వినియోగదారుల కోసం 10 అమెజాన్ అలెక్సా ఫీచర్స్

Posted By: ChaitanyaKumar ARK

అమెజాన్ ఎకో గురించి తెలియని గాడ్జెట్ ప్రేమికులు ఉండరు. ఈ అమెజాన్ ఎకో గత సంవత్సరం ఆసియా మార్కెట్ లో అడుగు పెట్టడానికి చాలా సమయమే తీసుకుంది అని చెప్పవచ్చు. నిజానికి అమెజాన్ వర్చ్యువల్ అసిస్టెంట్ అయిన అలెక్సా 3 సంవత్సరాల క్రితమే ప్రవేశపెట్టబడింది. ఇప్పుడు అమెజాన్ ఈ అలెక్సా కు సరికొత్త ఫీచర్లను జత చేసింది. ఈ ఫీచర్లలో భారతదేశపు వినియోగదారులకు ఉపయోగపడేలా కొన్నిటికి మార్పులు కూడా చేయబడినవి. అందులో 10 ఉత్తమమైనవి మీకోసం ఇక్కడ పొందుపరచడం జరిగినది. ఈ ఫీచర్స్ లో ఎక్కువగా స్థానిక సర్వీసుల గురించి దృష్టిసారించడం జరిగినది. అందులో ముఖ్యంగా OLA, UBER.

ఐపీఎల్ అభిమానులకు మినిట్ టూ మినిట్ కిక్కునిచ్చే యాప్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

OLA,UBER సర్వీసులను పొందడం:

అలెక్సా వినియోగదారులు తమ OLA, UBER అకౌంట్స్ ను అలెక్సా కు జతచేయడం ద్వారా , వర్చ్యువల్ అసిస్టెంట్ మీకు కాబ్ బుక్ చేయడం లో సహాయం చేస్తుంది. మీరు వాయిస్ కమాండ్స్ తోనే కాబ్ బుక్ చేసుకునేలా పొందుపరచబడినది.

 

 

Smart home products ను కంట్రోల్ చేయండిలా:

కొంతమంది ఇంట్లో స్మార్ట్ ప్రోడక్ట్స్ వినియోగిస్తుంటారు, ఉదాహరణకు google HOME. వీటిని అలెక్సా నుండే కంట్రోల్ చేయవచ్చు. కానీ మనదేశంలో google home అందుబాటులో లేదు. మరేదైనా స్మార్ట్ ప్రాడక్ట్స్ అలెక్సా సపోర్ట్ చేసేవి ట్రై చేయండి.

అమెజాన్ నుండి కొనుగోలు చేయండి:

ఏవైనా వస్తువులు, పుస్తకాలు, గాడ్జెట్స్ మొదలైనవాటిని అమెజాన్ నుండి కొనుగోలు చేయాలని భావించిన ఎడల , కేవలం వాయిస్ కమాండ్స్ తో కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు " అలెక్సా ఆర్డర్ లైట్ బల్బ్ " . మీరు ఇలా అడిగిన వెంటనే ఒకసారి ఆర్డర్ హిస్టరీను కూడా పరిశీలించి, మిమ్ములను కంఫార్మ్ చేయమని అడుగుతుంది. తద్వారా మీరు చెప్పిన విధంగా ముందుకు సాగుతుంది.

Zomoto నుండి ఫుడ్ ఆర్డర్ చేయండి:

Zomoto ఆహారపదార్ధాలను పేరెన్నికగల రెస్టారెంట్స్ నుండి వినియోగదారులకు చేరవేసే ఫ్లాట్ఫార్మ్. మీరు మీ zomoto అకౌంట్ ను జతచేయడం ద్వారా, మీరు వాయిస్ కమాండ్స్ ద్వారా నేరుగా ఫుడ్ ఆర్డర్ చేసే వెసులుబాటు కల్పించబడింది. ఇది zomoto సర్వీసులు అందుబాటులో ఉన్న ప్రాంతాలలో ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది .

స్కోర్ వివరాలను కూడా పొందండి:

ఏదైనా మాచ్ (క్రికెట్, హాకీ ect ... ) సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు కావాలన్నా, మీరు నేరుగా వాయిస్ కమాండ్స్ ద్వారా అలెక్సా ని అడిగి పొందవచ్చు. మాచ్ పేరు చెప్పడం ద్వారా మాచ్ సంబంధించిన పూర్తి నివేదికను అలెక్సా మీకు అందిస్తుంది.

బ్రేకింగ్ న్యూస్ కోసం:

అలెక్సా ప్రపంచంలోని అనేక న్యూస్ ప్రొవైడర్స్ తో అనుసంధానించబడి ఉంటుంది. తద్వారా మీరు ప్రపంచంలో ఎక్కడి వివరాలనైనా అలెక్సాను అడిగి తెలుసుకునే వీలు కల్పించబడింది. అంతేకాకుండా వాతావరణ వివరాలు కూడా అడిగి తెలుసుకోవచ్చు.

Prime music ను ఆస్వాదించండి :

అమెజాన్ prime మ్యూజిక్ ఇప్పుడు భారతదేశంలో కూడా అందుబాటులో ఉంది. తద్వారా మీరు అమెజాన్ prime మ్యూజిక్ లోని పాటలను అలెక్సా ద్వారా వినగలిగే సౌకర్యం కల్పించబడింది. అమేజాన్ prime లో classical rock, heavy metal, reggae, electronica etc కలెక్షన్లతో కూడిన పాటలను పొదుపరచి ఉంటాయి. మీరు మీ స్థానిక భాషల పాటలను కూడా వినే సౌకర్యం అమెజాన్ prime మ్యూజిక్ లో ఉంది.

మీరు అలెక్సాను జోక్స్ అడగొచ్చు కూడా :

మీరు అలెక్సాను ఏదైనా జోక్ అడిగి వినే సౌకర్యం కూడా ఉంది. జోక్ ఒక్కో సందర్భంలో నవ్వు తెప్పించకపోవచ్చు. కానీ ఈ సౌలభ్యం మాత్రం ఎంతో ఉపయోగపడుతుంది.
గేమ్స్ ఆడవచ్చు కూడా:
అలెక్సా కొన్ని మైండ్ గేమ్స్ తో నిండి ఉంటుంది, తద్వారా గంటల సమయం వెచ్చించే విధంగా అలెక్సా తో గేమ్స్ ఆడుకోవచ్చు. "Alexa, let's play a game" అని అడిగి ఆటలను ప్రారంభించండి మరి.

కాల్స్ చేయండి :

అమెజాన్ ఎకో డివైజ్ కలిగిన మీ ఫ్రెండ్స్ , మరియు కుటుంబ సభ్యులకు అలెక్సా నుoడి నేరుగా కాల్ చేయవచ్చు. అది కూడా ఫ్రీ గానే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Amazon Echo spent quite a lot of time being tweaked and tuned before it made its debut in the Asian market last year.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot