Home
Gadgets

10 రోజుల బ్యాటరీ లైఫ్‌, బ్లూటూత్‌ కాలింగ్‌, హెల్త్‌, ఫిట్‌నెస్‌ ట్రాకర్‌లతో Amazfit Active 2 స్మార్ట్‌వాచ్‌

ప్రముఖ గ్యాడ్జెట్స్‌ తయారీ సంస్థ అమేజ్‌ఫిట్‌ భారత్‌ మార్కెట్‌లో Amazfit Active 2 స్మార్ట్‌వాచ్‌ను (Amazfit Active 2 Smartwatch Launched) లాంచ్ చేసింది. ఈ వాచ్‌ అనేక హెల్త్‌ ట్రాకర్‌లు సహా స్మార్ట్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేసి 10 రోజుల వరకు వినియోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్‌, iOS యూజర్లు ‌ప్రత్యేక యాప్‌ ద్వారా ఈ వాచ్‌ను ఫోన్‌కు కనెక్ట్‌ చేయవచ్చు. 164 వర్కౌట్‌ మోడ్స్‌ను సపోర్టు

అమేజ్‌ఫిట్‌ యాక్టివ్‌ 2 స్మార్ట్‌వాచ్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
అమేజ్‌ఫిట్‌ యాక్టివ్‌ 2 స్మార్ట్‌వాచ్‌ వృత్తాకార డిజైన్‌తో కూడిన డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 1.32 అంగుళాల (466*466 పిక్సల్స్‌) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ వాచ్‌ డిస్‌ప్లే 2000 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌తోపాటు 353 ppi పిక్సల్‌ డెన్సిటీని కలిగి ఉంది.

Amazfit Active 2 smartwatch

యూజర్ల శారీరక స్థితిని తెలుసుకొనేందుకు వీలుగా బయోట్రాకర్‌ 6.0 PPG సెన్సార్‌ను అమర్చారు. దీంతోపాటు హార్ట్‌ రేట్‌ మానిటర్‌, SpO2 మానిటర్‌, ఒత్తిడి స్థాయి, స్లీప్‌ మానిటరింగ్‌ తోపాటు మహిళల్లో రుతుక్రమానికి సంబంధించిన వివరాలు కూడా ట్రాకింగ్ చేయగలదు.

కనెక్టివిటీ పరంగా అమేజ్‌ఫిట్‌ యాక్టివ్‌ 2 హ్యాండ్‌సెట్‌ బ్లూటూత్‌ 5.2 ను కలిగి ఉంది. దీని ద్వారా వాచ్‌ నుంచే కాల్స్‌ చేయడంతోపాటు కాల్స్‌ రిసీవ్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌వాచ్‌ ద్వారా కాల్‌, SMS నోటిఫికేషన్‌లను పొందవచ్చు.

అమేజ్‌ఫిట్‌ యాక్టివ్‌ 2 Zepp Flow AI వాయిస్‌ కంట్రోల్‌ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఫీచర్‌ ద్వారా కేవలం వాయిస్‌ ద్వారానే వాచ్‌ సెట్టింగ్స్‌, క్యాలెండర్‌లో మార్పులను చేసేందుకు వీలుంటుంది. కెమెరా కంట్రోల్‌, మ్యూజిక్‌ కంట్రోల్‌, ఫైండ్‌ మై ఫోన్‌ ఫీచర్‌ వంటి ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది.

అమేజ్‌ఫిట్‌ యాక్టివ్‌ 2 స్మార్ట్‌వాచ్‌ 270mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి గరిష్ఠంగా 10 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. హెవీ యూజర్లకు 5 రోజుల బ్యాటరీ లైఫ్‌ ఇస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ 5 ATM వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

ఈ వాచ్‌ సైక్లింగ్‌, స్విమ్మింగ్‌ సహా 164 వర్కౌట్‌ మోడ్స్‌ను సపోర్టు చేస్తుంది. నేవిగేషన్‌ కోసం రెండు ప్రత్యేక బటన్స్‌ను కలిగి ఉంటాయి. ఆండ్రాయిడ్‌, iOS యూజర్లు Zepp యాప్‌ ద్వారా ఈ స్మార్ట్‌వాచ్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ యూజర్లు తమ మెసేజ్‌లకు కీబోర్డు లేదా స్పీచ్‌ టూ టెక్ట్స్‌ ద్వారా రిప్లై చేయవచ్చు.

అమేజ్‌ఫిట్‌ యాక్టివ్‌ 2 స్మార్ట్‌వాచ్‌ ధర, సేల్‌ వివరాలు :
అమేజ్‌ఫిట్‌ యాక్టివ్‌ 2 స్మార్ట్‌వాచ్‌ స్టాండర్డ్‌ వేరియంట్ ధర రూ.9999 గా ఉంది. అదే ప్రీమియం వెర్షన్‌ ధర రూ.11999 గా ఉంది. స్టాండర్డ్ వేరియంట్‌ బ్లాక్‌ సిలికాన్‌ స్ట్రాప్‌ను కలిగి ఉంటుంది.

అదే ప్రీమియం వేరియంట్‌ బ్లాక్‌ లెదర్‌ స్ట్రాప్‌ తోపాటు రెడ్‌ సిలికాన్‌ స్ట్రాప్‌ను అందించనున్నారు. ప్రస్తుతం ఈ స్మార్ట్‌వాచ్‌ను ప్రస్తుతం Amazfir india వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్‌ మరియు ఇతర ప్రధాన రిటైల్‌ స్టోర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazfit Active 2 smartwatch launched in india with 10 days battery life and bluetooth calling
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X