50MP + 50MP + 50MP కెమెరాలు, 6.78 అంగుళాల FHD+ డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ల తయారీ సంస్థ వివో దీపావళి (Vivo Diwali Sale 2024) సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం మార్చి నెలలో విడుదల అయిన వివో V30 5G స్మార్ట్ ఫోన్ ధరను తగ్గించింది. ఆగస్టు నెలలో తొలిసారి ఈ హ్యాండ్ సెట్ ధరను రూ.2000 తగ్గించిన వివో.. తాజాగా దీపావళి సందర్భంగా మరో రూ.2000 తగ్గించింది. ఈ నిర్ణయం మూడు వేరియంట్‌లకు కూడా వర్తిస్తుందని తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్ 50MP ప్రైమరీ కెమెరా, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. 6.78 అంగుళాల FHD+ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది.
భారత్ మార్కెట్‌లో వివో V30 5G స్మార్ట్‌ఫోన్ (Vivo V30 5G Smartphone Price Cut) మార్చి 2024 లో విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ మూడు స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లలో లభిస్తుంది. విడుదల సమయంలో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.33999 గా ఉంది.

ఈ హ్యాండ్‌సెట్‌పై ఇప్పటి వరకు రెండు సార్లు ధరలను తగ్గించింది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది. అయితే అమెజాన్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ను మరింత తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. రూ.29,410 కే సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు బ్యాంకు కార్డుల ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు. అమెజాన్ లో కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పైన క్లిక్ చేయండి.
వివో V30 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు,
వివో V30 5G స్మార్ట్ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.78 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 2800*1260 పిక్సల్స్ రిజల్యూషన్, 2800 గరిష్ఠ బ్రైట్‌నెస్ తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత FuntouchOS 14 OS ను కలిగి ఉంది.
80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు :
ఈ వివో V30 5G స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. 12GB ర్యామ్ మరియు 256GB UFS 3.1 తో జతచేయబడి ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్ అల్ట్రా కూలింగ్ సిస్టమ్ ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ వివో ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
50MP + 50MP + 50MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్ సెట్ ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP బోకేష్ కెమెరాలను కలిగి ఉంది. ముందువైపు ఈ హ్యాండ్‌సెట్ 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. కెమెరాల పరంగా మెరుగైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








