Siri, Alexaలు మీ పిల్ల‌ల ప్ర‌వ‌ర్త‌న‌కు ఆటంకాలుగా మారుతున్నాయా!

|

నేటి సాంకేతిక యుగంలో టెక్నాల‌జీ మ‌నుషుల జీవన విధానాన్ని ఎంతో సుల‌భ‌త‌రం చేస్తుంద‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం అక్క‌ర్లేదు. కానీ, ఇదే టెక్నాల‌జీ పిల్ల‌ల సామాజిక ఎదుగుద‌ల‌ను ప్ర‌భావితం చేస్తుంద‌ని నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం మ‌నుషులు, మెషీన్ల మ‌ధ్య పర‌స్ప‌ర చ‌ర్య‌ల‌ను నిర్వ‌హించేందుకు ప‌లు వాయిస్ అసిస్టెన్స్ ఫీచ‌ర్లు అందుబాటులోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. వాటి అల‌వాటైన పిల్ల‌లో సామాజిక అభివృద్ధికి ఆటంకం క‌లుగుతోంద‌ని కేంబ్రిడ్జ్ విశ్వ‌విద్యాల‌య ప‌రిధిలోని స్కూల్ ఆఫ్ క్లినిక‌ల్ మెడిసిన్ నిపుణులు వెల్ల‌డించారు.

 
alexa

Siri, Alexa, గూగుల్ అసిస్టెంట్ వంటి ఫీచ‌ర్లు పిల్ల‌ల మాన‌సిక మ‌రియు సామాజిక అభివృద్ధిని ప్ర‌భావితం చేస్తాయ‌ని వారు తెలిపారు. ఇందుకు సంబంధించి వారి ప‌రిశోధ‌న‌ల‌కు సంబంధించిన విష‌యాల్ని ఆర్కైవ్స్ ఆఫ్ డిసీజ్ ఇన్ చైల్డ్ హుడ్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు. ఆ విష‌యాల్ని ఇప్పుడు ఇంకాస్త వివ‌రంగా తెలుసుకుందాం.

 

యూనివ‌ర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ ప‌రిధిలోని స్కూల్ ఆఫ్ క్లినిక‌ల్ మెడిసిన్ నిపుణుల ప్ర‌కారం వివ‌రాలు ఇలా ఉన్నాయి. సిరి, అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ వంటి ఫీచ‌ర్లు పిల్ల‌ల మాన‌సిక మ‌రియు సామాజిక అభివృద్ధిని ప్ర‌భావితం చేస్తాయ‌ని వారు తెలిపారు. ఇవి పిల్ల‌ల సామాజిక అభివృద్ధికి ఆటంకాలు. పిల్ల‌ల సామాజిక ఎదుగుద‌ల‌లో అభివృద్ధి లేక‌పోవ‌డం వంటి స‌మ‌స్యల కార‌ణాలను ఆరా తీస్తే.. ఈ స్మార్ట్ వాయిస్ అసిస్టెంట్లు పాత్ర పోషిస్తున్న‌ట్లు పరిశోధకులు పేర్కొన్నారు.

స్మార్ట్ అసిస్టెంట్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తుందా?
ఈ డివైజ్‌ల కార‌ణంగా పిల్ల‌లు సామాజికంగా ప‌ర‌స్ప‌ర సంభాష‌న‌ల అభివృద్ది విష‌యంలో అభివృద్ధి చెంద‌డం లేద‌ని అధ్యయనానికి నాయకత్వం వహించిన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అనన్య అరోరా మరియు అన్మోల్ అరోరా చెప్పారు. AI- ఆధారిత సాంకేతికతపై ఆధారపడటం పిల్లలలో సామాజిక వ్యతిరేక మరియు హానికరమైన ప్రవర్తనలకు కార‌ణ‌మ‌వుతుందని అధ్యయనం నిర్ధారించింది.

alexa

"ఇంటర్నెట్ నుండి ల‌భించే సమాచారం మరియు ఇంటర్నెట్ పరిమితులపై పిల్లలకు సరైన అవగాహన లేదు" అని నివేదిక పేర్కొంది. నేటి త‌రం ఆన్‌లైన్‌లో ల‌భించే స‌మాచారంపై బ‌ల‌మైన విశ్వాసం క‌లిగి ఉన్నారు. దీంతో వారికి ఇంట‌ర్నెట్‌లో ల‌భించే స‌మాచారం స‌రైనదా.. త‌ప్పుడు స‌మాచారమా అనేది అవ‌గాహ‌న క‌లిగి ఉండ‌టం లేదు. త‌ద్వారా వారు వాస్త‌వ ప్ర‌పంచ‌లో ఎలా ప్ర‌వ‌ర్తించాలో తెలుకోలేక‌పోతున్నారు.

ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడం మరియు ప్లాట్‌ఫారమ్‌లను అరికట్టడానికి సాధనాలు లేకపోవడం వాస్త‌వం. దీనికి తోడు AI- అసిస్టెంట్స్ అగ్నికి ఆజ్యం పోస్తున్న‌ట్లు ప‌రిస్థితి త‌యార‌వుతోంది. 2021లో స్టాన్‌ఫోర్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ప్రకారం, వివిధ స్మార్ట్ AI అసిస్టెంట్‌లు ఆరోగ్యానికి సంబంధించిన ప్రశ్నలకు విభిన్న సమాధానాలను అందించిన‌ట్లు తేలింది. ఇలా ఆ డివైజ్‌లు విభిన్న ర‌కాల భావాల్ని వెల్ల‌డించిన సంద‌ర్భాల్లో పెద్దలు లేదా విద్యావంతులైదే స‌రైన‌ నిర్ణయాలు తీసుకోగలుగుతారు, కానీ, పిల్లలు అధిక ప్రమాదంలో అవ‌కాశం ఉంటుంద‌ని రీసెర్చ్ వెల్ల‌డించింది.

పిల్ల‌ల సామాజిక ఎదుగుద‌ల‌పై కూడా ప్ర‌భావం:
ఇంట‌ర్నెట్‌పై అధికంగా ఆధార‌ప‌డ‌డం ద్వారా పిల్లల సామాజిక ఎదుగుదల కూడా ప్రభావితమవుతుంది. ఒకరితో ఒకరు పరస్పర సంబంధాలు క‌లిగి ఉండ‌టం ద్వారా మాత్ర‌మే సామాజిక అవగాహనను పెంపొందించ‌వచ్చు. త‌ద్వారా వారు వాస్త‌వ ప్ర‌పంచంలో ఎలా న‌డ‌చుకోవాలో నిర్ణ‌యించుకోగ‌లుగుతారు. ఈ ర‌క‌మైన జ్ణానాన్ని డిజిటల్ అసిస్టెంట్‌లు పిల్ల‌ల‌కు అందించ‌లేవు. సరళంగా చెప్పాలంటే, పిల్లలకు సామాజిక పరస్పర సంబంధాల‌ను బోధించడానికి AI అసిస్టెంట్లు గొప్ప సాధనాలు కావు. భాషా ప్రాసెసింగ్‌లో పురోగతి ఉన్నప్పటికీ, ఈ AI సాధనాలు పిల్లలకు మర్యాదలను బోధించలేవు మరియు వారి ప్రవర్తనను చక్కగా నిర్వహించడానికి వారికి శిక్షణ ఇవ్వలేవు.

అంతేకాకుండా, ఈ డివైజ్‌లు ఒంటరితనంతో బాధపడే వృద్ధులకు బాగా సహాయపడతాయని కూడా అధ్యయనం వెల్ల‌డించింది. అవి "పిల్లల జనాభాలో ప్రతిఘటన ప్రభావాలను" కలిగి ఉన్నాయని కాబ‌ట్టి ఈ విష‌యంలో తక్షణ శ్రద్ధ అవసరం అని నిపుణుల అధ్య‌య‌నం పేర్కొంది.

Best Mobiles in India

English summary
A study revealed that, Siri, alexa voice assistances obstacles for child growth

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X