Home
Deal of the day

3D కర్వడ్‌ డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరా, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు 5G ఫోన్‌పై డిస్కౌంట్‌!

Vivo Y400 Pro 5G Smartphone : భారత్‌ మార్కెట్‌ లో వివో సంస్థ ఈ సంవత్సరం T4 సిరీస్‌, V50, V60 సిరీస్‌, Y సిరీస్‌ లో అనేక మోడల్స్‌ ను తీసుకొచ్చింది. అయితే ఈ సంవత్సరం జూన్‌ లో వివో Y400 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది. ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 7.49mm థిక్‌నెస్‌ ఉంది. 3D కర్వడ్‌ డిస్‌ప్లే, ఫాస్ట్‌ ఛార్జింగ్‌, సోనీ కెమెరాతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.

వివో Y400 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ వివరాలు :
ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌ లో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.25999, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.27999 గా ఉంది. యాక్సెస్‌ బ్యాంకు, ICICI, కోటక్‌ బ్యాంకుల క్రెడిట్‌ కార్డుల EMI లావాదేవీలపై రూ.2000 డిస్కౌంట్‌ ను అందిస్తోంది.

Vivo Y400 Pro 5G Smartphone

ఈ డిస్కౌంట్ ఆఫర్‌ తో ఈ 400 ప్రో 5Gఫోన్‌ ను రూ.23999, రూ.25999 ధరకు కొనుగోలు చేయవచ్చు. వివో Y400 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ ఫెస్ట్‌ గోల్డ్‌, ఫ్రీస్టైల్‌ వైట్‌, నెబులా పర్పుల్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

వివో Y400 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.77 అంగుళాల FHD+ 3D కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 300Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ ను కలిగి ఉంది. వెట్‌ టచ్‌ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. IP65 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

వివో స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoC ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ 8GB LPDDR4X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలున్నాయి. 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ కెమెరాల ద్వారా 4k వీడియోను రికార్డు చేయవచ్చు. AI Erase 2.0, AI Photo Enhance ఫీచర్లు ఉన్నాయి.

వివో స్మార్ట్‌ఫోన్‌ 90W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ సర్కి్ల్‌ టు సెర్చ్‌, AI Super Link, AI Note Assist, AI Transcript, AI స్క్రీన్‌ ట్రాన్స్‌లేషన్ వంటి ఫీచర్‌ లు ఉన్నాయి. 5G, 4G, Wi-Fi, బ్లూటూత్‌ 5.4, GPS, USB-C ఛార్జింగ్ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్‌ లు ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo Y400 Pro 5G Smartphone with mediatek dimensity 7300 Chip gets Rs2000 discount in amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X