స్మార్ట్‌ఫోన్ ఈ గాడ్జెట్లను చంపేసిందని మీకు తెలుసా..?

Written By:

స్మార్ట్‌ఫోన్ రాక మనల్ని బందీని చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దానితోటే ప్రపంచం అయింది అందరికీ. మనం ఎక్కడికెళ్లినా మన చేతిలో ఫోన్ ఉండాల్సిందే. అయితే స్మార్ట్‌ఫోన్ రాకతో కొన్ని గాడ్జెట్లు చచ్చిపోయాయని మీకు తెలుసా..యూజర్లకు ఎంతో ఉపయోగపడిన ఆ గాడ్జెట్లు ఇప్పుడు మచ్చుకైనా కానరావడం లేదు. అవేంటో మీరే చూడండి.

బుల్లి ప్రింటర్: ఫోటో దిగగానే ప్రింట్ తీసుకోవచ్చు, ధర కూడా తక్కువే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎంపీ 3 ప్లేయర్

ఒకప్పుడు ఇదంటే చాలా ఫేమస్. అయితే స్మార్ట్‌ఫోన్ల రాకలో ఇది చరిత్ర పుటల్లోకి చేరింది. దీని స్థానంలో మ్యూజిక్ రాజ్యమేలుతోంది.

జీపీఎస్ నావిగేషన్

మనం ఎక్కడికెళ్లినా ఇది చాలా ఉపయోగపడేది. అయితే స్మార్ట్‌ఫోన్లలో ఈ సిస్టం రాకతో అది మరుగనపడిపోయింది.

డిజిటల్ కెమెరా

ఒకప్పుడు ఎంతో ఊపు ఊపిన ఈ టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్ల రాకతో ఒక్కసారిగా కనుమరుగైపోయింది. దీని స్థానంలో మొబైల్ కెమెరాలు రాజ్యమేలుతున్నాయి.

రేడియో

వీటి స్థానంలో ఇప్పుడు ఎఫ్ఎమ్ లు అదరగొడుతున్నాయి. ఒకప్పుడు రేడియో ఉంటే అదో ధనంలా భావించేవారు.

వాయిస్ రికార్డర్

ఒకప్పుడు ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఉండేది. కాని ఇప్పుడు మూలకు వెళ్లిపోయింది.

అలారం క్లాక్

ఉదయం లేవాలంటే అలారం పెట్టుకుని లేచేవాళ్లం. కాని ఇప్పుడు ఫోన్ లోనే సెట్ చేసి పెట్టుకున్నాం

రిస్ట్ వాచీ

వాచీ ఒకప్పుడు టైం చూసుకునేదానికి ఉపయోగించేవారు.స్మార్ట్‌ఫోన్ల రాకతో అది ఒక్కసారిగా మూలకు జారుకుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
8 gadgets that your smartphone has ‘killed Read more At Gibot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot