Home
Deal of the day

రూ.15 వేల ధరలో 5G ఫోన్‌ కోసం చూస్తున్నారా.. 6500mAh బ్యాటరీ, 50MP కెమెరా సహా సూపర్‌ ఫీచర్లతో..!

Vivo T4x 5G Smartphone : భారత్‌ మార్కెట్‌ లో ఈ సంవత్సరం వివో సంస్థ T4 సిరీస్‌, V50, V60 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్‌ చేసంది. ఇందులో భాగంగా అందుబాటులోకి వచ్చిన వివో T4x 5G స్మార్ట్‌ఫోన్‌ ను ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ 6500mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లే, 50MP కెమెరాను కలిగి ఉంది. డిజైన్ పరంగానూ ఈ హ్యాండ్‌సెట్‌ ఆకట్టుకుంటుంది.

వివో ఫోన్ ధర వివరాలు :
వివో T4x 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల సమయంలో 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.13,999, 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.14,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.16,999 గా ఉండేది. ప్రస్తుతం జరుగుతున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బ్యాంగ్‌ దీపావళి 2025 సేల్‌ (Flipkart Big Bang Diwali 2025) లో భాగంగా డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు.

Vivo T4x 5G Smartphone

సేల్ ఆఫర్లతోపాటు బ్యాంకు డిస్కౌంట్‌లు :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ధరలు రూ.13499, రూ.14499, రూ.16499 గా ఉంది. SBI బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్‌లపై కనిష్ఠంగా రూ.1300 నుంచి రూ.1600 వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు. మొత్తంగా రూ.2 వేల కంటే ఎక్కువ తగ్గింపును పొందవచ్చు.

కలర్‌ వేరియంట్స్ :
వివో T4x 5G స్మార్ట్‌ఫోన్‌ 6.72 అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1050 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ వివో హ్యాండ్‌సెట్‌ గ్లేషియల్‌ టీల్‌, ప్రాంటో పర్పుల్‌, మెరీన్‌ బ్లూ వంటి మూడు కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

Vivo T4x 5G Smartphone

3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ వివో బడ్జెట్‌ హ్యాండ్‌సెట్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Funtouch OS పైన పనిచేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండు ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతుందని వివో హామీ ఇచ్చింది.

50MP AI కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP AI ప్రైమరీ, 2MP బొకేష్‌ లెన్స్‌ను కలిగి ఉంది. దీంతోపాటు డైనమిక్‌ లైట్ రింగ్ అమర్చి ఉంటుంది. ఈ కెమెరా సూపర్‌ నైట్‌ మోడ్‌ను సపోర్టు చేస్తుంది. 4k వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది. 8MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.

6500mAh బ్యాటరీ :
ఈ వివో T4x 5G స్మార్ట్‌ఫోన్‌ AI Erase, AI Photo Enhance వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. మరియు మిలిటరీ గ్రేడ్‌ షాక్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ 44W వైర్ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. తక్కువ ధరలో భారీ బ్యాటరీతో కూడిన 5G ఫోన్‌ కోసం చూస్తున్నవారికి ఈ ఫోన్‌ అనుకూలంగా ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo T4x 5G Smartphone with 6500mAh battery available at rs13499 on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X