గడ్డి నుంచి మీ ఫోన్ ఛార్జింగ్ : షాకయ్యే గాడ్జెట్స్ ఇవే !

Written By:

మీరు గాడ్జెట్ ప్రేమికులా..మీరు మార్కెట్లోకి వచ్చే కొత్త కొత్త గాడ్జెట్స్ మీద దృష్టి పెడుతున్నారా...అయితే మీకు ఏవి అంతగా నచ్చడం లేదా..మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తే గాడ్జెట్స్ కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే మీ కోసమే గిజ్‌బాట్ తెలుగు కొన్ని గాడ్జెట్స్ ని పరిచయం చేస్తోంది. మేము పరిచయం చేసే గాడ్జెట్స్ మిమ్మల్ని నవ్వుల సాగరంలో ముంచెత్తుతాయి. అలాంటి గాడ్జెట్స్ ఏంటో మీరే చూడండి.

Read more: ఒక్క ఆవిష్కరణ మిలియన్ల వైపు నడిచింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గ్రేస్ ఛార్జింగ్ స్టేషన్

మాములుగా పచ్చదనం ఎప్పుడూ కళ్లకు చాలా అందంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ గాడ్జెట్ నిజంగానే మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తిస్తుంది. మీ ఫోన్ అలా గడ్డిలో పడేస్తే అదే ఆటోమేటిగ్గా ఛార్జింగ్ అవుతున్నట్లగా కనిపిస్తుంది.కాని అక్కడ కేబుల్ ఉన్న సంగతి ఎవరికీ తెలియదు మీకు తప్ప. సో మీరు చేయవలిసిందల్లా గడ్డి ఉన్న చోట మీ ఛార్జింగ్ కేబుల్ ని ఉంచడమే. దీనికి సంబంధించిన గాడ్జెట్స్ మార్కెట్లో లభిస్తున్నాయి.

ఓరల్ హైజిన్

ఇదొక బ్రీత్ మీటర్. దీని ద్వారా మీరు గాలి పీల్చడం వదలడం లాంటివి చేయవచ్చు. అంతేకాకుండా ఇదొక వైర్ లెస్ సెట్. మీ హెల్త్ కి సంబంధించిన రిపోర్గ్ ని అందిస్తుంది.

క్లాక్

దాదాపు మీటర్ పొడవుంటే క్లాక్ ఇది. దీని బరువు 2.2 కేజీలకన్నా తక్కువగా ఉంటుంది. మీకు ఎప్పటికప్పుడు టైంని తెలియజేస్తుంది.

క్వాడ్ కాప్టర్ డాక్స్

ఇదొక ఛార్జింగ్ మిషన్. మీరు ఎక్కడికైనా తీసుకెళ్లేటప్పుడు మీ జేబులో పెట్టుకెళ్లవచ్చు. చాలా చిన్నగా అతి తక్కువ బరువుతో ఉంటుంది. ఇది తీసుకెళుతుంటే మీకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది.

కీప్ పెట్స్


మీ ఇంట్లో బుల్లి పెట్ లను పెంచుకుంటున్నారా.అయితే దానికోసమే ఇది. ఇందులో రకరకాల రంగులు అలాగే సౌండ్స్ ఉంటాయి. దీనిలో కూర్చుంటే మీ పెట్ ఓ కొత్త ప్రపంచంలోకి వెళుతుంది.

బీ సింపుల్

ఇది ఫోన్ అనుకుంటున్నారా..అయితే మీరు పొరబడినట్లే..ఇది ఫోన్ లా ఉండే గాడ్జెట్. ఇది బ్యాక్టీరియాను చంపేసే స్కానర్. మీ రూంలో ఏదైనా వైరస్ ఉంటే దానిని దాదాపు 99 శాతం ఈ స్కానర్ పసిగట్టి చంపేస్తుంది. పరుపులు అలాగే దిండ్లు కింద ఏం ఉన్నా 10 సెకండ్లలో ఇది ప్రభావం చూపుతుంది.

గొడుగు

మీరు జోరు వానలో వెళుతున్నారా.మీకు దారి కనపడటం లేదా..అయితే ఈ గాడ్జెట్ మీ కోసమే. దీంతో మీరు సులువుగా వెళ్లవచ్చు. వాన నుంచి రక్షణ పొందవచ్చు. దీనికి ప్రత్యేకంగా లైట్ ఉంటుంది.

లాన్ మూవర్

దీని ద్వారా మీ లాన్ లో ఏమన్నా వ్యర్థ పదార్ధాలు ఉంటే వాటిని తీసేయవచ్చు. రిమోట్ కంట్రోల్ సాయంతో వాటిని వెంటనే తొలగించవచ్చు. అలాగే గడ్డిని కూడా కోసేయవచ్చు. దీనికే కొడవలి ఉంటుంది. అది రిమోట్ సాయంతో పనిచేస్తుంది. మీకు కూలీల బాధ కూడా తప్పుతుంది.

మీ చేతులు చల్లగా ఉన్నాయా

మీ చేతులు చల్లగా ఉన్నప్పుడు ఈ డివైస్ ని వాడితే మీ చేతులు ఆటోమేటిగ్గా వేడెక్కుతాయి. ఈ గ్లౌస్ తొడుక్కోవడం ద్వారా మీరు ఆ అనుభూతిని పొందవచ్చు.

 

 

గ్రీనేడ్

ఇది గ్రేనేడ్ లాగా ఉంది కదా. అయితే ఇది ఓ అలారం క్లాక్. మీరు అందులో ఉన్న పిన్ ను తీసేసి అలారం సెట్ చేస్తే చాలు. అది ఆటోమేటిగ్గా మోగుతుంది. మీరు మంచి నిద్రలో ఉన్నా సరే మిమ్మల్ని తన సౌండ్ తో లేపుతుంది.

ఐస్ క్రీం జార్ జాక్

మీరు బయటనుంచి తీసుకొచ్చిన ఐస్ క్రీం ఎవరూ తినకుండా ఇలా లాక్ చేయవచ్చు

ప్లే స్టేషన్

ఇదొక మసాజ్ గేమ్. దీంతో మీరు మీ పాట్నర్ కి మసాజ్ చేస్తూనే గేమ్ ఆడుకోవచ్చు. అంటే రెండు విధాలుగా ఉపయోగపడుతుందన్నమాట

బికినీ

ఇదొక సోలార్ బేస్ డ్ బికినీ. దీంతో ఫోటోలను కిరణాలతో ఐ ప్యాడ్ లో చూడొచ్చు. దీనిని న్యూయార్క్ కు చెందిన మల్టీ డిజైనర్ రూపొందించారు.

సాల్ట్ గన్

ఇదొక కీటకాలను చంపే గన్. మీ పుస్తకాలకు. పైళ్లకు చెదలు, కీటకాలు పట్టినప్పుడు ఈ గన్ తో వాటిని షూట్ చేయవచ్చు. ఇందులో పౌడర్ ఉంటుంది. అది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. దాని సహాయంతో మీరు కీటకాలను షూట్ చేయవచ్చు.

బాండ్ ఫర్ పోర్‌హెడ్

మీ హెడ్ రిలాక్సేషన్ కోసం దీనిని వాడవచ్చు. దీంతో మీరు చిన్న చిన్న వైబ్రేషన్ కు గురయి మంచిగా రిలాక్స్ అవుతారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 15 weird gadgets you can't believe actually exist!
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot