ఈ క‌ళ్ల‌జోడు వెరీ స్మార్ట్‌.. Ambrane Glares స్మార్ట్‌గ్లాసెస్ భార‌త్‌లో విడుద‌ల‌!

|

స్మార్ట్ వేర‌బుల్స్ ఉత్ప‌త్తుల త‌యారీలో భార‌త‌దేశ కంపెనీలు అద్భుతంగా ప‌ని చేస్తున్నాయి. తాజాగా మ‌రో భారతీయ టెక్ కంపెనీ అయిన Ambrane కంపెనీ నుంచి Glares అనే మొట్టమొదటి స్మార్ట్ గ్లాసెస్ లాంచ్ చేయ‌డం విశేషం. వీటిని ఓపెన్-ఇయర్ ఆడియో గ్లాసెస్ అని కూడా అంటారు. ఎందుకంటే.. ఇవి ఫ్రేమ్‌లో ఇన్‌బిల్ట్‌గా రూపొందించిన స్పీకర్లతో వస్తాయి.

 
ఈ క‌ళ్ల‌జోడు వెరీ స్మార్ట్‌.. Ambrane Glares స్మార్ట్‌గ్లాసెస్ భార‌త్‌

ఈ స్మార్ట్ గ్లాసెస్‌లో బ్లూటూత్ v5.1 అందిస్తున్నారు. అంతేకాకుండా, ఇవి మీ పరిసరాలకు అనుగుణంగా లెన్స్‌ను మార్చడానికి మిమ్మల్ని అనుమతించే టూ లెన్స్ ఆప్ష‌న్‌ను క‌లిగి ఉన్నాయి. మరియు వీటికి స్పీకర్ సిస్టమ్ కూడా ఉన్నాయి. కేవలం రెండు గంటల ఛార్జింగ్‌తో ఈ గ్లాసెస్ 7 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుంద‌ని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. ఈ గ్లాసెస్ స్క్వేర్ మ‌రియు రౌండ్ షేప్ క‌లిగి ఉన్నాయి. రెండింటిలోనూ వచ్చే అద్దాలు UV రక్షణను అందజేస్తాయని కంపెనీ తెలిపింది.

భారతదేశంలో Ambrane Glares గ్లాసెస్ ధర:
భారతదేశంలో ఆంబ్రేన్ గ్లేర్స్ ధర రూ.9,999 గా కంపెనీ నిర్ణ‌యించింది. కానీ, ఇది ప్రస్తుతం కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కేవ‌లం రూ.4,999 ధ‌ర‌కే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇవి రౌండ్, స్క్వేర్ ఆకారాలు, మ‌రియు బ్లాక్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉన్నాయని కంపెనీ పేర్కొంది.

Ambrane Glares స్పెసిఫికేషన్స్:
Ambrane Glares గ్లాసెస్ టెంపుల్‌పై (చెవుల పైన) మౌంట్ చేయబడిన టచ్ కంట్రోల్ స‌పోర్టుతో, ఇన్‌బిల్ట్ స్పీకర్‌లతో వస్తాయి. కంపెనీ ప్రకారం, అవి మైక్రోఫోన్‌తో అమర్చబడి ఉంటాయి. మరియు HD సరౌండ్ సౌండ్ సిస్ట‌మ్ ను కలిగి ఉంటాయి. టచ్ కంట్రోల్‌లను ఉపయోగించి వినియోగదారులు కాల్‌లను యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ కూడా చేయొచ్చు. మ్యూజిక్ ప్లేబ్యాక్‌ని కంట్రోల్ చేయ‌వ‌చ్చు. మరియు వాయిస్ అసిస్టెంట్‌ల ద్వారా కూడా గ్లాసెస్‌ను ఆప‌రేట్ చేయ‌వ‌చ్చు. ఆంబ్రేన్ గ్లేర్స్ బ్లూటూత్ v5.1 కనెక్టివిటీకి స‌పోర్టు క‌లిగి ఉంది. మరియు ఈ గ్లాసెస్ iOS మరియు Android పరికరాలకు అనుకూలంగా ఉంటాయి.

ఈ క‌ళ్ల‌జోడు వెరీ స్మార్ట్‌.. Ambrane Glares స్మార్ట్‌గ్లాసెస్ భార‌త్‌

ఇక షేప్ విష‌యానికొస్తే.. ఇప్ప‌టికే డిస్క‌స్ చేసిన‌ట్లుగా గ్లాసెస్ రౌండ్ మరియు స్క్వేర్ షేప్‌లో ఉంటాయి. కంప్యూట‌ర్ లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్‌ల‌ను వీక్షించ‌డం ఇవి బ్లూ లైట్‌ను నిరోధించే లెన్స్‌లను ఇవి కలిగి ఉంటాయి. ఇందులో రెండు-లెన్స్ ఎంపికలు ఉంటాయి. వాటి ఆధారంగా వినియోగదారులు వారి పరిసరాలకు అనుగుణంగా లెన్స్‌లను మార్చుకోవడానికి అనుమతిస్తుంది. Ambrane Glares UV400 సర్టిఫికేట్ పొందింది మరియు UV కిరణాలు మరియు రేడియేషన్ నుండి 99.99 శాతం రక్షణను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

Ambrane ప్రకారం, స్మార్ట్ గ్లాసెస్ వాటర్ రెసిస్టెన్స్ కోసం IPX4 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇక ఛార్జ్ విష‌యానికొస్తే.. ఇవి కేవలం రెండు గంటల ఛార్జింగ్‌తో 7 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ వెల్ల‌డించింది.

 
ఈ క‌ళ్ల‌జోడు వెరీ స్మార్ట్‌.. Ambrane Glares స్మార్ట్‌గ్లాసెస్ భార‌త్‌

మ‌రో భార‌తీయ వేర‌బుల్స్ ఉత్ప‌త్తుల త‌యారీ కంపెనీ బోట్ boAt కూడా బ‌డ్జెట్ ధ‌ర‌లో హై-ఎండ్ ఫీచ‌ర్లతో ఇటీవ‌ల స్మార్ట్‌వాచ్ విడుద‌ల చేసింది!

boAt Xtend Talk స్పెసిఫికేష‌న్లు:
boAt Xtend Talk వాచ్ రెక్టాంగ్యుల‌ర్ ఆకారంలో స్క్రీన్ కలిగి ఉంది. దీనికి మ్యాన్యువ‌ల్ ఆప‌రేష‌న్ కోసం కుడి వైపున ఒక హార్డ్ బటన్‌ను అందిస్తున్నారు. ఇది HD రిజల్యూషన్‌తో పనిచేసే 1.69-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో హార్ట్ రేట్ సెన్సార్, SpO2 మానిటర్ మరియు VO2 మ్యాక్స్ మానిటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది స్టెప్స్‌, కెలోరీలు స‌హా మ‌రిన్నింటిని ట్రాక్ చేయగలదు. ఈ డివైజ్ 60+ స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుంది మరియు ఆటో వర్కౌట్ డిటెక్షన్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది.

ఈ వాచ్‌ను ఒక‌సారి ఫుల్ ఛార్జ్ చేసిన త‌ర్వాత వినియోగదారులు సాధారణ వినియోగంతో 10 రోజుల బ్యాటరీ లైఫ్ పొందుతారు. మరియు బ్లూటూత్ కాలింగ్ ప్రారంభించబడితే 2 రోజుల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. Xtend Talk వాచ్‌కు IP68 రేటింగ్‌కు మద్దతు ఉంది. ఈ వాచ్‌కు 150కి పైగా వాచ్ ఫేస్‌లకు సపోర్ట్ ఉందని కంపెనీ పేర్కొంది. ఇక ఛార్జ్ విష‌యానికొస్తే.. 300mAh బ్యాటరీ అందిస్తున్నారు.

boAt Xtend Talk ధ‌ర‌లు:
boAt Xtend టాక్ ప్రారంభ ధరను రూ.2,999 గా కంపెనీ నిర్ణ‌యించింది. దీనిని అమెజాన్ ఇండియా మరియు ఇతర పోర్టల్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇది పిచ్ బ్లాక్, చెర్రీ బ్లోసమ్ మరియు టీమ్ గ్రీన్ సహా మూడు రంగులలో విక్రయించబడుతుంది.

Best Mobiles in India

English summary
Ambrane Glares With Inbuilt Speakers,Launched in India: Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X