Home
Gadgets

స్మార్ట్‌ఫోన్లపై దిమ్మతిరిగే న్యూస్, మీ ఫోన్లు ఇక మూలకే !

పదేళ్ల క్రితం ఊహించని ఎన్నో వస్తువులు నేడు మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి.మరో పదేళ్లలో ఇవి మూలన పడి కొత్తవి వస్తాయి.

రోజు రోజుకి సాంకేతిక కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త వస్తువులు మార్కెట్లోకి వస్తున్నాయి. పాతవన్నీ మూలకు పడిపోతున్నాయి. పదేళ్ల క్రితం ఊహించని ఎన్నో వస్తువులు నేడు మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి. మరో పదేళ్లలో ఇవి మూలన పడి కొత్తవి వస్తాయి. ఈ నేపథ్యంలో వచ్చే పదేళ్లలో మాయం కావచ్చని టెక్ నిపుణులు భావిస్తున్న గాడ్జెట్స్ వివరాలివి.

స్మార్ట్‌ఫోన్లు

స్మార్ట్‌ఫోన్లు

ఈ వార్తని నమ్మడం లేదు కదూ.. కాని నిజం..మరో పదేళ్లలో స్మార్ట్‌ఫోన్లు అంతరించి పోవచ్చని అంచనా. వీటి స్థానంలో గ్లాస్ ఆధారిత స్క్రీన్లు మీ ఆఫీస్ టేబుల్ పై, గోడలపై, ఇండ్లలో ఉండవచ్చు. మీకు సంబంధించిన సమస్త సమాచారం ప్రపంచంలో ఎక్కడైనా, ఎప్పుడైనా అందుబాటులోకి వచ్చేస్తుంది. ఇక ఫోన్ కాల్స్ కోసం వైర్‌లెస్ ఇయర్ బడ్స్ వస్తాయి.

 ప్లాస్టిక్ మనీ

ప్లాస్టిక్ మనీ

ఎంతో కీలకంగా ఉన్న క్రెడిట్, డెబిట్ కార్డులు రానున్న పదేళ్లలో మాయం అవుతాయట. వీటి స్థానంలో ఐరిస్ వచ్చేస్తోంది. ఏదైనా ఆన్ లైన్లో ఆర్డర్ చేయడం, తెచ్చుకోవడమే జరుగుతుంది. కంటి ద్వారానే ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. కార్డు అక్రమాలకు చెక్ చెప్పేందుకు ఈ విధానం ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తోంది.

వాల్ మౌంటెడ్ టీవీలు

వాల్ మౌంటెడ్ టీవీలు

ప్రస్తుతం రాజ్యమేలుతున్న ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీలు కూడా మరో పదేళ్లలో మాయం కావచ్చు. వీటి స్థానంలో మిర్రర్ ఫినిష్డ్ డిస్ ప్లేలు వస్తాయి. ఇప్పటికే ఈ తరహా టీవీలు కొన్ని మార్కెట్లోకి వచ్చినా, పూర్తి స్థాయి అందుబాటులోకి రాలేదు. ఉత్పాదన పెరిగి ధర దిగివస్తే, కేవలం రెండు సెంటీమీటర్ల మందంతో టీవీలు వచ్చేస్తాయి.

 రిమోట్ కంట్రోల్స్

రిమోట్ కంట్రోల్స్

టీవీల నుంచి ఎయిర్ కండిషనర్ల వరకూ దూరంగా ఉండి నియంత్రించేందుకు సహకరిస్తున్న రిమోట్ కంట్రోల్స్ కూడా అంతరించి పోతున్నాయి. వీటి స్థానంలో వాయిస్, గెస్చర్ విధానాల్లో నియంత్రణ సులువవుతుంది. ఇంట్లో మనిషి కాలు పెట్టగానే గుర్తించి ఏసీ ఆన్ కావడం, ఫలానా చానల్ కావాలంటే అది వచ్చేయడం జరిగిపోతుంది. మోషన్ సెన్సార్లది కీలక పాత్రగా మారి రిమోట్ మూలన పడుతుంది.

కార్డ్ లెస్ ల్యాండ్ లైన్

కార్డ్ లెస్ ల్యాండ్ లైన్

ఇప్పటికే వీటి వినియోగం భాగా తగ్గిపోయింది. భవిష్యత్తులో ఇంట్లో అక్కడక్కడా ఏర్పాటు చేసే మైక్రో ఫోన్స్, స్పీకర్ల ద్వారా తిరుగుతూ కార్డ్ లెస్ ఫోన్, చేతిలో సెల్ ఫోన్ లేకుండానే మాట్లాడుకునే సౌలభ్యం దగ్గర కానుంది.

ల్యాప్‌టాప్‌లు

ల్యాప్‌టాప్‌లు

ల్యాప్ టాప్ ల స్థానంలో వర్చ్యువల్ కీ బోర్డులు రాజ్యమేలుతాయి. టేబుల్ పైనే అక్షరాలు ఉన్నాయని భావిస్తూ టైప్ చేస్తుంటే అదే టేబుల్ ఉపరితలమే స్క్రీన్ గా కూడా పనిచేసే సాంకేతికత అందుబాటులోకి రావడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. ఇక కంప్యూటర్లదీ ఇదే పరిస్థితి.

ఎక్స్ టర్నల్ హార్డ్ డ్రైవ్

ఎక్స్ టర్నల్ హార్డ్ డ్రైవ్

గిగాబైట్ల సమాచారం చిన్న చిన్న చిప్ లలో ఇమిడిపోతున్న వేళ, భారీగా ఉండే ఎక్స్ టర్నల్ హార్డ్ డ్రైవ్ లు కనుమరుగై పోనున్నాయి. దీంతో పాటు సమాచారమంతా క్లౌడ్ విధానంలో దాచుకుంటూ ఉండటం కూడా హార్డ్ డ్రైవ్ ల అవసరాన్ని తగ్గిస్తోంది.

డెస్క్‌టాప్స్

డెస్క్‌టాప్స్

ఇవి కనుమరుగై వీటి స్థానంలో కొత్తవి వస్తాయి. డేటా సమాచారాన్ని ఎక్కడికైనా తీసుకువెళ్లే పరికరాలు రాజ్యమేలుతాయి.

వాచీలు

వాచీలు

ఈ రోజుల్లో వాచీలు పెద్ద ఫ్యాషన్ అన్నది అందరికీ తెలిసిందే. వీటి స్థానంలో ఇప్పుడు మల్టీ టాస్కింగ్ స్మార్ట్‌వాచీలు రాజ్యమేలుతాయి. ఈస్మార్ట్ వాచీలే కొత్త టెక్నాలజీతో దూసుకువస్తాయి.

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
10 gadgets that may disappear in the next decade Read more At Gizbot Telugu News
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X