Home
Gadgets

Acer నుంచి ఒకేసారి 6 రకాల స్మార్ట్ టీవీలు లాంచ్! ఇండియా లో సేల్ తేదీ వివరాలు

By Maheswara

భారతదేశపు స్మార్ట్ టీవీ మార్కెట్ రంగంలో ఏసర్ టీవీలకు భారీ డిమాండ్ ఉంది. ఏసర్ వివిధ పరిమాణాలలో స్మార్ట్ టీవీలకు ప్రసిద్ధి చెందిన సంస్థ. ప్రస్తుతం ఇప్పుడు భారతదేశంలో O, V, I, G, H మరియు W సిరీస్‌లలో అనేక స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. ఇది స్మార్ట్ టీవీల యొక్క వివిధ సిరీస్‌ల లాంచ్ ద్వారా అభిమానులకు చాలా ఉత్సాహాన్ని అందించింది.

అవును, ఏసర్ కంపెనీ O, V, I, G, H మరియు W సిరీస్‌లలో కొన్ని ఆకర్షణీయమైన స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. ఇందులో ఒకటి కంటే ఎక్కువ టీవీ సిరీస్‌లు ఉన్నాయి. కాబట్టి, ఇప్పుడు ఈ O, V, I, G, H మరియు W సిరీస్ టీవీల యొక్క ప్రత్యేకత ఏమిటి అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం? ఈ టీవీల స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

Acer Launches Various Series Smart Tvs In India. Series List And Specifications Details.

Acer O సిరీస్ టీవీలు: Acer Google స్మార్ట్ టీవీలకు O సిరీస్ ఫ్లాగ్‌షిప్ టీవీలుగా ఉన్నాయి . ఈ సిరీస్‌లో స్మార్ట్ టీవీ 55-అంగుళాల మరియు 65-అంగుళాల ఎంపికలలో వస్తుంది. ఈ రెండు మోడల్‌లు OLED ప్యానెల్‌ను కలిగి ఉంటాయి మరియు 60 వాట్ స్పీకర్ సిస్టమ్‌ను కలిగి ఉంటాయి.

Acer V సిరీస్ టీవీలు: ఈ సిరీస్ టీవీలు QLED స్క్రీన్‌ను కలిగి ఉంటాయి. ఈ Acer V సిరీస్ లో 43 అంగుళాల, 50 అంగుళాల మరియు 55 అంగుళాల ఎంపికలలో వస్తుంది. మీ బడ్జెట్‌ను సాగదీయకుండా QLED టీవీని కోరుకునే వారికి ఈ స్మార్ట్ టీవీలు ఉత్తమమని ఏసర్ సంస్థ పేర్కొంది.

Acer Launches Various Series Smart Tvs In India. Series List And Specifications Details.

Acer I మరియు G సిరీస్ టీవీలు : Acer కంపెనీ ఈ సిరీస్‌లో 32 అంగుళాల మరియు 40 అంగుళాల టీవీలను పరిచయం చేసింది. వీటిలో MEMC, డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్, UHD అప్‌స్కేలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే 16GB ఆన్‌బోర్డ్ మెమరీతో వస్తుంది. అందులో మీకు ఇష్టమైన యాప్‌లను స్టోర్ చేసుకోవచ్చు.

Acer H సిరీస్: ఈ సిరీస్ యొక్క ప్రత్యేక స్మార్ట్ టీవీలలో కనిపించే 76 వాట్ స్పీకర్ సిస్టమ్. అంతేకాకుండా, సిస్టమ్‌లో బాస్ మరియు ట్రిబుల్‌లను మెరుగుపరిచామని ఏసర్ సంస్థ ప్రకటించింది.

Acer W సిరీస్: ఈ సిరీస్ లో QLED టీవీల ప్రీమియం శ్రేణి టీవీలు ఉన్నాయి. మరియు ఇవి అన్ని టీవీలు Google TV OS లో కూడా పని చేస్తాయి.

ఇంకా, ఏసర్ సంస్థ తమ OLED మరియు QLED డిస్ప్లేలతో Google TV సిరీస్ ని కూడా లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీ లు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు 2 వే బ్లూటూత్ 5.0, అలాగే HDMI 2.1 పోర్ట్‌లు మరియు USB 3.0 మరియు డాల్బీ అట్మాస్ మొత్తం ఆరు సిరీస్‌లలోని అన్ని UHD మోడళ్లలో ఉన్నాయి.

ధర మరియు లభ్యత వివరాలు
ఈ సిరీస్ స్మార్ట్ టీవీల యొక్క ధర వివరాలను ఏసర్ సంస్థ ఇంకా వెల్లడించలేదు. కానీ ఈ స్మార్ట్ టీవీలలో, Acer I సిరీస్ జూన్ 6 నుండి సేల్ కు వస్తుందని ప్రకటించింది. వీటి ధర వివరాలు సేల్ తేదీలో వెల్లడి చేయబడతాయి. అంతేకాకుండా, ఇతర సిరీస్ టీవీల ధరలను కూడా విక్రయ రోజున వెల్లడిస్తామని ఏసర్ తెలిపింది. ఇక ఈ టీవీ ల యొక్క రంగు ఎంపికలు అందుబాటులో లేవు.

More from GizBot

Best Mobiles in India

English summary
Acer Launches Various Series Smart Tvs In India. Series List And Specifications Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X