అదర‌గొట్టే ఫీచ‌ర్ల‌తో Amazfit నుంచి ప్రీమియం స్మార్ట్‌వాచ్ విడుద‌ల‌!

|

ప్ర‌ముఖ స్మార్ట్ వేర‌బుల్స్ ఉత్ప‌త్తుల త‌యారీ కంపెనీ Amazfit, సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను భార‌త మార్కెట్‌కు ప‌రిచ‌యం చేసింది. Amazfit GTR 4 స్మార్ట్‌వాచ్‌ని భారతదేశంలో విడుదల చేసింది. ఇది ఇప్ప‌టికే కొన్ని రోజుల క్రితం Amazfit GTS 4 వాచ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా లాంచ్ అయిన ప్రీమియం స్మార్ట్‌వాచ్‌. ఇది 2021లో ఆవిష్క‌రించ‌బ‌డిన Amazfit GTR 3కి సీక్వెల్‌గా వస్తుంది. ఈ కొత్త స్మార్ట్‌వాచ్ అనేక ర‌కాల అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంది.

 
అదర‌గొట్టే ఫీచ‌ర్ల‌తో Amazfit నుంచి ప్రీమియం స్మార్ట్‌వాచ్ విడుద‌ల‌!

ఆరోగ్య మరియు ఫిట్‌నెస్ కు సంబంధించి యూజ‌ర్ల అవ‌స‌రాల‌ను తీర్చ‌గ‌ల అనేక‌ ఫీచర్‌లను అందిస్తుంది. అంతేకాకుండా, దీనికి సుదీర్ఘ స‌మ‌యం లైఫ్ ఇచ్చే బ్యాట‌రీతో రూపొందించారు. ఇప్పుడు ఈ వాచ్ ధ‌ర‌లు, పూర్తి స్పెసిఫికేష‌న్ల గురించి వివ‌రంగా తెలుసుకుందాం.

భార‌త్‌లో Amazfit GTR 4 ధ‌ర‌:
భారతదేశంలో Amazfit GTR 4 స్మార్ట్‌వాచ్ ధ‌ర రూ.16,999 గా నిర్ణ‌యించారు. ఈ స్మార్ట్ వాచ్ రేస్ట్రాక్ గ్రే మరియు సూపర్‌స్పీడ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలుదారుల‌కు అందుబాటులోకి వ‌స్తుంది. లాంచ్ ఆఫర్లలో భాగంగా, ఈ వేర‌బుల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో (అన్ని ఆఫ‌ర్లు క‌లిపి) రూ.15,299 పొంద‌వ‌చ్చు. ముఖ్యంగా, ఈ వాచ్ ఈరోజు నుండి ఫ్లిప్‌కార్ట్ మరియు అధికారిక Amazfit ఇ-స్టోర్ ద్వారా అమ్మకానికి సిద్ధంగా ఉంటుంద‌ని కంపెనీ వెల్ల‌డించింది.

అదర‌గొట్టే ఫీచ‌ర్ల‌తో Amazfit నుంచి ప్రీమియం స్మార్ట్‌వాచ్ విడుద‌ల‌!

Amazfit GTR 4 స్పెసిఫికేష‌న్లు:
Amazfit GTR 4 స్మార్ట్‌వాచ్ 466 x 466 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. Amazfit GTR 4 ఒక వృత్తాకార డయల్ మరియు మెటల్ కేస్‌ను క‌లిగి ఉంది. స్క్రీన్‌పై యాంటీ ఫింగర్‌ప్రింట్ కోటింగ్ మరియు అలాగే రక్షణ కోసం టెంపర్డ్ గ్లాస్ ఉన్నాయి. అలాగే, ఇది ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే విధంగా ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే మోడ్ ఫీచ‌ర్‌ను క‌లిగి ఉంది. ఇది 200 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లకు మద్దతు ఇస్తుంది.

ఈ స్మార్ట్‌వాచ్‌ని Zepp Health యాప్ ద్వారా వినియోగించ‌వ‌చ్చు. మరియు కొత్త Zepp OS 2.0 ద్వారా ర‌న్ అవుతుంది. ఇది వినియోగదారుల‌కు మృదువైన, అద్భుత‌మైన అనుభవాన్ని అందజేస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ UI తక్కువ శక్తిని వినియోగిస్తుందని మరియు Home Connect మరియు GoPro వంటి ఎంపిక చేసిన థ‌ర్డ్ పార్టీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి వినియోగదారులను అనుమతిస్తుంది అని కంపెనీ పేర్కొంది.

అదర‌గొట్టే ఫీచ‌ర్ల‌తో Amazfit నుంచి ప్రీమియం స్మార్ట్‌వాచ్ విడుద‌ల‌!

ఫిట్‌నెస్ మ‌రియు ఆరోగ్యానికి సంబంధించిన ఫీచ‌ర్ల విషయానికి వస్తే, Amazfit GTR 4 స్లీప్ ట్రాకింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, స్ట్రెస్ మానిటరింగ్, మెన్‌స్ట్రువల్ సైకిల్ ట్రాకింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ మెజర్‌మెంట్ మరియు మరిన్ని ఫీచ‌ర్ల‌తో యూజ‌ర్ల‌కు అందిస్తుంది. ఇది 150కి పైగా వివిధ రకాల ఫిట్‌నెస్‌, స్పోర్ట్స్ వర్కవుట్‌లకు స‌పోర్టు ఇస్తుంది. మరియు ఈ వర్కవుట్‌లలో కొన్నింటికి ఆటోమేటిక్ వర్కౌట్ డిటెక్షన్‌కు స‌పోర్టు క‌లిగి ఉంది. ఇక ఛార్జ్ విష‌యానికొస్తే.. 475mAh సామర్థ్యం క‌లిగిన బ్యాట‌రీని క‌లిగి ఉంది. ఇది ఒకసారి ఫుల్‌ ఛార్జ్‌పై గరిష్టంగా 14 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. Amazfit GTR 4 స్మార్ట్‌వాచ్‌ iOS 12.0 మరియు ఆపైన లేదా ఆండ్రాయిడ్ 7.0 మరియు ఆపైన ఓఎస్‌ల‌పై ఆధార ప‌డి ర‌న్ అవుతున్న డివైజ్‌ల‌కు అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు, ఫాల్ డిటెక్షన్ మరియు బ్లూటూత్ కాలింగ్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.

 

భారతదేశంలో Amazfit GTR 4 స్మార్ట్‌వాచ్ ధ‌ర రూ.16,999 గా నిర్ణ‌యించారు. ఈ స్మార్ట్ వాచ్ రేస్ట్రాక్ గ్రే మరియు సూపర్‌స్పీడ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలుదారుల‌కు అందుబాటులోకి వ‌స్తుంది. లాంచ్ ఆఫర్లలో భాగంగా, ఈ వేర‌బుల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో (అన్ని ఆఫ‌ర్లు క‌లిపి) రూ.15,299 పొంద‌వ‌చ్చు.

Best Mobiles in India

English summary
The new Amazfit GTR watch launched in india Sale goes on live in amazon

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X