OnePlus నుంచి స్మార్ట్‌టీవీలు వచ్చేస్తున్నాయ్..
యాపిల్, సామ్‌సంగ్ వంటి దిగ్గజ బ్రాండల్‌కు షాకిస్తూ మొబైల్ మార్కెట్లో పెను సంచలనం రేపుతోన్న వన్‌ప్లస్ ఇప్పుడు స్మార్ట్‌టీవీల వ్యాపారంలోకి అడుగుపెట్టబోతోంది.
యాపిల్, సామ్‌సంగ్ వంటి దిగ్గజ బ్రాండల్‌కు షాకిస్తూ మొబైల్ మార్కెట్లో పెను సంచలనం రేపుతోన్న వన్‌ప్లస్ ఇప్పుడు స్మార్ట్‌టీవీల వ్యాపారంలోకి అడుగుపెట్టబోతోంది. కంపెనీ తీసుకున్న నిర్ణయాన్ని ఆ సంస్థ సీఈఓ పీట్ లాయు (Pete Lau) కంపెనీ అఫీషియల్ ఫోరమ్ ద్వారా వెల్లడించారు. 'Never Settle’ అనే ట్యాగ్‌లైన్‌తో టెక్ ప్రియులను ఆకర్షిస్తోన్న ఈ చైనా బేసిడ్ కంపెనీ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు వివిధ వెరైటీలలో హెడ్‌ఫోన్స్, మొబైల్ ఫోన్ యాక్సెసరీస్, బ్యాక్‌ప్యాక్స్, క్యాప్స్ ఇంకా టీషర్ట్స్‌ను మార్కెట్లో ఆఫర్ చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి వన్‌ప్లస్ టీవీ కూడా చేరబోతోంది.

బెస్ట్ క్వాలిటీ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్..
స్మార్ట్ టీవీలకు మార్కెట్లో అంతకంతకు డిమాండ్ పెరిగిపోతోన్న నేపథ్యంలో షియోమి కి పోటీగా వన్‌ప్లస్ తన స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. తాము పరిచయం చేయబోతోన్న స్మార్ట్‌టీవీ టెక్నాలజీ తదుపరి లెవల్ ఇంటెలిజెంట్ కనెక్టువిటీతో, బెస్ట్ క్వాలిటీ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రొవైడ్ చేయగలుగుతుందని పీట్ లాయు తెలిపారు.

ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ విభాగంలో విప్లవాత్మక మార్పులు..
ప్రీమియమ్ ఫ్లాగ్‌షిప్ డిజైన్‌తో తాము అభివృద్థి చేస్తోన్న కొత్త ప్రొడక్ట్ ఇమేజ్ క్వాలిటీ ఇంకా ఆడియో ఎక్స్‌పీరియన్స్ పరంగా కొత్త అనుభూతులను పంచబోతోందని పీట్ లాయు తన పోస్టులో పేర్కొన్నారు. తమ స్మార్ట్‌టీవీల ద్వారా బెస్ట్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రొవైడ్ చేసే క్రమంలో తమ టీమ్ ఇంకా కమ్యూనిటీ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, డిజైన్ ఇంకా ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ విభాగాల్లో అనేక కొత్త విషయాలను తెలుసుకోగలిగిందని ఆయన తెలిపారు.

రెండవ చైనీస్ బ్రాండ్‌గా వన్‌ప్లస్...
స్మార్ట్ టీవీ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోన్న రెండవ చైనీస్ బ్రాండ్‌గా వన్‌ప్లస్ గుర్తింపు తెచ్చుకుంది. మొదటి బ్రాండ్‌గా షావోమి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. షావోమి బ్రాండ్ నుంచి కొద్ది నెలల క్రితం ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన స్మార్ట్ టీవీలు అమ్మకాల సునామీని సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లలో లభ్యమవుతోన్న ఈ స్మార్ట్ టీవీలను వినయోగదారులు హాట్ కేకుల్లా సొంతం చేసుకుంటున్నారు.

త్వరలో కొత్త కాంటెస్టులు..
ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి ఆరంభ దశలో ఉండటంతో టీవీలకు సంబంధించి ఎటువంటి వివరాలను వన్‌ప్లస్ రివీల్ చేయలేదు. వన్‌ప్లస్ అఫీషియల్ ఫోరమ్‌కు 50 లక్షలకు పైగా సబ్‌స్ర్కైబర్ బేస్ ఉండటంతో కొత్త ఉత్పత్తులకు సంబంధించిన సజెషన్స్ అలానే ఫీడ్‌బ్యాక్స్‌ను యూజర్స్ వద్ద నుంచే కంపెనీ తీసుకుంటోంది. తమ టీవీలకు పేర్లను ఎంపిక చేసే క్రమంలో సరికొత్త కాంటెస్ట్‌లను కూడా వన్‌ప్లస్ కూడా నిర్వహించబోతునట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications