Home
Deal of the day

మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌, క్వాడ్‌ కర్వడ్‌ డిస్‌ప్లే, 50MP కెమెరా 5G ఫోన్‌పై డిస్కౌంట్‌!

వివో నుంచి గత సంవత్సరం భారత్‌ మార్కెట్‌ లో అనేక స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ అయ్యాయి. అయితే T4 సిరీస్‌లో భాగంగా జులై నెలలో వివో T4R 5G స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ ఆకట్టుకొనే డిజైన్‌తోపాటు క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్‌ 15 OS, 50MP కెమెరాను కలిగి ఉంది. మూడు సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను అందిస్తుంది. దీంతోపాటు మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌, మెరుగైన వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌పై డిస్కౌంట్‌ను అందిస్తోంది.

వివో T4R 5G స్మార్ట్‌ఫోన్‌ (Vivo T4R 5G Smartphone) ప్రస్తుతం వివో ఇండియా ఇ-స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.20,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.22,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.24,999 గా ఉంది.

Vivo T4R 5G Smartphone

రూ.1000 డిస్కౌంట్‌ :
ప్రస్తుతం ఈ ఫోన్‌పై ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన కార్డులపై EMI ఆప్షన్‌లను కూడా అందిస్తోంది. ఈ వివో ఫోన్‌ ట్విలైట్‌ బ్లూ, ఆర్కిటిక్‌ వైట్‌ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది.

క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ :
వివో T4R 5G స్మార్ట్‌ఫోన్‌ 6.77 అంగుళాల FHD+ క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. HDR10+, SGS సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత FuntouchOS 15 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్‌ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతుందని వివో చెబుతోంది.

50MP కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 2MP బొకేష్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలు 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తాయని వివో తెలిపింది.

ఫాస్ట్‌ ఛార్జింగ్‌ :
ఈ ఫోన్ AI Transcript, AI Document, AI Note Assist, AI Screen Translation, సర్కిల్‌ టు సెర్చ్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 44W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5700mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్‌ 5.4, WiFi, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo T4R 5G Smartphone with Quad Curved Amoled Display gets Rs1000 discount on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X