మళ్లీ దిగ్గజాలకు షాకిచ్చేందుకు శాంసంగ్ రెడీ, ఈ సారి tabletతో..

|

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఈ ఏడాది మొబైల్ రంగంలో సరికొత్త స్టెప్‌ని తీసుకుంటూ ముందుకు దూసుకెళుతోంది. అదిరిపోయే ఫీచర్లు, నాలుగు కెమెరాలతో సరికొత్త ఫోన్ ని మార్కెట్లోకి తీసుకొచ్చి సంచలనం రేకెత్తించిన సంగతి అందరికీ విదితమే. మిడ్ రేంజ్ సెగ్మెంట్లో శాంసంగ్ దిగ్గజాలకు సవాల్ విసురుతూ ముందుకు దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచపు ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ని వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఈ మేరకు ఓ ప్రకటనను కూడా బహిరంగపరిచింది. అయితే కంపెనీ ఇంతటితో ఆగకుండా మరిన్ని ఆవిష్కరణలకు తెరలేపింది. ఇందులో భాగంగా ఈ సౌత్ కొరియా టెక్ దిగ్గజం ఫోల్డబుల్ ట్యాబ్లెట్ మీద కసరత్తు చేస్తోంది.

 

ఛార్జింగ్ పెడుతుండగా పేలిన iPhone X

 మూడు స్క్రీన్ల ట్యాబ్లెట్ మీద వర్క్ చేస్తోంది....

మూడు స్క్రీన్ల ట్యాబ్లెట్ మీద వర్క్ చేస్తోంది....

శాంసంగ్ త్వరలో రెండు స్క్రీన్ల ట్యాబ్లెట్ కాకుండా మూడు స్క్రీన్ల ట్యాబ్లెట్ మీద వర్క్ చేస్తోంది. దీని కోసం కంపెనీ పేటెంట్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు MobielKopen website (via USPTO ) ద్వారా కనుగొంది. లీకయిన సమాచారం అలాగే చిత్రాన్ని చూస్తే శాంసంగ్ నిజంగానే మూడు స్క్రీన్ల ట్యాబ్లెట్ ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

స్క్రీన్లు కూడా స్మార్ట్ ఫోన్ సైజు స్క్రీన్లను కలిగి ఉన్నాయి....

స్క్రీన్లు కూడా స్మార్ట్ ఫోన్ సైజు స్క్రీన్లను కలిగి ఉన్నాయి....

ఈ మూడు స్క్రీన్లు కూడా స్మార్ట్ ఫోన్ సైజు స్క్రీన్లను కలిగి ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్ ని కంపెనీ కొన్ని ఆసక్తికర ఫీచర్లతో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ట్యాబ్లెట్ ని స్మార్ట్ ఫోన్ కన్నా ఎక్కువ స్క్రీన్ తోనూ అలాగే ట్యాబ్లెట్ కన్నా తక్కువ స్క్రీన్ తోనూ వాడుకోవచచ్చు.

శాంసంగ్ ఎటువంటి అధికారిక సమాచారాన్ని ఇవ్వలేదు....
 

శాంసంగ్ ఎటువంటి అధికారిక సమాచారాన్ని ఇవ్వలేదు....

అయితే దీనిపై శాంసంగ్ ఎటువంటి అధికారిక సమాచారాన్ని ఇవ్వలేదు. ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ప్రదర్శనకు రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే శాంసంగ్ 2019 నాటికి 1మిల్లియన్ డివైస్ లను విక్రయించడమే లక్ష్యంగా పెట్టుకుంది. 2019లో అతి పెద్ద టెక్ గెయింట్ గా అవతరించేందుకు వ్యూహాలను రచిస్తోంది.

ఫోల్డబుల్ స్క్రీన్ ఫీచర్లు కొన్న లీకయ్యాయి...

ఫోల్డబుల్ స్క్రీన్ ఫీచర్లు కొన్న లీకయ్యాయి...

గత వారం జరిగిన Samsung's developer conferenceలో ఫోల్డబుల్ స్క్రీన్ ఫీచర్లు కొన్న లీకయ్యాయి. శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్ అమెరికా మొబైల్ ప్రోడక్ట్ స్ట్రాటజీ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జస్టిన్ డెనిసన్ 7.3 అంగుళాలు స్క్రీన్‌తో ఈ డివైస్‌ మోడల్‌ను ప్రదర్శించారు. ప్రస్తుతానికి కేవలం ఫోను డిజైన్‌ మాత్రం విడుదల చేసిన కంపెనీ దీనిని ఎప్పుడు అందుబాటులోకి తెచ్చేదీ స్పష్టం చేయలేదు. చూడ్డానికి పాకెట్‌ సైజ్‌లో ట్యాబ్‌లాగాన కనిపించే ఈ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర, పేరు, ప్రత్యేకతల వివరాలు ఇంకా వెల్లడించ లేదు.

Most Read Articles
Best Mobiles in India

English summary
After foldable phones, Samsung patent shows a foldable tablet with three screens more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X