Home
Gadgets

సోలార్‌ ప్యానళ్లతో పవర్‌ బ్యాంక్.. తక్కువ బరువు, మడతపెట్టేందుకు వీలున్న డిజైన్ సహా ఎన్నో ప్రత్యేకతలు..!

ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ గ్యాడ్జెట్‌ ల తయారీ సంస్థ అంబ్రేన్‌ వినూత్నమైన పవర్‌ బ్యాంక్‌ ను విడుదల చేసింది. తొలిసారిగా సోలార్‌తో ఛార్జింగ్‌ అయ్యేలా పవర్‌ బ్యాంక్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంబ్రేన్‌ సోలార్ 10k పేరుతో భారత్‌లో లాంచ్‌ చేసింది. ఈ పవర్ బ్యాంక్‌ ఫోర్‌ ఫోల్డ్‌ సోలార్‌ ప్యానల్‌ డిజైన్‌ను కలిగి ఉంది. దీంతోపాటు తేలికపాటి డిజైన్‌ను కలిగి ఉంటుందని సంస్థ చెబుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేలా ప్రత్యేక ఏర్పాట్లు ఇందులో ఉన్నాయని సంస్థ చెబుతోంది. విమాన ప్రయాణాల్లోనూ ఈ పవర్‌ బ్యాంక్‌ను వినియోగించుకొనేందుకు వీలుందని సంస్థ చెబుతోంది. ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు ఈ సోలార్‌ పవర్‌ బ్యాంక్‌ అందుబాటులో ఉందని తెలిపింది.

అంబ్రేన్‌ సోలార్‌ 10k పవర్‌ బ్యాంక్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ అంబ్రేన్ పవర్‌ బ్యాంక్ మడతపెట్టేందుకు వీలున్న (Folding Solar Panels) సోలార్‌ ప్యానళ్లను కలిగి ఉంది. మరియు తక్కువ బరువుతో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లేందుకు అనువుగా ఉంటుంది. ఈ సోలార్‌ 10k పవర్‌ బ్యాంక్‌ మల్టీ లేయర్‌ ను కలిగి ఉంటుంది. ఫలితంగా ఓవర్‌హీట్‌, ఓవర్‌ ఛార్జింగ్‌ సహా ఇతర ప్రమాదాల నుంచి రక్షిస్తుంది.

Ambrane solar 10k power bank launched at rs2799

సూర్యరశ్మితో ఛార్జింగ్‌ :
ఈ అంబ్రేన్‌ సోలార్‌ 10k పవర్‌ బ్యాంక్‌ (Ambrane solar 10k power bank) 22.5w ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 10,000mAh సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఛార్జింగ్‌ కోసం ప్రత్యేక సోలార్‌ ప్యానళ్లను కలిగి ఉంది. ఈ ప్యానళ్ల ద్వారా గరిష్ఠంగా 8.5W సోలార్‌ ఇన్‌పుట్‌ను అందించవచ్చు. సూర్యరశ్మి ఆధారంగా ఛార్జింగ్‌ కోసం గరిష్ఠంగా 5 రోజుల సమయం పడుతుందని సంస్థ చెబుతోంది.

ఈ అంబ్రేన్‌ సోలార్‌ పవర్‌ బ్యాంక్‌ బూస్టెడ్‌స్పీడ్‌ టెక్నాలజీను సపోర్టు చేస్తుంది. ఈ పవర్‌ బ్యాంక్‌తో స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్‌లు సహా USB-C, USB-A ఛార్జింగ్‌ పోర్టును సపోర్టు చేసే పరికరాలను ఛార్జింగ్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంది. 20W PD ఛార్జర్‌తో 3.5 గంటలపాటు వినియోగించుకొనే పవర్‌ బ్యాంక్‌ను కేవలం గంటలోనే ఛార్జింగ్ చేయవచ్చు.

Ambrane solar 10k power bank launched at rs2799

ఈ తరహా సోలార్‌ పవర్‌ బ్యాంక్‌లు ముఖ్యంగా పర్వతారోహకులు సహా ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ సోలార్‌ పవర్‌ బ్యాంక్‌ను అత్యవసర పరిస్థితుల్లోనూ ఉపయోగించుకొనలా రూపొందించారు. ఇందుకోసం డిజిటల్‌ LED డిస్‌ప్లే, టార్చ్ ఫంక్షన్‌, SOS సిగ్నలింగ్‌ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. విమాన ప్రయాణాల్లోనూ ఈ పవర్‌ బ్యాంక్‌ను వినియోగించేందుకు అనుమతి ఉందని అంబ్రేన్‌ సంస్థ చెబుతోంది.

ధర, సేల్ వివరాలు :
ప్రస్తుతం ఈ అంబ్రేన్ సోలార్‌ 10k పవర్‌ బ్యాంక్‌ ధర రూ.2799 గా ఉంది. అంబ్రేన్‌ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ సహా ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ పవర్‌ బ్యాంక్‌పై 6 నెలలపాటు వారంటీ ఇస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. పర్యాటకులు సహా ఎక్కువగా దూరప్రాంత ప్రయాణాలు చేసే వారికి ఈ సోలార్ పవర్‌ బ్యాంక్‌ అనువుగా ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Ambrane solar 10k power bank launched in india with folding solar panels price sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X