12 రోజుల బ్యాటరీ లైఫ్, 1.91 అంగుళాల డిస్‌ప్లే, Amazfit స్మార్ట్‌వాచ్ విడుదల.. సేల్ వివరాలు..!!
ప్రముఖ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ Amazfit కొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. భారత్ మార్కెట్‌లో Amazfit Bip 5 Unity స్మార్ట్‌వాచ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వాచ్ ఆకట్టుకొనే డిజైన్ సహా మెరుగైన పనితీరును కలిగి ఉందని సంస్థ తెలిపింది. హెల్త్ ట్రాకర్లను కూడా కలిగి ఉంటుందని వెల్లడించింది.
ఈ Amazfit Bip 5 Unity స్మార్ట్‌వాచ్ 1.91 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు స్టెయిన్‌లెస్ స్టీల్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా ఎక్కువ కాలం మన్నిక వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ అత్యాధునిక Zepp OS 3.0 పైన పనిచేస్తుంది. అనేక మినీ యాప్‌లను ఉపయోగించుకొనేందుకు వీలుగా ఉంటుంది.

ఈ స్మార్ట్‌వాచ్ అనేక హెల్త్ ట్రాకర్లను కలిగి ఉంటుంది. మరియు Amazfit ఇండియా అధికారిక వెబ్‌సైట్ మరియు అమెజాన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ద్వారా కొనుగోలు చేయవచ్చు. గ్రే, చార్‌కోల్, పింక్ రంగుల్లో లభిస్తుంది. మరియు IP68 డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా వస్తుంది.
Amazfit Bip 5 Unity స్మార్ట్ వాచ్ అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఫలితంగా మెరుగైన పనితీరును కనబరుస్తుంది. దీంతోపాటు సమర్థవంతంగా బ్లూటూత్ కనెక్టివిటీని కలిగి ఉంటుంది. ఫలితంగా కాలింగ్ సమయంలో మరియు ఇతర సమయాల్లో అవస్థలు లేకుండా కనెక్టింగ్ చేయవచ్చు.
ఈ స్మార్ట్‌వాచ్ అనేక సెన్సార్లను కలిగి ఉంటుంది. యాక్సెలిరోమీటర్, హార్ట్ రేట్ సెన్సార్, 3- యాక్సిస్ మోషన్ సెన్సార్ ఫలితంగా హెల్త్ టాకర్లు సమర్థవంతంగా పనిచేయనున్నాయి. దీంతోపాటు 120 స్పోర్ట్ మోడ్‌లను కలిగి ఉంటుంది. 24 గంటలపాటు హార్ట్ రేట్ పర్యవేక్షించవచ్చు. మరియు SpO2 మరియు ఒత్తిడిని పర్యవేక్షించవచ్చు.
దీంతోపాటు కాలెండర్ రిమైండర్‌లు, కాల్ నోటిఫికేషన్‌లు, స్మార్ట్‌ఫోన్ యాప్ నోటిఫికేషన్‌లు, కేవలం రెండు గంటల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జింగ్ చేయవచ్చు. సింగిల్ ఛార్జింగ్ ద్వారా 12 రోజులపాటు బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటుంది. Amazfit Bip 5 Unity స్మార్ట్‌వాచ్ ధర రూ.6999 గా ఉంది.
ఈ స్మార్ట్‌వాచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పర్సనల్ వెల్‌నెస్ అసిస్టెంట్ Zepp Aura ను కలిగి ఉంది. దీని ద్వారా వ్యక్తిగత హెల్త్ రిపోర్టులను పొందవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్ తమ ప్రయాణంలో ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని పీఆర్ ఇన్నోవేషన్స్ సీఈవో సీపీ ఖండేలాల్ తెలిపారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ Zepp OS 3.0 ఆధారంగా పనిచేస్తుంది. తక్కువ ధరలో అధునాతన టెక్నాలజీ తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ వినియోగదారులు నిరంతరం కనెక్టెడ్ గా ఉండడం సహా ఆరోగ్యవంతంగా ఉండేలా చూస్తుందని తెలిపారు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








