Helio Ring భారత్ మార్కెట్‌లోకి త్వరలో మరో Smart Ring.. హెల్త్ ట్రాకర్లు సహా ఎన్నో ప్రత్యేకతలు..!
ప్రముఖ గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ అమేజ్‌ఫిట్ నుంచి స్మార్ట్ రింగ్ విడుదల కానుంది. సీపీ ఖండేవాల్ ఈ రింగ్ విడుదలపై X ద్వారా వెల్లడించారు. అమేజ్‌ఫిట్ హీలియో రింగ్ (Amazfit Helio Ring) పేరుతో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్ రింగ్‌ను తొలిసారిగా Consumer Electronics Show 2024 లో ఆవిష్కరించారు. ఈ స్మార్ట్ రింగ్ త్వరలో భారత్‌లో లాంచ్ కానుంది. ఇప్పటికే అమేజ్‌ఫిట్ ఇండియా వెబ్‌సైట్‌లో ఇందుకు సంబంధించిన వివరాలున్నాయి. ఈ రింగ్ అనేక హెల్త్ ట్రాకర్‌లను కలిగి ఉంటుంది. అయితే కచ్చితంగా ఎప్పుడు విడుదల కానుందనే వివరాలు వెల్లడి కాలేదు.
అమేజ్‌ఫిట్ సీపీ ఖండేవాల్ ఈ హీలియో రింగ్ డిజైన్‌ను కూడా విడుదల చేశారు. టైటానియం రంగును కలిగి ఉంది. గ్లోబల్ వేరియంట్ తరహా ఫీచర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ హీలియో రింగ్ ప్రస్తుతం అమేజ్‌ఫిట్ ఇండియా వెబ్‌సైట్‌లో లిస్టింగ్‌లో ఉంది. ఈ లిస్టింగ్ ఆధారంగా కొన్ని వివరాలు వెల్లడయ్యాయి.

భారత్ వేరియంట్ అమేజ్‌ఫిట్ హీలియో రింగ్ రెండు సైజుల్లో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. టైటానియం సహా 10 ATM వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ మరియు BLE (బ్లూటూత్ లో ఎనర్జీ) కనెక్టివిటీను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌రింగ్ అనేక మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉంటుంది.
అమేజ్‌ఫిట్ హీలియో రింగ్ అనేక ఫిట్‌నెస్ ట్రాకర్లను కలిగి ఉంటాయి. నిద్ర, హార్ట్ రేట్, SpO2 స్థాయి, శరీర ఉష్ణోగ్రత, రుతుక్రమాన్ని ట్రాక్ చేస్తాయి. దీంతోపాటు బయోట్రాకర్ PPG హార్ట్ రేట్ సెన్సార్, ఉష్ణోగ్రత తెలిపే పరికరం, EDA సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ సెన్సార్ స్వేద గ్రంధి కార్యకాలాపాలు సహా శారీరక, భావోద్వేగ ఒత్తిడిని పర్యవేక్షిస్తుంది.
Exciting News!
— CP Khandelwal (@cp_khandelwal) September 10, 2024
The Amazfit Helio Ring is launching in India soon! 🌟 Stay tuned for the big reveal and be among the first to experience our latest innovation in health tracking.
Stay connected for updates! ✨#AmazfitHelioRing #HealthTracking #ComingSoon pic.twitter.com/TZnhvIzjfW
ఈ హెల్త్ ట్రాకర్ల వివరాలను Zepp యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ యాప్ ఆండ్రాయిడ్, iOS లోనూ పనిచేస్తుంది. అయితే ఆండ్రాయిడ్ 7.0 సహా అప్‌గ్రేడ్ వెర్షన్‌లో పనిచేస్తుంది. అదే iOS 14.0 మరియు అప్‌గ్రేడ్ వెర్షన్‌లలో మాత్రమే ఈ యాప్ పనిచేస్తుంది. ఈ స్మార్ట్ రింగ్‌ను Strava, గూగుల్ ఫిట్, ఆపిల్ హెల్త్ వంటి థర్డ్ పార్టీ యాప్‌లను కూడా సపోర్టు చేస్తుంది.
అమేజ్‌ఫిట్ హీలియో రింగ్ 10 సైజ్ 18.5mAh బ్యాటరీ, 12 సైజ్ 20.5mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ రింగ్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. సింగిల్ ఛార్జింగ్‌తో నాలుగు రోజులపాటు బ్యాటరీ లైఫ్ వస్తుందని సంస్థ చెబుతోంది. 10 సైజు రింగ్ 3.75 గ్రాములు, 12 సైజ్ స్మార్ట్ రింగ్ 3.82 గ్రాములుగా ఉంటుంది. ధర వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
అమేజ్‌ఫిట్ స్మార్ట్‌వాచ్ :
అమేజ్‌ఫిట్ నుంచి గత వారం GTR 4 న్యూ స్మార్ట్‌వాచ్ విడుదల అయింది. స్మార్ట్‌వాచ్ 1.45 అంగుళాల వృత్తాకార అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ స్టెయిన్‌లెస్ స్టీల్ ఫ్రేమ్, గ్లాస్ సిరామిక్ షేల్‌ను కలిగి ఉంది. ఇన్‌బిల్ట్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌తో అందుబాటులోకి వచ్చింది. మరియు 5 ATM వాటర్ రిసిస్టెంట్‌గా ఉంది.
ఈ స్మార్ట్‌వాచ్ 475mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. సింగిల్ ఛార్జింగ్‌తో 12 రోజుల వరకు (Typical Usage) వినియోగించుకోవచ్చు. ఎక్కువగా వినియోగించే వారికి (Heavy Usage) 8 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని సంస్థ చెబుతోంది. అయితే GPS మోడ్ ఆన్‌లో ఉంటే సింగిల్ ఛార్జింగ్‌తో 28 గంటల బ్యాటరీ లైఫ్‌ను పొందవచ్చని సంస్థ చెబుతోంది.


Click it and Unblock the Notifications








