కష్టకాలంలో ఆదుకునే పవర్ బ్యాంక్స్, మేలైనవి సెలక్ట్ చేసుకోండి

|

ఈ రోజుల్లో చాలామందిని ప్రధానంగా వేధిస్తున్న సమస్య ఫోన్ చార్జింగ్, ఎంత ఎక్కువ బ్యాటరీ ఉన్న ఫోన్ అయినా ఎక్కువ సమయం ఛార్జింగ్ ఉండదు. ఇంటర్నెట్ వాడటం మొదలెడితే ఛార్జింగ్ చాలా త్వరగా అయిపోయి ఒక్కోసారి చికాకు పుట్టిస్తుంటుంది. ఇలాంటి వారు ఎక్కువగా పవర్ బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. అయితే పవర్ బ్యాంకుల కొనుగోలు సమయంలో కొంచెం జాగ్రత్తగా లేకుండా ఏది బడితే అది కొనేస్తుంటారు. ఇలాంటి సంధర్భాలు కూడా మనకు చికాకు తెప్పిస్తుంటాయి. కాబట్టి ఎక్కువ కాలం మన్నే నాణ్యమైన పవర్‌ బ్యాంకులు కొనుగోలు చేయడం మంచిది. ఇందులో భాగంగా ప్రస్తుత మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని మేలైన పవర్‌ బ్యాంకులు లిస్ట్ ఇస్తున్నాం. వాటిని జాగ్రత్తగా పరిశీలించి మీ అభిరుచికి అనుగుణంగా ఎంపిక చేసుకున్నట్లయితే ఛార్జింగ్‌ సమస్య తీరడంతో పాటు చాలా వరకు డబ్బు కూడా ఆదా అవుతుంది.

 

రూ.499 ప్లాన్లలో ఏదీ బెస్ట్, 82 రోజులకు పైన వ్యాలిడిటీతో...రూ.499 ప్లాన్లలో ఏదీ బెస్ట్, 82 రోజులకు పైన వ్యాలిడిటీతో...

10000mAh Mi Power Bank 2i

10000mAh Mi Power Bank 2i

ధర రూ.899.
10,000 ఎంఏహెచ్‌ సామర్థ్యం దీని ప్రత్యేకత. 240 గ్రాముల బరువు ఉంటుంది. డ్యూయల్‌ యూఎస్‌బీ పోర్ట్‌ ఉండటం వల్ల ఒకేసారి రెండు ఫోన్లు ఛార్జ్‌ చేసుకోవచ్చు. 5v/2A, 9V/2A ఇన్‌పుట్‌ను సపోర్టు చేస్తూ..18 వాట్స్‌ అవుట్‌ పుట్‌ను అందిస్తుంది. ఈ పవర్ బ్యాంక్‌ 4 గంటల 20 నిమిషాల్లో ఫుల్ చార్జ్ అవుతుంది. ఆయా డివైస్‌లు వేగంగా చార్జింగ్ అవుతాయి. అందుకు గాను ఈ పవర్ బ్యాంకుల్లో గరిష్టంగా 15 వాట్ల పవర్ ఔట్‌పుట్‌ను ఇస్తున్నారు. ఇక ఈ పవర్‌బ్యాంక్‌లపై 4 ఎల్‌ఈడీ లైట్లు ఉన్నాయి. ఇవి వాటిలో ఉన్న బ్యాటరీ చార్జింగ్‌ను సూచిస్తాయి.

20000mAh Mi Power Bank 2i
 

20000mAh Mi Power Bank 2i

ధర రూ.1599.
20,000 ఎంఏహెచ్‌ సామర్థ్యంతో, లిథియం పాలిమర్‌ తో ఈ పవర్‌ బ్యాంక్‌ వచ్చింది. దీని ద్వారా రెండు మొబైల్స్‌ని ఒకేసారి ఛార్జింగ్‌ పెట్టినా దాదాపు 5.1V/3.6A అవుట్‌పుట్‌ వస్తుంది. 358 గ్రాముల బరువు ఉంటుంది. బ్లూటూత్‌ హెడ్‌సెట్స్‌, ఫిట్‌నెస్‌ డివైస్‌ లాంటి చిన్నపాటి గాడ్జెట్స్‌ను కూడా ఛార్జ్‌ చేసుకోవచ్చు. ఈ పవర్ బ్యాంక్‌ 4 గంటల 20 నిమిషాల్లో ఫుల్ చార్జ్ అవుతుంది. ఆయా డివైస్‌లు వేగంగా చార్జింగ్ అవుతాయి. అందుకు గాను ఈ పవర్ బ్యాంకుల్లో గరిష్టంగా 15 వాట్ల పవర్ ఔట్‌పుట్‌ను ఇస్తున్నారు. ఇక ఈ పవర్‌బ్యాంక్‌లపై 4 ఎల్‌ఈడీ లైట్లు ఉన్నాయి. ఇవి వాటిలో ఉన్న బ్యాటరీ చార్జింగ్‌ను సూచిస్తాయి.

lenovo 13000 mah power bank

lenovo 13000 mah power bank

ధర రూ.1099.
13,000ఎంఏహెచ్‌ సామర్థ్యం. బరువు కేవలం 281 గ్రాములు మాత్రమే. 5V ఇన్‌పుట్, 5V/2.1A, 5v/1A అవుట్‌పుట్‌ దీని ప్రత్యేకత. దీనికి కూడా రెండు యూఎస్‌బీ పోర్టులుంటాయి. దీని ద్వారా స్మార్ట్‌ ఫోన్లతో పాటు డిజిటల్‌ కెమెరా, టాబ్లెట్‌, ఇతర మీడియా ఉపకరణాలనూ ఛార్జ్‌ చేసుకోవచ్చు.

Syska 10000 mAh Power Bank

Syska 10000 mAh Power Bank

ధర రూ.1799.
10,000 ఎంఏహెచ్‌ సామర్థ్యంతో ఐసీ ప్రొటెక్షన్‌ సిస్కా పవర్‌ తో వచ్చింది. ఎక్కువగా ఛార్జ్‌ అవ్వడం లేదా తొందరగా డిశ్చార్జ్‌ అయిపోవడం, షార్ట్‌ సర్క్యూట్‌ తదితర సమస్యలు ఇందులో ఉండవు. ఇంటెలిజెంట్‌ పవర్‌ మేనేజ్‌ ఆఫ్‌ స్విచ్‌ బటన్ దీని‌ మరో ప్రత్యేకత. దీని వల్ల పవర్‌ బ్యాంక్‌ పనితీరు స్థిరంగా ఉంటుంది. ఇది 277 గ్రాముల బరువుంటుంది. ఈ పవర్‌ బ్యాంక్‌ 5V/1A, 5V/2.1A అవుట్‌ పుట్ ఇస్తుంది. ఇది బ్లాక్‌, గ్రే కలర్స్‌లో లభ్యమవుతోంది.

intex it pb 11k power bank

intex it pb 11k power bank

ధర రూ.989.
11,000 ఎంఏహెచ్‌ సామర్థ్యం. ఛార్జ్‌ స్టాటస్‌ను తెలియజేయడానికి ప్రత్యేకమైన ఎల్‌ఈడీ బల్బులు. దీనిని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్‌ చేస్తే దాదాపు నాలుగు మొబైల్స్‌ను ఛార్జ్‌ చేసుకోవచ్చు. దీనికి 5V/1A, 5V/2A, 5V/3A అవుట్‌పుట్‌తో మూడు యూఎస్‌బీ పోర్టులు ఉంటాయి. అంటే ఒకేసారి మూడు డివైజ్‌‌లను ఛార్జ్‌ చేసుకోవచ్చన్నమాట. 280 గ్రాముల బరువు.

intex lithium polymer power bank

intex lithium polymer power bank

ధర రూ.1699.
20,000 ఎంఏహెచ్‌ సామర్థ్యంతో ఇంటెక్స్‌ కంపెనీ మరో పవర్‌ బ్యాంక్‌ను విడుదల చేసింది. అదే ఇంటెక్స్ IT-PBA2K. దీనిలో 2 యూఎస్‌బీ పోర్టులు ఉంటాయి. స్మార్ట్‌ ఫోన్లతో పాటు MP3 ప్లేయర్స్‌, డిజిటల్ కెమెరాలను ఛార్జ్‌ చేసుకోవచ్చు. 5V/ 1A, 5V/2A అవుట్‌పుట్‌ ఇస్తుంది. దీనికి కూడా ఎల్‌ఈడీ బ్యాటరీ ఇండికేటర్స్‌ సదుపాయం ఉంటుంది.

Ambrane P 2000

Ambrane P 2000

దీని ధర రూ.1699.
20,800 ఎంఏహెచ్‌ సామర్థ్యమున్న అంబ్రేన్‌ P-2000 పవర్‌ బ్యాంక్‌లో లిథియం-అయాన్‌ బ్యాటరీ ఉంటుంది. దీనిలో 3 యూఎస్‌బీ పోర్టులు ఉంటాయి. 281 గ్రాముల బరువుంటుంది. ఛార్జ్‌ స్థాయిని తెలుసుకోవడానికి ఎల్ఈడీ బల్బులుంటాయి. వీటినే టార్చ్‌లైట్‌గానూ ఉపయోగించవచ్చు. 5V/ 1A, 5V/2A అవుట్‌పుట్‌ ఇస్తుంది.

ఇంటెక్స్‌ ITPB12.5K

ఇంటెక్స్‌ ITPB12.5K

దీని ధర రూ.1,099.
ఇంటెక్స్‌ ITPB12.5K బ్లాక్‌, గ్రే రంగుల్లో లభ్యమవుతోంది. 12,500 ఎంఏహెచ్‌ సామర్థ్యమున్న ఈ పవర్‌ బ్యాంక్‌ 290 గ్రాముల బరువుంటుంది. దీనిలోనూ 3 యూఎస్‌బీ పోర్టులు ఉంటాయి. అందువల్ల మూడు మొబైల్స్‌ని ఒకేసారి ఛార్జ్‌ చేసుకునే వీలుంటుంది.

ambrane p-1111

ambrane p-1111

ధర రూ.799
యాంబ్రేన్‌ P-1111 పవర్‌ బ్యాంక్‌ లిథియం అయాన్‌ బ్యాటరీతో మార్కెట్‌లోకి వచ్చింది. దీని సామర్థ్యం 10,000 ఎంఏహెచ్. దీనిలో 2 యూఎస్‌బీ పోర్టులుంటాయి. 277 గ్రాముల బరువుతో ఛార్జింగ్‌ స్థాయిని తెలుసుకోవడానికి ఎల్‌ఈడీ ఇండికేటర్లు కూడా ఉంటాయి.

rock itp 106 power bank

rock itp 106 power bank

ధర రూ. 799.
క్విక్‌ ఛార్జ్ ఫీచర్‌తో రాక్‌ ITP106 పవర్‌ బ్యాంక్‌ మార్కెట్‌లో లభిస్తోంది. 13,000 ఎంఏహెచ్‌ సామర్థ్యం. పవర్‌బ్యాంక్‌ను ఛార్జ్‌ చేసినప్పుడు వేడెక్కకుండా దీనిని తయారు చేశారు. రెండు యూఎస్‌బీ పోర్టులుంటాయి. వీటి ద్వారా మైక్రో యూఎస్‌బీ, టైప్-సీ యూఎస్‌బీ, యాపిల్‌ డివైస్‌లను కూడా ఛార్జ్‌ చేసుకునే వీలుంటుంది.

Best Mobiles in India

English summary
Top 10 Power Banks With Power, Price, Availability And More More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X