Home
Gadgets

ఎంఐ ప్రియులకు శుభవార్త.. పవర్ బ్యాంక్ పై డిస్కౌంట్లు

షియోమీ తన కస్టమర్లను ఆకర్షించేందుకు ఫెస్టివల్ సీజన్ ప్రారంభం కాకమునుపే ప్రయత్నాలు మొదలు పెట్టేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే పవర్ బ్యాంక్ సెగ్మెంట్ లో విపరీతమైన ఆదరణ పొందిన షియోమీ ఎంఐ పవర్ బ్యాంకులకు స

By Gizbot Bureau

షియోమీ తన కస్టమర్లను ఆకర్షించేందుకు ఫెస్టివల్ సీజన్ ప్రారంభం కాకమునుపే ప్రయత్నాలు మొదలు పెట్టేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే పవర్ బ్యాంక్ సెగ్మెంట్ లో విపరీతమైన ఆదరణ పొందిన షియోమీ ఎంఐ పవర్ బ్యాంకులకు సంబంధించిన ధరలను తగ్గించి ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా గత నవంబర్ లో దేశీయ మార్కెట్లో ప్రవేశ పెట్టిన 10000 ఎంఏహెచ్, 20000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన పవర్ బ్యాంకులను ధరలను తగ్గిస్తూ అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇవే మోడల్స్ గత ఏప్రిల్ నెలలో రూ.100 పెంచగా, ప్రస్తుతం జీఎస్టీ ట్యాక్స్ లోవచ్చిన మార్పులకు అనుగుణంగా కస్టమర్లకు లబ్ది చేకూర్చాలనే ఉద్దేశ్యంతో కంపెనీ ధరలు తగ్గించింది. గతంలో పవర్ బ్యాంకులపై 28 శాతం ఉన్న జీఎస్టీ శ్లాబ్, ఇప్పుడు 18 శాతానికి దిగివచ్చింది. ఈనేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించేందుకు షియోమీ ఈ నిర్ణయం తీసుకుంది. తాజా తగ్గింపుతో 10000 ఎంఏహెచ్ సామర్థ్యం గల 2ఐ పవర్ బ్యాంక్ రూ.799లకు లభ్యం అవుతుండగా, 20000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన పవర్ బ్యాంకు రూ.1499 లకే అందుబాటులోకి వచ్చింది. తగ్గిన ధరలకు అనుగుణంగా ఎంఐ.కామ్ లో ప్రాడెక్టులను అందుబాటులో ఉంచారు. మరోవైపు షియోమీ నుంచి ఇప్పటికే మార్కెట్లో ఫెస్టివల్ సమయానికి ఆఫర్లతో పాటు కొత్త ప్రాడెక్టులను అమ్మేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

రెండు పవర్ బ్యాంకుల విశిష్టతలను చూస్తే.....

రెండు పవర్ బ్యాంకుల విశిష్టతలను చూస్తే.....

ఇక ఈ రెండు పవర్ బ్యాంకుల విశిష్టతలను చూస్తే 10000 ఎంఏహెచ్ మరియు 20000 ఎంఏహెచ్ రెండూ కూడా మేకిన్ ఇండియా ఇనిషియేటివ్ భాగంగానే స్థానికంగా తయారుచేశారు. వీటికి రెండు చొప్పున యూఎస్‌బీ ఔట్ పుట్స్ ఉన్నాయి. అలాగే లిథియం పాలిమర్ బ్యాటరీలను అమర్చారు. అలాగే వీటిలో టెక్సాస్ ఇన్‌స్ట్రూమెంట్స్ స్మార్ట్ కంట్రోల్ చిప్స్ ను పొందుపర్చారు. 10000 ఎంఏహెచ్ పవర్ బ్యాంకులో మెటాలిక్ డబుల్ అనొడైజ్డ్ డిజైన్ ఉంటే దీని మందం 14.2 ఎంఎంగా ఉంది. అలాగే దీని బరువు 245 గ్రాములు. ఇక 20000ఎంఏహెచ్ విషయానికి వస్తే పాలికార్పోనేట్ కేస్ తో పాటు బరువు 358 గ్రాములుగా ఉంది.

ఒక్కసారి చార్జ్ చేస్తే.....

ఒక్కసారి చార్జ్ చేస్తే.....

అలాగే 10000 ఎంఏహెచ్ పవర్ బ్యాంకును ఒక్కసారి చార్జ్ చేస్తే మొత్తం 2.5 సార్లు పూర్తిగా స్థాయిలో 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫోన్ ను చార్జ్ చేయవచ్చు. ఇక 20000ఎంఎహెచ్ లో క్విక్ చార్జ్ 3.0 టెక్నాలజీని వాడటం ద్వారా వేగంగా చార్జింగ్ పొందే సదుపాయాన్ని కల్పించారు.

మేకిన్ ఇండియాలో భాగంగా....

మేకిన్ ఇండియాలో భాగంగా....

అలాగే ఎంఐ కు చెందిన పవర్ బ్యాంకులను షియోమీ ఇప్పటికే మేకిన్ ఇండియాలో భాగంగా దేశీయంగా ఉత్పత్తిని తయారు చేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సిటీలో రెండు స్మార్ట్ ఫోన్ మాన్యు ఫాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పవర్ బ్యాంకుల తయారీకి స్థానికంగా తయారు చేసేందుకు చైనాలోని షెంజెన్ కు చెందిన హైపాడ్ టెక్నాలజీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకొని ఉత్పత్తి ప్రారంభించారు. దీంతో పాటు నోయిడాలో సైతం మూడో మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ను షియోమి ప్రారంభించింది. ఈ కొత్త యూనిట్ లో ప్రతీ నిమిషానికి వక పవర్ బ్యాంకు తయారు చేసే సామర్థ్యంతో ప్లాంటును ఏర్పాటు చేశారు. పవర్ బ్యాంకులకు సంబంధించిన నాణ్యతా ప్రమాణాలు గుర్తించడంతో పాటు డుప్లికేట్ల తయారీని అరికట్టేందుకు షియోమీ ప్రత్యేక రక్షణాత్మక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రత్యేక హోలోగ్రామ్, సెక్యూరిటీ కోడ్ ను జత చేస్తున్నారు. తద్వారా జెన్యూన్ మోడల్స్ ను గుర్తించే వీలుంది. దీంతో పాటు షియోమీ పెద్ద ఎత్తున మరిన్ని ప్రొడక్టులను భారత్ లో తయారు చేసి లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
10000mAh and 20000mAh Mi Power Bank 2i, 10000mAh Mi Power Bank Pro Receive Price Cuts in India.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X