మీ బెడ్‌రూం కొత్తగా కనిపించాలంటే..

Written By:

రోజు రోజుకు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. మార్కెట్లోకి కొత్త కొత్త గాడ్జెట్స్ వచ్చి హల్ చల్ చేస్తున్నాయి. ఇక మన ఇంటిలో అయితే కిచెన్ దగ్గర నుంచి బెడ్ రూం దాకా అన్నీ టెక్నాలజీతో ముడిపడిన గాడ్జెట్స్ తో నింపేస్తాం. అయితే అవి మనకంటికి ఇంపుగా కనిపించకపోవచ్చు..ముఖ్యంగా బెడ్ రూం లో అయితే అలంకరణ చాలా అందంగా తయారుచేసుకోవాలనుకుంటాం. అయితే బెడ్ రూంని గాడ్జెట్స్ తో అలంకరించాలనుకునే టెక్ ప్రియుల కోసం కొన్ని గాడ్జెట్స్ ఇస్తున్నాం ఓ సారి ట్రై చేయండి.

Read more: ఆన్‌లైన్‌లో ఉచిత సంగీతాన్నందించే వెబ్‌సైట్లు ఇవే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొయ్య దిమ్మె

ఈ కొయ్య దిమ్మ లైట్ మీ బెడ్ రూంని మరింత అందంగా ఉంచుతుంది. దీనికి స్విచ్ ఆఫ్ అలాగే స్విచ్ ఆన్ బటన్స్ కూడా ఉంటాయి. మీరు దీన్ని ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు.

పరుపు

8 ఇంచ్ పరుపులో మీరు సుఖంగా నిద్రపోవాలనుకుంటారు కదా. దీనిని కొంచెం తెలివి ఉపయోగించి వైర్ లైస్ రిమోట్ గా మార్చుకుంటే సుఖంగా నిద్రపోవచ్చు.

ప్రాజెక్టర్

ఇది మీ గోడని చాలా అందంగా ఉంచుతుంది. 147 ఇంచుల ఇమేజ్‌ని మీ గోడమీద సెట్ చేసుకున్నట్లయితే మీకు చాలా అందంగా కనిపిస్తుంది.

వితింగ్స్ ఆరా

ఇదొక అలారం క్లాక్ లాగా పనిచేస్తుంది. అయితే చాలా ఢిపరెంట్ గా ఉంటుంది. ఈ లైటు మిమ్మల్నిమంచి మ్యూజిక్ తో నిద్రలేపుతుంది.

అవియా బల్బ్

ఇదొక బల్బ్. కరెంట్ బిల్లు వాచిపోతున్న తరుణంలో ఈ లైట్లు కరెంట్ ని చాలావరకు ఆదాచేస్తాయి. అంతేకాకుండా మీ బెడ్ రూంకి మరింత అందాన్ని తెస్తాయి.

నెస్ట్ లెర్నింగ్ ధర్మోస్టాట్

ఇది మీ బెడ్ రూంలో టెంపరేచర్ ని ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. దీనిని మీరు వైఫైతో కనెక్ట్ చేసుకున్నట్లయితే మీ ఫోన్ అలాగే ట్యాబ్లెట్ ,ల్యాప్ టాప్ టెంపరేచర్లని ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది.

శాంసంగ్ 4కె టివి

శాం సంగ్ నుంచి వచ్చిన ఈ హై ఢిపినేషన్ టీవీ లో మీరు కావలసిన సినిమాలు చూడొచ్చు.

హైకు ఫ్యాన్స్

ఇదొక కొత్త టెక్నాలజీ ఫ్యాన్. మీ పవర్ ని మరింతగా ఆదా చేస్తుంది. నీవు రూంలోకి ఎంటర్ కాగానే దానిపాటికదే ఆన్ అవుతుంది. అలాగే నీవు బయటకు వెళ్లగానే అదే ఆగిపోతుంది.

8 స్లీప్ ట్రాకర్

ఇదొక అత్యాధునిక పరికరం. మీకు సుఖంగా నిద్రపట్టేలా చర్యలు తీసుకుంటుంది.

అలారం క్లాక్

ఇదొక అలారం మీ బెడ్ రూంలో మీ బెడ్ కే అమర్చబడి ఉంటుంది. వైర్ లెస్ ప్యానల్ తో మిమ్మల్ని అనుకున్న సమయానికి నిద్రలేపుతుంది. మీరు కోడ్ సెట్ చేసుకుంటే చాలు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot