Just In
- 12 hrs ago
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- 1 day ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 1 day ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 1 day ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
Don't Miss
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Sports
ఓడినా వణికించాం.. మరో 10 పరుగులు చేసుంటే మేమే గెలిచేవాళ్లం: మిచెల్ సాంట్నర్
- Movies
Pathaan Day 5 Collections: షారుక్ సినిమా బీభత్సం.. ఒక్క రోజులో అన్ని కోట్లు, ఇప్పటికీ ఎంత వచ్చిందంటే?
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
అమెజాన్ మరో అద్భుత సృష్టి, ‘కిండిల్ ఒయాసిస్ 2017’
వరస పెట్టి కొత్త ఉత్పత్తులను మార్కెట్లో లాంచ్ చేస్తోన్న అమెజాన్, ఇటీవల Kindle Oasis పేరుతో కొత్త వర్షన్ ఈ-బుక్ రీడర్‌ను మార్కెట్‌కు పరిచయం చేసిన విషయం తెలిసిందే. 2017లో విడుదలైన ఈ డివైస్ ఖరీదు పరంగా కాస్తంత ఎక్కువే అనిపించినప్పటికి పనితీరు పరంగా మాత్రం పర్‌ఫెక్ట్ కాంభినేషన్‌గా నిలిచింది.

ఈ డివైస్‌లో పొందుపరచబడిన ఫీచర్లు ఇప్పటి వరకు లాంచ్ చేసిన ఏ కిండిల్‌బుక్ రీడర్‌లోనూ లేవని అమెజాన్ చెబుతోంది. కిండిల్ ఒయాసిస్ ఈ-బుక్ రీడర్ గురించి పలు ఆసక్తకిర విషయాలను ఇప్పుడు తెలసుకుందాం...

డిజైన్ విషయంలో మరింత లగ్జరీ లుక్..
ఇప్పటికే మార్కెట్లో లాంచ్ అయిన వివిధ కిండిల్ ఈ-బుక్ రీడర్స్‌తో పోలిస్తే అమెజాన్ కిండిల్ ఒయాసిస్ 2 మరింత ఫ్రష్ లుక్‌లోనూ ఇదే సమయంలో మరింత క్లాసిక్‌గానూ అనిపిస్తుంది. డిస్‌ప్లే క్రింది భాగంలో కనిపించే 3.4 మిల్లీమిటర్ల మందపాటి ఉబుకు మరింత గ్రిప్‌ను ఆఫర్ చేస్తుంది. ఆల్యూమినియమ్ బ్యాక్, స్టర్డీ ఇంకా ప్రీమియమ్ ఫీల్‌ను కలిగిస్తుంది. రీడర్ ముందు భాగాన్ని పరిశీలించినట్లయితే స్ర్కీన్‌ను ఓ వైపు, ఫిజికల్ పేజ్-టర్నింగ్ బటన్లను మరో వైపు ఫిట్ చేయటం జరిగింది.
డిస్‌ప్లే చుట్టూ కనిపించే బీజిల్స్, డివైస్‌ను హ్యాండిల్ చేస్తున్న సమయంలో చేతికి మరింత కంఫర్ట్‌గా అనిపిస్తాయి. ఇవి ఆఫర్ చేసే కంఫర్టబుల్‌నెస్ ఇంకా బ్యాలెన్సింగ్ కారణంగా డివైస్‌ను ఒక్క చేత్తో ఆపరేట్ చేసే వీలుంటుంది. డిస్‌ప్లేలో నిక్షిప్తం చేసిన అడాప్టివ్ ఫ్రంట్‌లైట్ ఫీచర్ వాతవరణాన్ని బట్టి డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌ను అడ్జస్ట్ చేసుకుంటుంది. డిమ్ లైట్ రూమ్ లేదా సన్‌లైట్‌లో ఉన్నప్పుడు, మీ వ్యక్తిగత ప్రాధాన్యతలను బట్టి డిస్‌ప్లేను ట్యూన్ చేసుకునే వీలుంటుంది.
మొత్తంగా చూసుకుంటే అమెజాన్ కిండిల్ ఒయాసిస్ 2 డిజైన్ పరంగా మరింత క్లీన్ గానూ ఇదే సమయంలో మరింత క్లాసికల్ గాను అనిపిస్తుంది. ఈ డివైస్‌లో హెడ్‌ఫోన్ జాక్, స్పీకర్ వంటి సదుపాయాలు లేవు. బ్లూటూత్ హెడ్‌ఫోన్ లేదా బ్లూటూత్ స్పీకర్ ద్వారా ఈ డివైస్ నుంచి ఆడియోను వినే వీలుంటుంది.

అదనంగా యాడ్ చేయబడిన ఫీచర్లు...
కిండిల్ ఒయాసిస్ (2017) ఈ-బుక్ రీడర్ IPX8 రేటింగ్‌తో వస్తోంది. ఈ బలమైన వాటర్ ప్రూఫ్ క్వాలిటీ, కిండిల్ ఒయాసిస్ 2ను నీటి ప్రమాదాల నుంచి కాపాడగలుగుతుంది. ఈ డివైస్ రెండు గంటల పాటు నీటిలో మునిగిన ఉన్నప్పటికి ఏ మాత్రం చెక్కుచెదరదు. వాటర్ ప్రూఫింగ్ ఫీచర్‌తో పాటు ఆడిబుల్ పేరుతో మరో ఫీచర్‌ను కూడా అమెజాన్ ఈ డివైస్‌లో యాడ్ చేసింది. ఈ ఆడిబుల్ ఫీచర్ ద్వారా అమెజాన్ ఆడియోబుక్ స్టోర్‌లోని పుస్తకాలను వినే వీలుంటుంది.
ఈ ఫీచర్‌ను వెబ్‌బ్రౌజర్ ద్వారా యాక్సిస్ చేసుకునే వీలుంటుంది. నెలవారీ చందా క్రింద ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ఇవే కాకుండా ఈ డివైస్‌లోని ఐడియల్ రీడింగ్ సెట్టింగ్స్‌ను కావల్సిన విధంగా కస్టమైజ్ చేసుకునే వీలుంటంది. ఫాంట్ సైజ్ దగ్గర నుంచి బోల్డ్‌నెస్ లెవల్స్, అలైన్‌మెంట్స్ వరకు యూజర్ తనుక కావల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకునే వీలుంటుంది. కావల్సిన నోట్స్‌ను ఈ-మెయిల్ రూపంలో ఎక్స్‌పోర్ట్ చేసుకుని ప్రింటబుల్ పీడీఎఫ్ ఫార్మాట్‌లో పొందే వీలుంటుంది.

హైక్వాలిటీ రీడింగ్ ఎక్స్‌పీరియన్స్...
కిండిల్ ఒయాసిస్ ఈ-బుక్ రీడర్ యూజర్లకు హైక్వాలిటీ రీడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేస్తుంది. పేజ్ ఫ్లిప్ ఫీచర్ ద్వారా ఫోటోస్, చార్ట్స్, మ్యాప్స్ ఇంకా నోట్స్‌ను సులువుగా వెతికే వీలుంటుంది. ఈ పేజ్ ఫ్లిప్ ఫీచర్ ఆటోమెటిక్‌గా మీరు చదువుతున్న పేజీనీ సేవ్ చేసి ఉంచుతుంది. దీంతో ప్రతిసారీ పేజీని పిన్ చేసుకోవల్సిన అవసరం ఉండదు. బుక్ చదువుతోన్న సమయంలో ఫాంట్స్‌తో పాటు పిక్సల్ లెవల్స్‌ను కావల్సిన విధంగా హ్యాండ్-ట్యూన్ చేసుకునే వీలుటుంది. ఇక బరువు విషయానికి వచ్చేసరికి పేపర్‌బ్యాక్ కంటే తక్కువ బరువును ఈ డివైస్ కలిగి ఉంటుంది. సింగిల్ హ్యాండ్‌తో డివైస్‌ను హ్యాండిల్ చేసే వీలుంటుంది.

సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్
సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి మునుపటి అమెజాన్ కిండిల్ బుక్ మోడల్స్‌తో పోలిస్తే కిండిల్ ఒయాసిస్‌లో పెద్దగా మార్పులేమి లేవు. ఈ డివైస్ కూడా అదే బేసిక్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో వస్తోంది. అయతే ఫైర్ టీవీ తరహాలో ఎటువంటి అడర్వటైజ్‌మెంట్స్ ఈ డివైస్‌లో కనిపించవు. కిండిల్ స్టోర్ నుంచి బుక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వీలుంటుంది.

బ్యాటరీ పనితీరు..
బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చేసరికరి కిండిల్ ఒయాసిస్ 2లో పొందుపరిచిన ఇన్‌బిల్ట్ బ్యాటరీ వ్యవస్థ ఫుల్ చార్జ్ పై 6 వారాల బ్యాకప్‌ను అందించగలుగుతుంది. బుక్స్ చదువుతున్నప్పుడు బ్యాటరీ లైఫ్ నిలకడగా ఉన్నప్పటికి, ఆడిబుల్ ఫీచర్‌ను వినియోగించుకుంటున్నప్పుడు మాత్రం బ్యాకప్ త్వరగా తగ్గిపోతోంది. యూఎస్బీ పోర్ట్ ద్వారా డివైస్‌ను ఛార్జ్ చేసకోవల్సి ఉంటుంది.

ఫైనల్ వర్డ్స్...
పెద్దదైన స్కీన్, ఐపీఎక్స్8 రేటింగ్, ఆడిబుల్ టెక్నాలజీ, లైట్ అడాప్టివ్ డిస్‌ప్లే, ఫాంట్ కస్టమైజేషన్ వంటి వంటి ఫీచర్లు కిండిల్ ఒయాసిస్ ఈ-బక్ రీడర్‌కు ప్రధానమైన హైలైట్స్‌గా నిలుస్తాయి. ఇక ధర విషయానికి వచ్చేసరికి 8జీబి మోడల్‌లో లభ్యమయ్యే కిండిల్ ఒయాసిస్ ఈ-బుక్ రీడర్ ధర రూ.21,999గాను, 32జీబి
మోడల్‌లో లభ్యమయ్యే కిండిల్ ఒయాసిస్ ఈ-బుక్ రీడర్ ధర రూ.28,999గాను ఉంది. వై-ఫై లేదా 3జీ కనెక్సటన్ ద్వారా వీటిని ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బెస్ట్ క్వాలిటీ ఉత్పత్తులను కోరుకునే స్మార్ట్ ఇండియన్ కన్స్యూమర్స్‌కు కిండిల్ ఒయాసిస్ ఈ-బక్ రీడర్ కాస్తంత ఖరీదైన విషయమేనని చెప్పాలి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470