రూ.15,000 లోపు ధరలో లభించే ఉత్తమమైన స్మార్ట్‌టీవీలు ఇవే...

|

ఇండియాలో రెండు రోజుల పాటు జరిగే అమెజాన్ ప్రైమ్ డే 2020 యొక్క అమ్మకాలు అంత్య దశకు వచ్చాయి. అమెజాన్ ఇండియా యొక్క ఈ సేల్ లో అన్ని రకాల ఉత్పత్తుల మీద కొన్ని అద్భుతమైన తగ్గింపులను మరియు ఆఫర్లను కూడా అందిస్తోంది. భారతదేశంలోని అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే అందుబాటులో గల ఈ సేల్ లో మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ టీవీల మీద అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మేడ్ ఇన్ ఇండియా బడ్జెట్ స్మార్ట్‌టీవీలు
 

మేడ్ ఇన్ ఇండియా బడ్జెట్ స్మార్ట్‌టీవీలు

రూ.20,000 లోపు ధర గల స్మార్ట్‌ఫోన్‌ల మీద అందిస్తున్న అద్భుతమైన ఆఫర్‌లను ఇప్పటికే అందించాము. ప్రైమ్ డే అమ్మకంలో రూ.15,000 లోపు ధరలో 32-అంగుళాల స్మార్ట్ టీవీలను "మేడ్ ఇన్ ఇండియా" ఫీచర్ తో కొనాలని చూస్తున్న వారికి దీని కంటే మంచి తరుణం లేదు. బడ్జెట్ ధరలో లభించే ఈ స్మార్ట్ టీవీల మీద స్నేహపూర్వక మరియు అదనపు ఆఫర్లు కూడా లభిస్తాయి. వీటితో పాటుగా ఎటువంటి అదనపు ఖర్చు లేని EMI పద్ధతిలో కూడా కొనుగోలు చేయవచ్చు.

Shinco  32-inch TV పూర్తి వివరాలు

Shinco  32-inch TV పూర్తి వివరాలు

షిన్కో సంస్థ యొక్క 32-అంగుళాల HD LED TV అద్భుతమైన వీక్షణ అనుభవం కోసం HRDP టెక్నాలజీతో 1366 x 768 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది 20W అవుట్ పుట్ సౌండ్ మరియు సరౌండ్ సౌండ్ సపోర్ట్ వంటి ఐదు రకాల సౌండ్ మోడ్లను అందిస్తుంది. షిన్కో స్మార్ట్ టీవీ క్వాడ్-కోర్ ప్రాసెసర్ మరియు ఆండ్రాయిడ్ 8.0 తో రన్ అవుతుంది. ఇది హాట్‌స్టార్, Zee5, సోనీ లైవ్ వంటి మరిన్ని OTT యాప్ లతో ప్రీలోడ్ చేయబడి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ యొక్క ధర రూ.13,990.

TCL  32-inch TV పూర్తి వివరాలు

TCL  32-inch TV పూర్తి వివరాలు

TCL సంస్థ యొక్క 32-అంగుళాల స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ టీవీ OSతో రన్ అవుతూ గూగుల్ ప్లే స్టోర్‌కు యాక్సిస్ ను ఇస్తుంది. ఇది 60Hz రిఫ్రెష్ రేటుతో 720p డిస్ప్లేని కలిగి ఉంది. TCL స్మార్ట్ టీవీ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో అంతర్నిర్మిత Chromecast, 2 HDMI పోర్ట్‌లు మరియు 2 USB పోర్ట్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ HDR10 మరియు మైక్రో డిమ్మింగ్‌ మోడ్ లకు కూడా మద్దతు ఇస్తుంది. TCL సంస్థ యొక్క ఈ స్మార్ట్ టివి ధర రూ.15,499.

Hisense 32-inch TV పూర్తి వివరాలు
 

Hisense 32-inch TV పూర్తి వివరాలు

హిస్సెన్స్ 32-అంగుళాల టీవీ ఆండ్రాయిడ్ 9 లో రన్ అవుతూ గూగుల్ ప్లే స్టోర్ వంటి యాప్ లకు యాక్సిస్ ను అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ గూగుల్ అసిస్టెంట్ మరియు అంతర్నిర్మిత Chromecast వంటి ఇతర ఫీచర్లతో వస్తుంది. దీని యొక్క బండిల్ రిమోట్ లో యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ మరియు గూగుల్ ప్లే కోసం ప్రత్యేకమైన కీలను కలిగి ఉంది. ఈ స్మార్ట్ టీవీ యొక్క ధర రూ .11,990.

Onida 32-inch TV పూర్తి వివరాలు

Onida 32-inch TV పూర్తి వివరాలు

ఒనిడా యొక్క 32-అంగుళాల HD టీవీ వాస్తవానికి ఫైర్ టీవీ ఎడిషన్ OS లో రన్ అవుతుంది. ఈ ఒనిడా స్మార్ట్ టీవీలో యూట్యూబ్, ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, Zee5, సోనీలైవ్ వంటి స్ట్రీమింగ్ యాప్ లకు యాక్సిస్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇది రిమోట్ కంట్రోల్‌తో వస్తుంది కావున ఇది అమెజాన్ ఫైర్ టివి స్టిక్‌తో సమానంగా ఉంటుంది. అలాగే ఇది అలెక్సా వాయిస్ నియంత్రణకు కూడా మద్దతును ఇస్తుంది. ఒనిడా HD ఫైర్ టీవీని రూ.12,000 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

Kodak 32-inch TV పూర్తి వివరాలు

Kodak 32-inch TV పూర్తి వివరాలు

కోడాక్ యొక్క 32-అంగుళాల టీవీ ఆండ్రాయిడ్ 9 తో రన్ అవుతుంది. ఇతర ఆండ్రాయిడ్ టీవీల మాదిరిగానే ఇది కూడా గూగుల్ ప్లే స్టోర్ మరియు అంతర్నిర్మిత క్రోమ్‌కాస్ట్‌ మద్దతుతో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ కార్టెక్స్ A53 క్వాడ్-కోర్ ప్రాసెసర్ ను కలిగి ఉండి 1GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జత చేయబడి వస్తుంది. దీని రిమోట్ కంట్రోల్ గూగుల్ అసిస్టెంట్ కోసం ప్రత్యేక బటన్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ టీవీ 24W సౌండ్ అవుట్‌పుట్ ను కలిగి ఉంది. మీరు ఈ కొడాక్ టీవీని అమెజాన్ ఇండియాలో రూ.10,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Amazon Prime Day Sale 2020: Buy Best Smart TVs Under Rs.15,000

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X