Home
Gadgets

అద్దం ముందు నగ్నంగా నిల్చుంటే చాలు, మీ బాడీ చరిత్ర తెలిసిపోతుంది

ఈ రోజుల్లో ఆరోగ్యంపై చాలామందికి శ్రధ్ద ఉండటం లేదంటే అతిశయోక్తి కాదు. బాడీలో మనకు తెలియకుండానే అనేక రకాలైన మార్పులు జరుగుతూ ఉంటాయి.

By Hazarath Aiah

ఈ రోజుల్లో ఆరోగ్యంపై చాలామందికి శ్రధ్ద ఉండటం లేదంటే అతిశయోక్తి కాదు. బాడీలో మనకు తెలియకుండానే అనేక రకాలైన మార్పులు జరుగుతూ ఉంటాయి. బరువు పెరగడం, కొవ్వుశాతం లాంటివి చాలామందిని ఎక్కువగా ఇబ్బందిపెడుతుంటాయి. డైట్‌లు వంటివి పాటిస్తున్నప్పటికీ బరువు తగ్గడం లేదని చాలామంది గిల్టీగా ఫీలవుతుంటారు. అలాంటి వారికోసం సిలికాన్‌ వ్యాలీ స్టార్టప్‌ కంపెనీ 'నేక్డ్‌ ల్యాబ్స్‌' సరికొత్త యాప్ ని అందుబాటులోకి తీసుకొస్తోంది. మ్యాజిక్ మిర్రర్ లా కనిపించే దీని పూర్తి వివరాల్లోకెళితే..

నేక్డ్‌ ల్యాబ్స్‌

నేక్డ్‌ ల్యాబ్స్‌

సిలికాన్‌ వ్యాలీ స్టార్టప్‌ కంపెనీ నేక్డ్‌ ల్యాబ్స్‌ సరికొత్త పీటతో కూడిన అద్దాన్ని రూపొందించారు. మనం చేయాల్సిందల్లా అద్దానికి ఎదురుగా ఉండే పీటలాంటి దాని మీద నిల్చోవడమే..

 20 సెకన్లపాటు

20 సెకన్లపాటు

అలా నిల్చుంటే అది మనల్ని చుట్టూ 20 సెకన్లపాటు తిప్పుతుంది. ఆ 20 సెకన్లలో అద్దం మన శరీరాన్ని స్కాన్‌ చేసేస్తుంది. త్రీడీ మ్యాప్స్‌ తీసేస్తుంది.

ఇంటెల్‌ రియల్‌ సెన్స్‌ సెన్సర్లు

ఇంటెల్‌ రియల్‌ సెన్స్‌ సెన్సర్లు

ఇందుకోసం ఇందులో ఇంటెల్‌ రియల్‌ సెన్స్‌ సెన్సర్లు పెట్టారు. ఆ సమయంలో నగ్నంగా నిల్చుంటే.. మరింత కచ్చితంగా త్రీడీ మోడల్‌ తయారవుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

స్మార్ట్‌ఫోన్‌ యాప్‌లో

స్మార్ట్‌ఫోన్‌ యాప్‌లో

అనంతరం ఈ మ్యాజిక్‌ మిర్రర్‌తో అనుసంధానించి ఉండే స్మార్ట్‌ఫోన్‌ యాప్‌లో ఈ వివరాలు స్టోర్‌ అయిపోతాయి. అక్కడి నుంచి విశ్లేషణ ప్రారంభమవుతుంది. శరీరంలోని కొవ్వు శాతం.. బరువు, లీన్‌మాస్, ఫ్యాట్‌మాస్‌ వంటి వివరాలు యాప్‌లోకి వచ్చేస్తాయి.

ప్రతి పార్టులో జరిగే మార్పులను

ప్రతి పార్టులో జరిగే మార్పులను

అప్పటినుంచి మీ బాడీలో ప్రతి పార్టులో జరిగే మార్పులను ఈ అద్దం ముందు నిల్చుంటే యాప్ ద్వారా చెప్పేస్తూ ఉంటుంది. వారాలు, నెలలు లెక్కన విశ్లేషణ చేసి మీ బాడీ సమాచారాన్ని అందిస్తుంది.

ప్రపంచంలోనే తొలి హోం బాడీ స్కానర్‌..

ప్రపంచంలోనే తొలి హోం బాడీ స్కానర్‌..

ఇది ప్రపంచంలోనే తొలి హోం బాడీ స్కానర్‌ అని చెబుతున్నారు. మనం అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఈ పరికరం తోడ్పడుతుందని కంపెనీ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

యాప్‌లో స్టోర్‌ అయ్యే మన వ్యక్తిగత చిత్రాలు..

యాప్‌లో స్టోర్‌ అయ్యే మన వ్యక్తిగత చిత్రాలు..

కాగా యాప్‌లో స్టోర్‌ అయ్యే మన వ్యక్తిగత చిత్రాలు, సమాచారం హ్యాక్‌ అయ్యే ప్రమాదముందని సైబర్‌ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. అలాంటి చాన్సే లేదని కంపెనీ ప్రతినిధులు కొట్టిపారేస్తున్నారు.

పూర్తిస్థాయిలో భద్రతాచర్యలు ..

పూర్తిస్థాయిలో భద్రతాచర్యలు ..

డాటా హ్యాక్‌ అయ్యే పరిస్థితి లేదని.. పూర్తిస్థాయిలో భద్రతాచర్యలు చేపట్టామని.. పైగా.. ఆ అద్దాలు తీసేవి ఫొటోలు కావని.. త్రీడీ మోడల్‌ మాత్రమేనని.. అది ఎక్స్‌రేలాగ ఉంటుందని చెబుతున్నారు.

ధర రూ. లక్ష రూపాయలు

ధర రూ. లక్ష రూపాయలు

సంబంధిత యూజర్‌కు మాత్రమే ఆ సమాచారం అందుబాటులో ఉంటుందని.. భయపడాల్సిన పనేలేదని భరోసా ఇస్తున్నారు. దీని ధరను రూ. లక్ష రూపాయలుగా నిర్ణయించారు.

వచ్చే నెల నుంచి అమ్మకాలు

వచ్చే నెల నుంచి అమ్మకాలు

వచ్చే నెల నుంచి అమెరికాలో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. మరి ప్రపంచ వ్యాప్తంగా ఇది అందుబాటులోకి వస్తుందా లేదా అన్నది దీని సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. ముందు ముందు దీని పనితీరును చూడాలి మరి.

Best Mobiles in India

English summary
Magic' Mirror Reveals Body Changes As You Get Fit more news at Gizbt telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X