Home
Deal of the day

Amazonలో ఇటీవల లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై గొప్ప డిస్కౌంట్ ఆఫర్లు...

ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేయడానికి ఇష్టపడే యూజర్లకు ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నేటి "డీల్ అఫ్ ది డే" విభాగంలో కొన్ని స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు మీద అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నది. కస్టమర్‌లు నేటి డీల్ అఫ్ ది డే యొక్క ఆఫర్లు మరికొద్ది గంటలలో ముగియనున్నది. ముఖ్యంగా ఇటీవల లాంచ్ అయిన కొత్త స్మార్ట్‌ఫోన్లను కొనాలని ప్రయత్నిస్తున్న వారికి అద్భుతమైన ఆఫర్లు అందిస్తున్నాయి. అయితే ఈ ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ ఇప్పుడు కొన్ని గొప్ప ఆఫర్లను అందిస్తున్నది. ఐసీఐసీఐ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను కలిగి వారికి 10% వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Amazon Ecommerce Site Offers More Discounts on Buying Latest Launches Smartphones

టెక్నో స్పార్క్ 8T ధర రూ.8,999

టెక్నో స్పార్క్ 8T స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు అమెజాన్ లో 4GB RAM + 64GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్లో రూ.8,999 బడ్జెట్ ధరలో అట్లాంటిక్ బ్లూ, కోకో గోల్డ్, ఐరిస్ పర్పుల్ మరియు టర్కోయిస్ సియాన్ వంటి నాలుగు కలర్ ఎంపికలతో లభిస్తుంది. ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై HiOS v7.6తో రన్ అవుతుంది. అలాగే ఇది 91.3 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో మరియు ఒక గరిష్ట ప్రకాశం 500 నిట్స్ తో కూడిన 6.6-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,408 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్ 4GB RAM మరియు 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో పాటు ఆక్టా-కోర్ MediaTek Helio A35 SoC ద్వారా శక్తిని పొందుతుంది. Tecno Spart 8Tలో ప్రత్యేక స్లాట్ ద్వారా మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని విస్తరించవచ్చు. Tecno Spark 8T స్మార్ట్‌ఫోన్‌ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు f/1.6 లెన్స్ మరియు AI లెన్స్‌తో పాటు క్వాడ్ LED ఫ్లాష్ ఉన్నాయి.

Tecno Spark Go 2022 ధర రూ.7,499

Tecno Spark Go 2022 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్ లో 2GB ర్యామ్ + 32GB స్టోరేజ్ వేరియంట్ రూ.7,499 ధర వద్ద టర్కోయిస్ సియాన్ మరియు అట్లాంటిక్ బ్లూ కలర్‌వేస్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది 6.52-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇక్కడ రిఫ్రెష్ రేట్ 60Hz మరియు 120Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉండి క్వాడ్-కోర్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. అయినప్పటికీ MediaTek Helio A22 SoC ద్వారా రన్ అవుతుంది. ఈ ఫోన్ 2GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఒకే కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్ ను విస్తరించవచ్చు. ఇది 2GB RAMతో వస్తుంది కాబట్టి సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే Spark Go 2022 Android 11 Go ఎడిషన్‌పై ‎HiOS 7.6 స్కిన్‌పై రన్ అవుతుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే Tecno Spark Go 2022 స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో 13MP ప్రైమరీ రియర్ కెమెరా మరియు సెకండరీ AI లెన్స్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది . సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8MP స్నాపర్ కలిగి ఉంటుంది.

లావా అగ్ని 5G ధర రూ.19,999

లావా అగ్ని 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్ లో 8GB RAM + 128GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్ రూ.19,999 ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11పై రన్ అవుతుంది. అలాగే ఇది 90Hz రిఫ్రెష్ రేట్ మరియు హోల్-పంచ్ డిజైన్‌తో 6.78-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 8GB RAMతో పాటు ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 810 SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f/1.79 సిక్స్-పీస్ లెన్స్‌తో పాటు 64-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. మిగిలిన కెమెరాలలో 5-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ షూటర్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాలు వరుసగా ఉన్నాయి. ఇవి AI మోడ్, సూపర్ నైట్ మరియు ప్రో మోడ్‌తో సహా ప్రీలోడెడ్ కెమెరా మోడ్‌లను కలిగి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం లావా అగ్ని 5G ఫోన్ ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

Xiaomi 11 Lite NE 5G రూ.26,999

Xiaomi 11 Lite NE 5G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఇప్పుడు రూ.26,999 ధర వద్ద మరియు 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు రూ.28,999 ధర వద్ద అమెజాన్ లో లభిస్తుంది. ఇది MIUI 12.5 తో ఆండ్రాయిడ్ 11 లో రన్ అవుతూ 6.55-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ (1,080x2,400 పిక్సెల్స్) 10-బిట్ ఫ్లాట్ AMOLED ట్రూ-కలర్ డిస్‌ప్లేను 90Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G SoC ద్వారా శక్తిని పొందుతూ 8GB RAM తో జత చేయబడి ఉంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్ మరియు 5 మెగాపిక్సెల్ టెలిమాక్రో షూటర్ లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, NFC, IR బ్లాస్టర్ మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది మరియు డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంది. Xiaomi 11 లైట్ 5G NE 4,250mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది, ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

English summary
Amazon Ecommerce Site Offers More Discounts on Buying Latest Launches Smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X