Home
Gadgets

రెండు వారాల బ్యాటరీ లైఫ్‌, బ్లూటూత్‌ కాలింగ్‌, హెల్త్ ట్రాకర్‌లతో అమేజ్‌ఫిట్‌ స్మార్ట్‌వాచ్‌.. ఫీచర్‌ల వివరాలు

అమేజ్‌ఫిట్‌ నుంచి కొత్తగా స్మార్ట్‌వాచ్‌ విడుదల అయింది. అమేజ్‌ఫిట్‌ Bip 6 పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వాచ్‌ అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. మరియు బ్లూటూత్‌ కాలింగ్‌ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌వాచ్ డిస్‌ప్లే 2000 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఈ అమేజ్‌ఫిట్‌ స్మార్ట్‌వాచ్‌ బిల్ట్‌ ఇన్ GPS ను సపోర్టు చేస్తుంది.

అమేజ్‌ఫిట్‌ Bip 6 స్మార్ట్‌వాచ్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ అమేజ్‌ఫిట్‌ స్మార్ట్‌వాచ్‌ (Amazfit Bip 6 Smartwatch) 390 x 450 పిక్సల్స్‌ రిజల్యూషన్‌తో 1.97 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ వాచ్‌ యాంటీ ఫింగర్‌ ప్రింట్‌ కోటింగ్‌తో కూడిన టెంపర్డ్‌ గ్లాస్‌ ద్వారా రక్షణ పొందుతుంది.

Amazfit Bip 6 Smartwatch l

ఏయే ఫోన్‌లకు సపోర్టు చేస్తుంది ? :
అమెజ్‌ఫిట్‌ Bip 6 స్మార్ట్‌వాచ్‌ Zepp OS 2.0 పైన పనిచేస్తోంది. కనెక్టివిటీ పరంగా ఈ స్మార్ట్‌వాచ్‌ బ్లూటూత్‌ 5.2 ను సపోర్టు చేస్తుంది. ఈ వాచ్‌ ఆండ్రాయిడ్‌ OS 7.0 లేదా అంతకంటే అప్‌డేట్‌ వెర్షన్‌ పైన పనిచేస్తుంది. అదే విధంగా iOS 14.0 లేదా అంతకంటే అప్‌డేట్‌ వెర్షన్‌ ఫోన్‌లను సపోర్టు చేస్తుంది.

హెల్త్ ట్రాకర్‌లు :
అమేజ్‌ఫిట్‌ Bip 6 స్మార్ట్‌వాచ్‌ ద్వారా అనేక హెల్త్‌ అప్‌డేట్స్‌ను పొందవచ్చు. ఇందులో హార్ట్‌ రేట్‌ ట్రాకింగ్‌, SpO2, ఒత్తిడిని కూడా పర్యవేక్షించవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌ అనేక సెన్సార్‌లను కలిగి ఉంటుంది. ఈ వాచ్‌లో అమర్చిన బయోట్రాకర్‌ PPG బయోమెట్రిక్‌ సెన్సార్‌ ద్వారా బ్లడ్‌ ఆక్సిజన్‌ స్థాయిని పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుంది.

దీంతోపాటు యాక్సెలిరేషన్‌ సెన్సార్‌, యాంబియంట్ లైట్‌ సెన్సార్‌, జియోమాగ్నటిక్‌, గైరోస్కోప్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ వాచ్ ఇన్‌బిల్ట్‌ మైక్రోఫోన్‌, స్పీకర్‌ను కలిగి ఉంటుంది. బ్లూటూత్‌ కాలింగ్‌ సమయంలో ఉపయోగపడుతుంది.

Amazfit Bip 6 Smartwatch l

5 ATM వాటర్ రెసిస్టెంట్‌ :
దీంతోపాటు స్మార్ట్‌ఫోన్‌కు వచ్చే యాప్‌ నోటిఫికేషన్లు, కాల్‌ నోటిఫికేషన్‌లను వాచ్‌ ద్వారానే తెలుసుకొనేందుకు అవకాశం ఉంది. వాచ్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్ కెమెరా, మ్యూజిక్‌ ఆప్షన్స్‌ను కంట్రోల్‌ చేయవచ్చు. ఈ వాచ్‌ 5 ATM వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుంది. 50 మీటర్ల నీటి లోతులోనూ డ్యామేజీ కాదు.

రెండు వారాల బ్యాటరీ లైఫ్‌ :
అమేజ్‌ఫిట్‌ స్మార్ట్‌వాచ్‌ 340mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జింగ్ చేసి, రెండు వారాల వరకు ఉపయోగించుకోవచ్చని సంస్థ చెబుతోంది. ఎక్కువగా ఉపయోగిస్తే 6 రోజుల బ్యాటరీ లైఫ్‌ను పొందవచ్చు. ఈ అమేజ్‌ఫిట్‌ Bip 6 స్మార్ట్‌వాచ్‌ స్ట్రాప్‌ లేకుండా 27.9 గ్రాముల బరువును ఉంటుంది.

అమేజ్‌ఫిట్ Bip 6 స్మార్ట్‌వాచ్ ధర, సేల్‌ వివరాలు :
ఈ స్మార్ట్‌వాచ్‌ ప్రారంభ ధర రూ.7999 గా ఉంది. ఇవాళ్టి నుంచే భారత్‌ మార్కెట్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ వాచ్‌ను అమేజ్‌ఫిట్‌ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ వాచ్‌ బ్లాక్‌, స్టోన్‌, రెడ్‌, చార్‌కోల్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazfit Bip 6 Smartwatch launched in india with two weeks battery life, sale is live in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X