అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024.. ధర రూ.5000 లోపు బెస్ట్ ఇయర్‌బడ్స్..!
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024లో (Amazon Great Indian festival sale 2024) భాగంగా అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపును పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌వాచ్, హెడ్‌ఫోన్, ఇయర్‌బడ్స్‌పై డిస్కౌంట్‌లను పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా ఇయర్‌బడ్స్‌ను డిస్కౌంట్ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ జాబితాలో వన్‌ప్లస్, ఒప్పో, రియల్‌మి వంటి అనేక బ్రాండ్‌లు ఉన్నాయి. రూ.5000 కంటే తక్కువ ధర కలిగిన ఇయర్‌బడ్స్ ప్రస్తుతం అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఈ ఇయర్‌బడ్స్ (Best Deals on Earbuds on Amazon) యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), ఎక్కువ గంటలపాటు బ్యాటరీ లైఫ్, ఆకట్టుకొనే డిజైన్ సహా డిస్కౌంట్ ధరతో అమెజాన్‌లో ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ సేల్ ఆఫర్లతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో మరింత తగ్గింపు ధరకే ఈ ఇయర్‌బడ్స్‌ను కొనుగోలు చేయవచ్చు.

సోనీ WF-c500 ఇయర్‌బడ్స్ :
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 లో భాగంగా సోనీ WF-C500 ఇయర్‌బడ్స్‌ను రూ.4,448 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఇయర్‌బడ్స్ DSSE టెక్నాలజీతో పనిచేస్తాయి. ఫలితంగా నాణ్యమైన ఆడియో అనుభూతిని పొందవచ్చు. ఇయర్‌బడ్స్, ఛార్జింగ్ కేస్‌ను ఒక్కసారి పూర్తిగా చేయడం ద్వారా 20 గంటలపాటు వినియోగించుకోవచ్చు. క్విక్ ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది.
వన్‌ప్లస్ బడ్స్ 3 :
ఈ వన్‌ప్లస్ ఇయర్‌బడ్స్ AAC, SBC Codecs ను సపోర్టు చేస్తాయి. ఫలితంగా అధిక నాణ్యమైన సౌండ్ ను ఆస్వాదించవచ్చు. దీంతోపాటు వన్‌ప్లస్ బడ్స్ 3 ANC ఫీచర్‌తో అందుబాటులో ఉన్నాయి. మూడు స్థాయిల్లో బ్యాగ్రౌండ్ నాయిస్‌ను నియంత్రిస్తుంది. ANC ఫీచర్ యాక్టివ్‌లో ఉన్నప్పుడు 28 గంటల ప్లేబ్యాక్ టైంను పొందవచ్చు.
అదే ANC ఫీచర్ ఆఫ్ చేసినప్పుడు వన్‌ప్లస్ బడ్స్ 3.. బ్యాటరీ లైఫ్ 44 గంటలుగా ఉంటుంది. ఈ ఇయర్‌బడ్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తాయి. ఫలితంగా కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 7 గంటలపాటు వినియోగించుకోవచ్చు. అమెజాన్ సేల్ 2024 లో భాగంగా ఈ ఇయర్‌బడ్స్‌ను రూ.4,499 కే సొంతం చేసుకోవచ్చు.
ఒప్పో Enco ఎయిర్ 3 ప్రో :
ఈ ఇయర్‌బడ్స్ 12.4mm డైనమిక్ డ్రైవర్ యూనిట్ ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ బడ్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్‌తో అందుబాటులో ఉంది. ఫలితంగా కాలింగ్ సమయంలో అనవసర శబ్ధాలతో ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఈ ఇయర్‌బడ్స్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేయడం ద్వారా 30 గంటలపాటు వినియోగించుకోవచ్చు. అయితే పూర్తి ఛార్జింగ్ చేసేందుకు 120 నిమిషాల సమయం పడుతుంది. ఈ బడ్స్ ధర రూ.3,199 గా ఉంది.
JBL వేవ్ బీమ్ :
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 లో భాగంగా ఈ JBL వేవ్ బీమ్ ఇయర్‌బడ్స్‌ను రూ.2998 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఇయర్‌బడ్స్‌ను ఒక్కసారి పూర్తిగా చేయడం ద్వారా 8 గంటలపాటు ఛార్జింగ్ చేయవచ్చు. IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








