రూ. 1999కే స్మార్ట్‌వాచ్, సంవత్సరం వారంటీతో..
దేశీయ కంప్యూటర్ ఉపకరణాల సంస్థ అంబ్రేన్ చవక ధరలో ఏఎస్ డబ్ల్యు-11పేరుతో ఓ స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది
దేశీయ కంప్యూటర్ ఉపకరణాల సంస్థ అంబ్రేన్ చవక ధరలో ఏఎస్ డబ్ల్యు-11పేరుతో ఓ స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది. దీని ధరను కేవలం రూ.1,999గా నిర్ణయించింది. ఈ స్మార్ట్ వాచ్ ఫిట్నెస్ ట్రాకర్ గా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.

తమ స్మార్ట్ వాచ్ ద్వారా వినియోగదారులు రోజువారీ ఫిట్నెస్ కార్యకలాపాలను ట్రాక్ చేయొచ్చనీ, అలాగే పెడోమీటర్ సహాయంతో నడకదూరాన్ని , స్లీప్ పాటర్నీ కూడా పరిశీలిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

చాలా ఖరీదైన వాచ్‌లను ఇది రీప్లేస్ చేస్తుందనీ, అలాగే ఫిట్నెస్ ట్రాకర్ పాత్రను కూడా పోషిస్తుందని అంబ్రేన్ ఇండియా డైరెక్టర్ గౌరవ్ దూరెజా తెలిపారు. బ్లాక్ కలర్‌లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌వాచ్ ఒక సంవత్సరం వారెంటీతో అన్ని ప్రముఖ రిటైల్, ఈ-టెయిల్ స్టోర్లలో లభిస్తుందని చెప్పారు.


Click it and Unblock the Notifications








