12 వారాల బ్యాటరీ లైఫ్‌తో భారత్‌లో అమెజాన్ సరికొత్త Kindle Paperwhite వచ్చేసింది..!
Kindle Paperwhite 12th Gen : అమెజాన్ తన సరికొత్త 12వ జనరేషన్ (12th-generation) కిండిల్ పేపర్‌వైట్‌ను ఇండియాలో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ అప్‌గ్రేడ్ అయిన ఇ-రీడర్ ఎన్నో కొత్త హంగులతో వచ్చింది. ముఖ్యంగా, మునుపటి కంటే వేగంగా పనిచేయడం, పెద్ద స్క్రీన్, ఎక్కువ స్టోరేజ్, ఇంకా అబ్బురపరిచేలా ఏకంగా 12 వారాల బ్యాటరీ లైఫ్ దీని సొంతం.
గత అక్టోబర్‌లో అమెరికాలో కిండిల్ స్క్రైబ్ (Kindle Scribe), కిండిల్ కలర్‌సాఫ్ట్ సిగ్నేచర్ ఎడిషన్ (Kindle Coloursoft Signature Edition) తో పాటు పరిచయమైన ఈ కొత్త పేపర్‌వైట్, ఇప్పుడు భారతీయ పుస్తక ప్రియుల కోసం అందుబాటులోకి వచ్చింది. ఇండియన్ బుక్ లవర్స్‌కి ఇదొక పెద్ద శుభవార్త అని చెప్పవచ్చు.

* ధర ఎంత, ఎక్కడ కొనాలి..?
ఈ 12వ తరం కిండిల్ పేపర్‌వైట్ ధర రూ.16,999. ప్రస్తుతానికి ఇది క్లాసిక్ బ్లాక్ రంగులో మాత్రమే లభిస్తుంది. దీనికి సరిపోయేలా, స్టైల్‌గా ఉండే ప్రొటెక్టివ్ కవర్లను కూడా అమెజాన్ అందిస్తోంది. ఇవి బ్లాక్, మెరైన్ గ్రీన్, ట్యూలిప్ పింక్ రంగుల్లో లభిస్తాయి. ఒక్కో కవర్ ధర రూ.1,999.
* డిస్‌ప్లే, డిజైన్ అదుర్స్..
ఈ లేటెస్ట్ కిండిల్‌లో 7 అంగుళాల గ్లేర్-ఫ్రీ (glare-free) స్క్రీన్ ఉంది. అంటే వెలుతురులో కూడా స్క్రీన్ మెరవదు. పేపర్‌వైట్ సిరీస్‌లోనే ఇది అతి పెద్ద స్క్రీన్. 300 ppi పిక్సెల్ డెన్సిటీతో, అచ్చం పుస్తకంలోని అక్షరాల్లాగే ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి.
* కళ్లకు హాయి
ఇందులో కళ్లకు సౌకర్యంగా ఉండేలా బ్రైట్‌నెస్ మార్చుకునే వీలు, వెచ్చని కాంతి (Warm light) సెట్టింగ్, ఇంకా డార్క్ మోడ్ (స్క్రీన్ నల్లగా, అక్షరాలు తెల్లగా) ఉన్నాయి. ఏ వెలుతురులోనైనా చదవడం హాయిగా ఉంటుంది. స్క్రీన్ చుట్టూ ఉండే అంచులు (Bezels) ఇప్పుడు మరింత సన్నబడ్డాయి. దీనివల్ల డివైజ్ చూడటానికి మోడ్రన్‌గా ఉంటుంది.
* పనితీరు, మన్నిక
పెద్ద స్క్రీన్ ఉన్నా, ఈ కిండిల్ బరువు కేవలం 211 గ్రాములు, మందం 7.8 మిమీ మాత్రమే. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లడానికి వీలుగా ఉంటుంది. డ్యూయల్-కోర్ ప్రాసెసర్‌తో వస్తున్న ఈ కొత్త కిండిల్, పేజీలు తిప్పేటప్పుడు 25% వేగంగా పనిచేస్తుంది. టచ్‌స్క్రీన్ కూడా వేగంగా స్పందిస్తుంది.
* ఎక్కువ స్టోరేజ్
ఇందులో 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఇది పాత మోడల్ కంటే రెట్టింపు. అంటే మీరు వేల కొద్దీ పుస్తకాలను ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. దీనికి IPX8 రేటింగ్ ఉంది. అంటే, అనుకోకుండా నీళ్లలో పడిపోయినా తట్టుకుంటుంది. రెండు మీటర్ల లోతు నీటిలో 60 నిమిషాల వరకు ఇది పాడు కాకుండా ఉండగలదు.
* కనెక్టివిటీ, ఛార్జింగ్, సూపర్ బ్యాటరీ లైఫ్
ఈ కిండిల్ పేపర్‌వైట్ డ్యూయల్-బ్యాండ్ Wi-Fi కి సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల పుస్తకాలు వేగంగా డౌన్‌లోడ్ అవుతాయి, డేటా సింక్ అవుతుంది. 9W USB అడాప్టర్‌తో ఛార్జ్ చేస్తే, కేవలం 2.5 గంటల్లోపే ఫుల్ ఛార్జ్ అవుతుంది. దీనివల్ల సమయం అసలు వృథా కాదు.
* బ్యాటరీ కింగ్
ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే, ఏకంగా 12 వారాల వరకు (దాదాపు 3 నెలలు) వస్తుందని అమెజాన్ చెబుతోంది. దీనికి కారణం, తక్కువ పవర్ వాడే ఇ-ఇంక్ (e-ink) టెక్నాలజీ. ఇది కేవలం మీరు పేజీలు తిప్పినప్పుడు మాత్రమే శక్తిని ఉపయోగిస్తుంది. ఈ కొత్త కిండిల్ పేపర్‌వైట్, పుస్తకాలు చదవడానికి ఇష్టపడే వారికి ఒక అద్భుతమైన అప్‌గ్రేడ్ అని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications