అత్యాధునిక టెక్నాలజీ అడుగడుగునా విస్తరిస్తోన్న రోజులివి. ఆఫీసులో కంప్యూటర్ ముందు కూర్చొని చేయవల్సిన పనులను ఎంచక్కా అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ఫోన్ ద్వారా చక్కబెట్టేసుకుంటున్నాం. తరచూ ప్రయాణాలు చేసే వారి కోసం అనేక టెక్నాలజీ గాడ్జెట్‌లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి.
పవర్ బ్యాంక్‌లు, బ్లూటూత్ స్పీకర్లు, హెడ్‌సెట్‌లు ఇలా అనేక క్రియేటివ్ టూల్స్ అందుబాటులోకి వచ్చేసాయి. ప్రయాణ సమయాల్లో ఉపయోగపడే విధంగా రూపొందించబడిన బడిన 7 అత్యుత్తమ టెక్నాలజీ గాడ్జెట్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
థింక్ పెన్
ఈ ఫ్లెక్సిబుల్ పెన్‌ను రాయటానికి మాత్రమే కాదు, ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఓ ఫిడ్జెటింగ్ టూల్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు. నియంత్రణ పై పట్టుకోల్పోకుండా ఈ గాడ్జెట్ చూస్తుంది.
నెక్‌ప్యాకర్
ప్రత్యేకమైన ఎయిర్ కుషన్స్‌తో నిండి ఉండే ఈ ట్రావెల్ జాకెట్ ప్రయాణ సమయాల్లో హైక్వాలిటీ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్‌ను మీకు అందిస్తుంది.
వీయూఫైన్+ వేరబుల్ డిస్‌ప్లే
ఈ హైడెఫినిషన్ వేరబుల్ డిస్‌ప్లే నిరంతరాయంగా మీ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ కాగలదు. హెచ్‌డిఎమ్ఐ కేబులతో కనెక్ట్ కాగలిగే ఈ పోర్టబుల్ డివైస్ ఇంటర్నల్ బ్యాటరీతో 90 నిమిషాల పాటు స్పందించగలుగుతుంది.
ప్రయాణ సమయాల్లో ఈ గాడ్జెట్ మరింతగా ఉపయోగపడుతుంది.
వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్....ఇంతకీ ఆ ఫీచర్ ఎంటో తెలుసా !
మైక్రో
ప్రపంచపు అతిచన్న ట్రావెల్ యూఎస్బీ ఆడాప్టర్‌గా ఈ డివైస్ గుర్తింపు తెచ్చుకుంది.
బుల్ రెస్ట్ ట్రావెల్ పిల్లో
ప్రయాణ సమయంలో మీ తల ఏమాత్రం ఒత్తిడిపడకుండా సరైనా అలైన్‌మెంట్‌లో ఉంచేందుకుగాను ఈ పిల్లో తోడ్పడుతుంది.
మాగ్‌పై
ఈ అతిచిన్న జీపీఎస్ గాడ్జెట్ స్మార్ట్ జీపీఎస్ టెక్నాలజీ పై రన్ అవుతుంది. ప్రయాణ సమయాల్లో ఈ డివైస్ మరింత హ్యాండీగా అనిపిస్తుంది.
నోమాటిక్ బ్యాగ్స్
మార్కెట్లో లభ్యమవుతోన్న అత్యాధునిక ట్రావెల్ బ్యాగ్‌లలో నోమాటిక్ బ్యాగ్ ఒకటి. సెక్యూరిటీ పరంగా అనేక లేటెస్ట్ ఫీచర్లను ఈ బ్యాగ్ కలిగి ఉంది.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.