మీరు వాడుతోన్న గాడ్జెట్స్ విషయంలో ఆ తప్పులు చేయకండి

గాడ్జెట్‌ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్ల వాటి పనితీరు పూర్తిగా మందగించి ఎందుకు పనికిరాకుండా పోయే ప్రమాదముందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

|

కొత్తగా కొనుగోలు చేసిన గాడ్జెట్‌ల పై ఎనలేని మక్కువ చూపిస్తాం. కాలక్రమంలో ఆ మక్కువ కాస్తా తగ్గుముఖం పట్టి చివరాకరకు ఎక్కడపడితే అక్కడ వదిలేసే పరిస్థితికి వస్తాం. ఇలా చేయటం మంచి పద్ధతి కాదంటున్నారు టెక్నాలజీ నిపుణులు. గాడ్జెట్‌ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్ల వాటి పనితీరు పూర్తిగా మందగించి ఎందుకు పనికిరాకుండా పోయే ప్రమాదముందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. మీ గాడ్జెట్‌లను మీరే నాశనం చేసుకుంటున్నారనటానికి 10 ఉదాహరణలు..

మంచం పై ల్యాప్‌టాప్‌ వద్దు..

మంచం పై ల్యాప్‌టాప్‌ వద్దు..

ల్యాప్‌టాప్‌లను బెడ్ పై ఉంచటం మీకు కంఫర్ట్‌గా అనిపించవచ్చు. లాంగ్ రన్‌లో ఇది మంచి అలవాటు కాదు. మంచం పరుపు పై ల్యాప్‌టాప్‌లను ఎక్కువ కాలం ఉంచటం వల్ల మరింత వేడి ఉత్పన్నమై లోపల కాంపోనెంట్‌లు దెబ్బతినే ప్రమాదముంది.

గాలి అందక ఒత్తిడి పెరిగే ఛాన్స్..

గాలి అందక ఒత్తిడి పెరిగే ఛాన్స్..

ముఖ్యంగా మహిళలు తమ ఫోన్‌లను పదేపదే హ్యాండ్‌బ్యాగ్‌లలో పడేస్తుంటారు. ఈ క్రమంలో ఫోన్ పై ఒత్తిడి పెరిగి స్ర్కీన్ పై పగుళ్లు, గీతలు వంటివి ఏర్పడే ప్రమాదముంది.

క్రమ పద్ధతిలో మడత పెట్టండి..

క్రమ పద్ధతిలో మడత పెట్టండి..

ఫోన్‌కు సంబంధించి ఛార్జింగ్ కేబుల్స్ లేదా హెడ్‌ఫోన్‌లను పదేపదే మడత పెట్టడం వల్ల అవి త్వరగా బ్రేక్ అయ్యే ప్రమాదముంది.

వేడి పెరిగితే ప్రమాదమే..

వేడి పెరిగితే ప్రమాదమే..

కొంత మంది తమ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లకు ఛార్జింగ్ పెట్టి అలానే వదిలేస్తారు. ఇది చాలా ప్రమాదకరమై చర్య. ఓవర్ చార్జింగ్ కారణంగా గాడ్జెట్‌లు బరస్ట్ అయి అగ్నిప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది.

కెమికల్స్‌కు దూరంగా ఉండండి...

కెమికల్స్‌కు దూరంగా ఉండండి...

గాడ్జెట్‌లను క్లీన్ చేసేందుకు రకరకాల కెమికల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాస్తవానికి, వీటిని ఉపయోగించటమనేది సరియైన పద్దతి కాదు. కఠినమైన ధ్రవ పదార్థాలతో తయారయ్యే కెమికల్ మీ డివైస్ ప్లాస్టిక్ భాగాలను దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదు. సాధ్యమైనంత వరకు మీ ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్‌ఫోన్‌ను మెత్తటి తడిగుడ్డతో క్లీన్ చేయండి.

హార్డ్‌డ్రైవ్ ఎప్పుడైనా క్రాష్ అవ్వొచ్చు, కాబట్టి...

హార్డ్‌డ్రైవ్ ఎప్పుడైనా క్రాష్ అవ్వొచ్చు, కాబట్టి...

మీ కంప్యూటర్ హార్డ్‌డ్రైవ్ ఎప్పుడైనా క్రాష్ అవ్వొచ్చు. అలానే మీ ఫోన్ కూడా ఏదో ఒక సమయంలో పనిచేయకుండా పోవచ్చు. కాబట్టి, మీ ఫోన్ అలానే కంప్యూటర్‌లోని డేటాను ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకోవటం ఉత్తమం.

అలానే ఉంచేస్తే..

అలానే ఉంచేస్తే..

రోజువారి కమ్యూనికేషన్ అవసరాల్లో భాగంగా మన కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌కు రకరకాల డివైస్‌లను కనెక్ట్ చేయవల్సి ఉంటుంది. వీటిని ఎంతైతే జాగ్రత్తగా connect చేస్తామో అంతే జాగ్రత్తగా Disconnect చేయాలంటున్నారు నిపుణులు. Eject ప్రక్రియ సక్రమంగా లేనట్లయితే డేటా కరప్ట్ అయ్యే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మధ్యమధ్యలో గ్యాప్ తప్పనిసరి..

మధ్యమధ్యలో గ్యాప్ తప్పనిసరి..

చాలామంది తమ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లను నిరంతరాయంగా వాడేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదంటున్నారు నిపుణులు. వీటిని ఎక్కువ గంటలు వినియోగించే క్రమంలో మధ్యమధ్యలో గ్యాప్ ఇస్తూ ఉండాలని వీరు చెబుతున్నారు.

సున్నితంగా హ్యాండిల్ చేయాలి..

సున్నితంగా హ్యాండిల్ చేయాలి..

ల్యాప్‌టాప్ కీబోర్డ్ బటన్‌ల పై ఎక్కువ ఒత్తిడి తీసుకురావటం వల్ల అవిత్వరగా మన్నికను కోల్పోయే ప్రమాదముంది.

అక్కడ నిర్లక్ష్యం పనికిరాదు..

అక్కడ నిర్లక్ష్యం పనికిరాదు..

కొంత మంది కంప్యూటర్ డెస్క్ ముందే కూర్చొని టీ, కాఫీ వంటివి తాగేస్తుంటారు. ఇవి పొరపాటున కీబోర్డ్ పై ఒలికినట్లయితే ఎందుకు పనికిరాకుండా పోతాయి.

Best Mobiles in India

English summary
10 mistakes you should never make while using Gadgets. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X