Home
Gadgets

మార్కెట్లోకి అమెజాన్ ‘Echo’ స్పీకర్లు

By Bommu Sivanjaneyulu

Amazon ఎట్టకేలకు తన Echo స్పీకర్ డివైస్‌లను భారత్‌లో లాంచ్ చేసింది. Amazon Echo, Echo Dot, Echo Plus మోడల్స్‌లో ఈ స్పీకర్లు అందుబాటులో ఉంటాయి. గూగుల్ వాయిస్ అసిస్టెంట్ మాదిరిగా అమెజాన్ సొంతంగా అభివృద్ధి చేసుకున్న 'అలెక్సా’ అనే వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌తో ఈ మూడు స్పీకర్లు పని చేస్తాయి.

Amazon finally brings Echo, Echo Plus, and Echo Dot to India

మార్కెట్లో వీటి ధరలను పరిశీలించినట్లయితే.. అమెజాన్ ఇకో ధర రూ.9,999, అమెజాన్ ఇకో డాట్ ధర రూ.4,499. అమెజాన్ ఇకో ప్లస్ ధర రూ.14,999. అమెజాన్ ఇండియాలో లిస్ట్ అయి ఉన్న ఈ స్పీకర్లను ఇన్విటేషన్ పద్ధతిలో కొనుగోలు చేయవల్సి ఉంటుంది. లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ క్రింద ఈ స్పీకర్ల కొనుగోలు పై 30% డిస్కౌంట్‌తో పాటు ఒక ఏడాది అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఉచితంగా అందిస్తున్నారు. ఈ స్పీకర్లకు సంబంధించి డెలివరీ ప్రాసెస్ అక్టోబర్ 30 నుంచి ప్రారంభమవుతుంది.

ఈ స్పీకర్లలో నిక్షిప్తం చేసిన Alexa వాయిస్ అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్, మనం ఇచ్చే వాయిస్ కమాండ్స్‌ను బట్టి స్పీకర్‌ను కంట్రోల్ చేస్తుంది. ఈ స్పీకర్స్‌తో ఆడియో బుక్స్‌ను వినొచ్చు. అందులో మనుకు అవసరమైన చాప్టర్ పేరును చెబితే చాలు, ఆ చాప్టర్‌ను స్పీకర్ మనకు చదివి వినిపిస్తుంది. ఈ స్పీకర్స్‌ మనం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పటంతో పాటు కావల్సిన మ్యూజిక్‌ను ప్లే చేయటం, న్యూస్‌ను చదవి వినిపించటం, క్రికెట్ స్కోర్ చెప్పటం, క్యాలెండర్ చెక్ చేసి పెట్టడం, అలారమ్ సెట్ చేయటం, ఇంట్లోని లైట్‌లను కంట్రోల్ చేయటం, ఇలా చాలా చాలా పనులను చక్కబెట్టేస్తాయి.

ఈ స్పీకర్ల ద్వారా అమెజాన్‌ షాపింగ్ కూడా నిర్వహించుకోవచ్చు. సోషల్ మీడియా అకౌంట్‌లతో కనెక్ట్ అయి మెసేజ్‌లను కూడా చదివి వినిపించగలవు. ఈ స్పీకర్స్ పనిచేయాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరి.

Alexa వాయిస్ అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్‌ను భారతీయులకు అనువుగా తీర్చిదిద్దే క్రమంలో, పలు థర్డ్ పార్టీ డెవలపర్స్ లోకలైజిడ్ స్కిల్స్‌ను బిల్డ్ చేయటం జరిగింది. దాదాపుగా 10,000 లోకల్ స్కిల్స్‌‌ను అలెక్సా టూల్‌లో పొందుపరిచినట్లు తెలుస్తోంది. Saavn, Times of India, ESPNcricinfo, Ola, Freshmenu తదితర యాప్‌లకు సంబంధించిన స్కిల్స్ అలెక్సాలో పొందుపరిచినట్లు తెలుస్తోంది.

Amazon Echo స్పీకర్ ప్రధాన హైలైట్స్..

Amazon Echo స్పీకర్ ప్రధాన హైలైట్స్..

సిలిండర్ షేపులో ఉండే ఈ స్పీకర్‌ మొతం మూడు కలర్ వేరియంట్‌లలో అందబాటులో ఉంటుంది. వాటి వివరాలు.. Charcoal, Heather Grey, Sandstone fabrics. ఈ స్పీకర్ కొనుగోలు పై ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఉచితంగా లభిస్తుంది. అలెక్సా డిజిటిల్ అసిస్టెంట్ ఆధారంగా స్పందించగలిగే ఈ స్పీకర్ వాతావరణ అప్‌డేట్స్‌ను చెప్పటంతో పాటు రిమైండర్స్ సెట్ చేయటం, క్రికెట్ స్కోర్‌ను చెప్పటం, షాపింగ్ లిస్ట్స్ సూచించటం వంటి పనులను చేస్తుంది.

అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్, Saavn వంటి మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసుల నుంచి మ్యూజిక్‌ను వినొచ్చు. ఇంట్లోని లైట్‌లను కూడా ఈ స్పీకర్ కంట్రోల్ చేస్తుంది. ఈ స్పీకర్‌లో మొత్తం 7 మైక్రోఫోన్‌లతో పాటు 2.5 ఇంచ్ ఊఫర్ అలానే 16mm ట్వీటర్ ఉంటుంది. స్పీకర్ బరువు 821 గ్రాములు. చుట్టుకొలత 148.5x88x88 మిల్లీ మీటర్లు, వై-ఫై ద్వారా ఈ స్పీకర్‌ను ఇంటర్నెట్‌తో కనెక్ట్ చేసుకోవల్సి ఉంటుంది.

Amazon Echo Dot స్పీకర్ ప్రధాన హైలైట్స్..

Amazon Echo Dot స్పీకర్ ప్రధాన హైలైట్స్..

ఈ స్పీకర్ బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలెక్సా వాయిస్ కమాండ్ టూల్ ద్వారా వర్క్ అయ్యే ఈ స్పీకర్‌ను బ్లూటూత్ లేదా 3.5ఎమ్ఎమ్ కేబుల్ ద్వారా ఇతర స్పీకర్లకు కనెక్ట్ చేసుకునే వీలుంటుంది.

వై-ఫై ద్వారా మ్యూజిక్‌ను స్ట్రీమ్ చేసుకోవచ్చు. 0.6 అంగుళాల ట్వీటర్‌తో వస్తోన్న ఈ స్పీకర్ బరువు 163 గ్రాములు. చుట్టుకొలత 32 x 84 x 84 మిల్లీ మీటర్లు, మైక్రోయూఎస్బీ పోర్టుతో పాటు 7 మైక్రోఫోన్‌లు ఈ స్పీకర్‌లో ఉంటాయి. స్పీకర్ యాక్టివ్‌గా ఉన్నంత సేపు డివైస్ పై అమర్చిన లైట్ రింగ్ వెలుగుతూనే ఉంటుంది.

Amazon Echo Plus ప్రధాన హైలైట్స్..

Amazon Echo Plus ప్రధాన హైలైట్స్..

సిలిండర్ షేపులో ఉండే ఈ స్పీకర్ మరింత స్మార్ట్ లుక్‌లో కనిపిస్తుంది. స్పీకర్‌లో నిక్షిప్తం చేసిన అలెక్సా వాయిస్ రికగ్నిషన్ మరింత క్వాలిటీతో వర్క్ అవుతుంది. సౌండ్ క్వాలిటీ అత్యుత్తమంగా ఉంటుంది. ఈ స్పీకర్ డ్యుయల్ స్పీకర్ (2.5ఇంచ్ ఊఫర్ + 0.8 ఇంచ్ ట్వీటర్) సపోర్ట్‌తో వస్తోంది. వై-ఫై ద్వారా మ్యూజిక్‌ను స్ట్రీమ్ చేసుకోవచ్చు. బరువు 954 గ్రాములు.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon Echo comes with a price tag of Rs. 9,999.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X