6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, ఆకట్టుకొనే డిజైన్‌తో వివో 5G స్మార్ట్‌ఫోన్!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో ( Vivo India ) నుంచి గత నెలలో వివో X200T స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ప్రీమియం ధర సెగ్మెంట్ లో ఈ హ్యాండ్‌సెట్ అందుబాటులోకి వచ్చింది. వివో నుంచి V70 సిరీస్ స్మార్ట్‌ఫోన్ లు ఫిబ్రవరి 19 వ తేదీన లాంచ్ కానున్నాయి. ఈ సిరీస్ లో భాగంగా వివో V70, వివో V70 ఇలైట్ మోడల్స్ అందుబాటులోకి రానున్నాయి.
అయితే గత సంవత్సరం వివో Y31 స్మార్ట్‌ఫోన్ ( Vivo Y31 5G Smartphone ) విడుదల అయింది. ఈ ఫోన్ ఆకట్టుకొనే డిజైన్ ను కలిగి ఉంది. 6500mAh బ్యాటరీ, 50MP కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు IP68, IP69 రేటింగ్ ను కలిగి ఉంది. బడ్జెట్ ధరలో ఫోన్‌ల కోసం చూస్తున్న వారికి ఈ హ్యాండ్‌సెట్ ఓ ఆప్షన్ గా నిలిచే అవకాశం ఉంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్ లు, ఫీచర్ల పూర్తి వివరాలు.

రూ.16999 ప్రారంభ ధరకు :
ఫ్లిప్‌కార్ట్ లో వివో Y31 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.18499 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ ను పొందవచ్చు.
డిస్‌ప్లే, కలర్ వేరియంట్స్ :
ఈ వివో ఫోన్ 6.68 అంగుళాల LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ డైమండ్ గ్రీన్, రోజ్ రెడ్ కలర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది.
3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 SoC ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.
50MP కెమెరా, 6500mAh బ్యాటరీ :
ఈ వివో Y31 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా సహా మరో కెమెరా కూడా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 8MP కెమెరా ఉంది. 44W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
ఫింగర్ ప్రింట్ స్కానర్ :
కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 5G, 4G LTE, వైఫై, బ్లూటూత్, GPS, OTG, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. యాంబియంట్ లైట్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్, యాక్సెలిరోమీటర్ వంటి సెన్సర్‌లున్నాయి. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.


Click it and Unblock the Notifications








