అలెక్సాలో హిడెన్ జెమ్.. ఈ ఫీచర్ తెలిస్తే ప్రియమైన వారికి హగ్గులు పంపకుండా ఉండలేరు!
Alexa Hidden Feature: ప్రముఖ వాయిస్ అసిస్టెంట్ అలెక్సా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇది చాలా పనులు చేయగలదు. చివరికి వర్చువల్ హగ్స్ సైతం పంపగలదు. ఇది మీ ప్రియమైన వాళ్ల రోజును చాలా ఆహ్లాదకరంగా మార్చేయగలదు. మీ బెస్ట్ ఫ్రెండ్ కాస్త డల్లుగా ఉన్నా, లేదా మీ ఇంట్లో వాళ్లకి మీ ప్రేమను గుర్తు చేయాలన్నా, ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
మీ దగ్గర అలెక్సా ఎకో డివైజ్ ఉంటే వెంటనే ట్రై చేయవచ్చు. వర్చువల్‌గా కౌగిలింత పంపించడం చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది, చేతులు కూడా వాడక్కర్లేదు, పైగా మీ ముఖంలో చిరునవ్వు కూడా పూయిస్తుంది. వర్చువల్ హగ్ ఎలా పంపాలి, ఎందుకు పంపాలో ఇప్పుడు తెలుసుకుందాం.

* వర్చువల్ హగ్ ఎందుకు పంపాలి..
ప్రేమను, ఆప్యాయత, భరోసా చూపించడానికి కౌగిలింతలు చాలా గొప్ప మార్గం. కానీ కొన్నిసార్లు దూరం వల్ల నిజమైన హగ్స్ ఇవ్వడం కుదరదు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడో దూరంగా ఉన్నా, లేదా పక్క ఊర్లోనే ఉన్నా, వర్చువల్ హగ్ మీ వాయిస్ తోనే వెచ్చదనాన్ని పంచేస్తుంది.
వయసు పైబడిన మీ బంధువులను పలకరించడానికి, మీ ఫ్రెండ్స్‌ని ఉత్సాహపరచడానికి లేదా సింపుల్‌గా మీరు వాళ్ల గురించి ఆలోచిస్తున్నారని చెప్పడానికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇది పూర్తిగా హ్యాండ్స్-ఫ్రీ. మీరు వంట చేస్తూ ఉన్నా, వర్క్‌లో బిజీగా ఉన్నా, ఫోన్ ఎక్కడో పడేసుకున్నా.. అలెక్సా మీ పని చేసేస్తుంది.
* వర్చువల్ హగ్ అంటే ఏంటి..
వర్చువల్ హగ్ అంటే అలెక్సా మీ తరపున ఇంకో అలెక్సా ఎకో డివైజ్‌కి హగ్ పంపుతుంది. "అలెక్సా, సెండ్ ఏ హగ్" అని మీరు అనగానే, ఎవరికి పంపాలో అడుగుతుంది. రిసీవర్ వాళ్ల ఎకో డివైజ్‌లో లేదా అలెక్సా యాప్‌లో నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఒకరు హగ్ పంపారని వాళ్లకి తెలుస్తుంది.
* ఎలా సెటప్ చేసుకోవాలి?
ఒకవేళ మీ కాంటాక్ట్స్ కనిపించకపోతే, సింపుల్ సెటప్ ప్రాసెస్ అలెక్సానే మీకు అన్నీ చెబుతుంది. ఈ ఫీచర్‌ని ఎనేబుల్ చేసుకోవాలంటే, అలెక్సా యాప్ ఓపెన్ చేసి మీ కాంటాక్ట్స్‌ని సింక్ చేయాలి. యాప్ కింద మెనూ (మూడు గీతల ఐకాన్) ఉంటుంది కదా, దాని మీద ట్యాప్ చేసి "కమ్యూనికేట్" సెలెక్ట్ చేసుకోవాలి.
తర్వాత, పైన కుడివైపు కార్నర్ లో కాంటాక్ట్స్ ఐకాన్ ఉంటుంది. అలెక్సా మీ కాంటాక్ట్స్ ని యాక్సెస్ చేయడానికి పర్మిషన్ అడుగుతుంది - "ఎస్", "అలౌ" అని సెలెక్ట్ చేయండి. దాంతో మీ కాంటాక్ట్ లిస్ట్ సింక్ అయిపోతుంది, మీరు వర్చువల్ హగ్స్ పంపడానికి రెడీ.
* ఇంకా చాలా ఫన్ హిడెన్ అలెక్సా కమాండ్స్.
అలెక్సా కేవలం వర్చువల్ హగ్స్ మాత్రమే కాదు, ఇంకా చాలా చాలా చేయగలదు. మీకు తెలీని కొన్ని ఫన్ కమాండ్స్ ఇక్కడ ఉన్నాయి. "అలెక్సా, డ్రాప్ ఏ బీట్." అలెక్సా మీకోసం బీట్ బాక్స్ చేస్తుంది, అది కూడా చాలా చక్కగా పర్ఫార్మ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో సరదాగా గడపడానికి ఇది ఒక మంచి ట్రిక్.
"అలెక్సా, సింగ్ ఫర్ మీ." అలెక్సా పాటలు కూడా పాడగలదు, అది కూడా మంచి రిథమ్ తో. ఫెస్టివల్ మూడ్ కోసం శాంతా క్లాజ్ వాయిస్ కూడా యూజ్ చేస్తుంది. "అలెక్సా, ఫ్లాటర్ మీ." అనే కమాండ్ కూడా ఇవ్వచ్చు. కాస్త కాన్ఫిడెన్స్ బూస్ట్ కావాలంటే, అలెక్సా ఫన్నీ కాంప్లిమెంట్స్ ఇస్తుంది.
* వాయిస్ కమాండ్స్ మాత్రమే కాదు..
అలెక్సాలో అలెక్సా స్కిల్స్ కూడా ఉన్నాయి. ఇవి వాయిస్‌తో పనిచేసే యాప్స్ లాంటివి. వీటితో అలెక్సా ఇంకా చాలా పనులు చేస్తుంది. స్మార్ట్ హోమ్ డివైజ్ లను కంట్రోల్ చేయడం, పాడ్‌క్యాస్ట్ లు ప్లే చేయడం, గేమ్స్ ఆడడం.. ఇలా చాలా చేయొచ్చు.


Click it and Unblock the Notifications








