమ్‌తో 50MP సోనీ IMX882 పెరిస్కోప్‌ టెలిఫోటో ఉంది. ఈ టెలిఫోటో లెన్స్‌ OIS, EIS సపోర్టును కలిగి ఉంది.

ఫాస్ట్‌ ఛార్జింగ్ :
సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం వివో T4 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ 32MP కెమెరాను కలిగి ఉంది. బ్యాటరీ, ఛార్జింగ్ పరంగా ఈ ఫోన్‌ 90W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్ AI Erase, AI Note Assist, AI Call Translation వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo T4 Ultra 5G smartphone with 100x Digital zoom telephoto lens gets Rs4000 discount on Flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X