అమెరికా అత్యంత రహస్యంగా వాడిన టెక్నాలజీ ఇదే...

అమెరికా ప్రభుత్వ గూఢచార సంస్థ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) తన పరిశోధనల్లో భాగంగా అనేక రకాలైన సీక్రెట్ గాడ్జెట్ లను ఆ రోజుల్లోనే అభివృద్థి చేసుకుంది. తన అపరేషన్స్‌లో భాగంగా సీఐఏ ఉపయోగించిన అనేక రకాలైన సీక్రెట్ గాడ్జెట్లు మ్యూజియంలో దర్శనమిస్తున్నాయి.అప్పట్లో అత్యంత రహస్యంగా సాగిన అనేక ఆపరేషన్లలో ఈ గాడ్జెట్లను వాడారని తెలుస్తోంది. వాటిలో కొన్ని స్పై గాడ్జెట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Read More : మే 5 నుంచి నోకియా ఫోన్ బుకింగ్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సీక్రెట్ రేడియో రిసీవర్

1960లో దీన్ని ఉపయోగించారు. ఇది నిజానికి అత్యంత సీక్రెట్ గా పనిచేసే రేడియో రిసీవర్. ఆ పైపు ద్వారా సౌండ్ మొత్తం చెవులకు చేరుతుంది.

సీక్రెట్ కెమెరా

ఇది అత్యంత సీక్రెట్ కెమెరా..దీన్ని 1960లో ఉపయోగించారు. ఇది సిగిరెట్ పెట్టెలో పెట్టి కావాల్సిన ప్రదేశంలో వదిలేసేవారు. సమస్త సమాచారాన్ని ఇది బంధించేది.

ఇది మామూలు పావురం కాదు...

రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ పావురం గాడ్జెట్ ప్రముఖ పాత్ర పోషించింది. దీని కాలికి కెమెరా కట్టి పైన ఎగిరేటట్లు చేసేవారు. అది అలా ఎగురుతూ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ కెమెరా మొత్తం కవర్ చేసేది.

రిమోట్ కంట్రోల్‌తో ఎగిరే తూనిగ...

ఇది కూడా ఎగురుతూ సమస్త సమాచారాన్ని సీఐఏకు అందించేది. రిమోట్ కంట్రోల్‌తో దీన్ని ఎలాగంటే అలా ఆపరేట్ చేయవచ్చు. 1970వ దశకంలో దీన్ని ఉపయోగించారు.

సమాచారాన్ని రహస్యంగా చేరవేసే పరికరం..

'dead drop' స్పైక్

ఏజెంట్లకు అలాగే సీఐఎ‌కు మధ్య ఇది కూడా సమాచారాన్ని అందించేది. మొత్తం సమాచారం ఇందులోకి ఎక్కిపోతుంది.

సీఐఏ రహస్య సాధనాల్లో ఇది కూడా ఒకటి

మట్టి ఆకారంలో ఉన్న ఈ గాడ్జెట్ కూడా సీఐఏలకు ఓ రహస్య సాధనం. శత్రువులు వచ్చినప్పుడు ఇది ఆటోమేటిగ్గా వైబ్రేషన్ అందించేది. దీంతో సీఐఏ అలర్టయ్యేది.

జిత్తులమారి అద్దం..

సీక్రెడ్ కోడ్‌ల కోసం ఈ మిర్రర్ గాడ్జెట్‌ని ఉపయోగించేవారు.

లెన్సాటిక్ కంపాస్

1950లో యుఎస్ ఆర్మీ దీన్ని ఉపయోగించింది. ఇది లెన్స్‌తో కూడుకున్న గాడ్జెట్.

చార్లీ.. ఇదో రోబోటిక్ ఫిష్

1990 దశకంలో దీన్ని వాడారు. ఇది నీటి లోపల చేపలా ఉండి అన్ని రహస్యాలను సీఐఏకు చేరవేసేది.

హ్యాండ్ క్రాంక్ డ్రిల్..

ఇది ఓ టూల్ కిట్. ఎక్కడైనా అర్జెంట్‌గా రంధ్రాలు వేయాల్సి వస్తే దీన్ని ఉపయోగించేవారు.

silver dollar

ఇది చూసేందుకు సిల్వర్ డాలర్‌లాగా ఉంటుంది. కాని ఇది అత్యంత శక్తివంతమైన సాధనం. శత్రువుల సమాచారం మొత్తాన్ని తన గుప్పెట్లో బంధిస్తుంది.

కఫ్‌లింక్

ఇది స్టాంప్ అని చాలామంది పొరపడుతుంటారు. కాని ఇది స్టాంప్ కాదు సీఐఏ ఉపయోగించిన రహస్య పరికరాల్లో ఇదికూడా ఒకటి. ఈ కఫ్‌లింక్‌లో తప్పించుకునేందుకు అవసరమైన రూట్ మ్యాప్ ఉంటుంది.

Enigmas

దీన్ని రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ వాడింది. ఇది కోడ్‌లను డీకోడ్ చేయగలిగే అత్యంత చిన్న పరికరం. సీఐఏ చేతికి చిక్కింది.

అత్యంత చిన్న కెమెరా

మైక్రోస్కోపిక్ ఫోటోలను తీయగలిగే అత్యంత చిన్న కెమెరా..

శత్రువు సమాచారంతో పాటు ఫోటోలను తీయగలిగే డివైస్..

1960 వియాత్నం యుద్ధ సమయంలో సీఐఏ ఈ డివైస్‌ను రూపొందించింది. శత్రువుల సమాచారాన్ని వారి చిత్రాలను పసిగట్టే మిషన్

ఇది హెడ్‌ఫోన్ కానే కాదు..

ఇది చూసేందుకు హెడ్‌ఫోన్ లాగుంటుంది. దగ్గరగా పరిశీలించే చూస్తే ఇది అత్యంత సీక్రెట్ పరికరం. 2009లో సీఐఏ వాడింది. ఆప్ఘనిస్తాన్ లోని శత్రువులను దీంతోనే పసిగట్టింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
A Rare Look At Historical Spy Gadgets Inside The CIA's Private Museum. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot