ప్రయాణ సమయంలో ఇవి మరచిపోకండి!

|

మీరు ఎక్కడికైనా ట్రావెలింగ్ చేస్తున్నారా.. చాలా దూరం ప్రయాణిస్తున్నారా..అయితే మీరు ఆ హడావుడిలో ఏదో ఒకటి మరచిపోవడం సహజం. ముఖ్యంగా టెక్నాలజీకి సంబంధించిన వస్తువులు మీరు మరచిపోతారు. ఆ తరువాత తీరిగ్గా మరచిపోయామని భాదపడుతుంటారు. ఇక అవి మరచిపోవడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కునే అవకాశం కూడా ఉంది. అయితే మీరు ట్రావెలింగ్ సమయంలో గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన టెక్నాలజీ వస్తువులను మీకు పరిచయం చేస్తున్నాం. ఓ సారి వాటిని చెక్ చేసుకుంటే మీకు ఏ బాధ ఉండదు.

Read more: నాడు చిన్నరూంలో..నేడు అద్దాల మేడలో..

ట్రావెల్ చార్జర్

ట్రావెల్ చార్జర్

మీరు మీ స్మార్ట్‌ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా అలాగే ఐ ప్యాడ్ కు ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా ఛార్జర్ చాలా ముఖ్యం. ఇది మరిచిపోతే మీరు తరువాత చాలా చింతించాల్సి వస్తుంది.

ఇంటర్నేషనల్ రోమింగ్

ఇంటర్నేషనల్ రోమింగ్

మీరు ఇతర దేశాలకు వెళుతున్నప్పుడు ముందుగానే అక్కడి రోమింగ్ రేట్లు తెలుసుకోండి. మీరు మీ సిమ్ కార్డును ఇతర దేశాల్లో వాడుతున్నప్పుడు రోమింగ్ రేట్స్ చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయి. కాబట్టి దానిపై లుక్ వేయడం మంచింది.

బ్యాంకింగ్

బ్యాంకింగ్

మీరు మీ బ్యాంకింగ్ లావాదేవీలు కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు విదేశాల్లో డెబిట్ కార్డులు అలాగే క్రెడిట్ కార్డులు వినియోగిస్తుంటే అవి అక్కడ పనిచేస్తాయా లేదా అన్నది ఓ సారి చెక్ చేసుకోండి.

వైఫై

వైఫై

మీరు ఎక్కడైనా వైఫై అందుబాటులో ఉంటే వెంటనే యూజ్ చేయకండి. అలా యూజ్ చేయడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంది. పబ్లిక్ వైఫైలలో హాట్‌స్పాట్ అనేది చాలా ప్రమాదకరమైనది. మీ స్మార్ట్‌ఫోన్ కాని అలాగే ల్యాప్‌టాప్ కాని హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.

లగేజ్

లగేజ్

మీరు మీ లగేజ్ సర్దుకునే సమయంలో మీ బ్యాగ్ లో ఫోన్లు , ల్యాప్ టాప్ అలాగే కెమెరాస్ పెట్టుకోవడం మర్చిపోవద్దు.మీరు మీ లగేజిని తీసుకెళ్లే సమయంలో వీటిని ఓ సారి చెక్ చేసుకుంటే చాలు.

ట్రావెల్ డాక్యుమెంట్

ట్రావెల్ డాక్యుమెంట్

మీరు మీ ట్రావెల్ బ్యాగులు సర్దుకునే సమయంలో ఇది చాలా ముఖ్యం. మీరు ఇతరదేశాలకు వెళ్లాల్సి వస్తే ఇది మీ చేతిలో తప్పనిసరిగా ఉండాల్సిందే.అలాగే వాటి సాఫ్ట్ కాపీలు కూడా మీరు మీ ఫోన్‌లో కాని ల్యాప్‌టాప్‌లో కాని పెట్టుకోవడం మర్చిపోకండి.

మనీ

మనీ

మీరు ఇతర దేశాల్లో పర్యటిస్తున్నప్పుడు వీలయినంత ఎక్కువ మనీ ఉండేలా చూసుకోవాలి. అక్కడ మీకు డాలర్లు లేకుంటే ఆ దేశ కరెన్సీ నోట్లు అవసరమవుతాయి. అటువంటి సమయంలో వాటి విలువ మనకు తెలియదు. వీటిపై దృష్టి పెట్టడం చాలామంచిది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. 

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write 7 Obvious Tech Mistakes you should definitely avoid while travelling abroad

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X