Acer నుంచి 2.8K OLED డిస్ప్లే తో కొత్త ల్యాప్‌టాప్! ధర, స్పెసిఫికేషన్లు
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ Acer అధికారికంగా భారతదేశంలో కొత్త OLED ల్యాప్‌టాప్ ను విడుదల చేసింది. ఈ ల్యాప్‌టాప్ Acer Swift Go పేరుతో వస్తుంది. ఈ సరికొత్త ల్యాప్‌టాప్ 13వ జెన్ ఇంటెల్ ప్రాసెసింగ్ హార్డ్‌వేర్ మరియు 2.8K OLED డిస్‌ప్లేతో ప్రీమియం డిజైన్ తో లాంచ్ అయింది.
ఇది సన్నని మరియు తేలికపాటి ల్యాప్‌టాప్‌గా లాంచ్ అయింది. ఈ ల్యాప్‌టాప్ ప్రీమియం అల్యూమినియం బిల్డ్‌తో స్లిమ్ మరియు లైట్ ఫారమ్ ఫ్యాక్టర్‌లో శక్తివంతమైన పనితీరును అందించడానికి ఏసర్ స్విచ్ గో, ఇంటెల్ ఎవో మరియు యునిసన్ సర్టిఫికేట్ లను కలిగి ఉంటుంది.

భారతదేశంలో Acer Swift Go ధర రూ.79,990 నుండి ప్రారంభమవుతుంది. ఈ స్విఫ్ట్ గో ల్యాప్‌టాప్ OLED డిస్ప్లే తో వస్తుంది. ఇది Acer ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లు, Acer E-స్టోర్, క్రోమా, విజయ్ సేల్స్ మరియు అమెజాన్ ఇండియా ద్వారా మీరు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.
Acer Swift Go స్పెసిఫికేషన్ల వివరాలు, ఈ ల్యాప్‌టాప్ 14 కోర్లు మరియు 45W వరకు 13వ జెన్ ఇంటెల్ కోర్ H-సిరీస్ ప్రాసెసర్ కలిగి ఉంది. ఇంకా CPU 16GB LPDDR5 RAM మరియు NVMe SSD నిల్వతో కూడా జత చేయబడింది. ఈ ల్యాప్‌టాప్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా కలిగి ఉంది, దీనిని 30 నిమిషాల సమయం ఛార్జ్ చేస్తే నాలుగు గంటల వరకు బ్యాటరీ జీవితాన్ని అందించగలదు.
అదనంగా, ఈ ల్యాప్‌టాప్ లో Acer యొక్క లిఫ్టింగ్ కీలు డిజైన్ మరియు TwinAir కూలింగ్ వ్యవస్థ కారణంగా 80 శాతం వరకు థర్మల్ పనితీరును మెరుగుపరుస్తాయి. ఇక ఈ ల్యాప్‌టాప్ యొక్క డిస్ప్లే వివరాలు చూస్తే, ఇది 16:10 యాస్పెక్ట్ రేషియోతో 14 అంగుళాల 2.8K OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు ఈ ల్యాప్‌టాప్ విండోస్ 11 OS తో వస్తుంది.
ఈ ల్యాప్‌టాప్ యొక్క స్క్రీన్ TÜV రైన్‌ల్యాండ్ యొక్క ఐసేఫ్ డిస్‌ప్లే స్టాండర్డ్‌తో అమర్చబడింది. వీడియో కాల్స్ కోసం 1440p QHD వెబ్‌క్యామ్ కూడా ఉంది. ఇది Acer యొక్క TNR (టెంపోరల్ నాయిస్ రిడక్షన్) టెక్నాలజీ తో మరియు AI నాయిస్ తగ్గింపుతో ప్యూరిఫైడ్ వాయిస్‌ని ఉపయోగిస్తుంది.
Acer Swift Go ల్యాప్‌టాప్ యొక్క డిజైన్ మరియు ఇతర ఫీచర్ల వివరాలు,ఈ ల్యాప్‌టాప్ 1.25 కిలోల బరువు తో మరియు 14.9mm మందంతో సన్నని మరియు తేలికపాటి డిజైన్ ని కలిగి ఉంటుంది. ఈ నోట్‌బుక్‌లో థండర్ బోల్ట్ 4 మరియు USB 4 పోర్ట్‌లు, HDMI పోర్ట్, మైక్రో SD కార్డ్ స్లాట్ మరియు Wi-Fi 6E కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఉన్నాయి.
ఈ కొత్త స్విఫ్ట్ గో ల్యాప్‌టాప్ యొక్క నిర్మాణంలో 100 శాతం సముద్రపు ప్లాస్టిక్ వ్యర్థాల ను ఉపయోగించినట్లు తెలియ చేయబడింది. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు 30 మైళ్ల వరకు జలమార్గాలు లేదా తీర ప్రాంతాల వెంబడి ఉన్న వ్యర్థాలను సేకరించబడుతుందని కూడా ప్రకటించారు.


Click it and Unblock the Notifications








