తక్కువ ధరలో లభించే Android TV Sticks కోసం చూస్తున్నారా!!! అయితే ఇది మీకోసమే
ప్రస్తుతం ఇండియాలో ఆండ్రాయిడ్ టీవీలు అందుబాటు ధరలో కూడా లభిస్తుండడంతో బాగా ప్రాచుర్యం పొందాయి. ఒక వేల ప్రజలు ఆండ్రాయిడ్ టీవీలను కలిగి ఉండకపోతే కనుక వారికి ఆండ్రాయిడ్ అనుభవాన్ని పొందటానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇందులో ఒకటి ఆండ్రాయిడ్ సెట్-టాప్ బాక్స్‌ను అమర్చుకోవడం మరియు మరొకటి మీ యొక్క పోర్ట్రబుల్ టీవీకి కనెక్ట్ చేయగల ఆండ్రాయిడ్ టీవీ స్టిక్ ను అమర్చుకోవడం.

ఆండ్రాయిడ్ టీవీ స్టిక్స్ పూర్తి వివరాలు
ఆండ్రాయిడ్ టీవీ స్టిక్ యొక్క గొప్ప విషయం ఏమిటంటే మీరు ఎక్కడికి వెళ్లినా కూడా దాన్ని మీతోపాటుగా తీసుకెళ్లవచ్చు. ఇది పెన్ డ్రైవ్ ఆకారంలో అతి చిన్నదిగా చాలా తక్కువ బరువులో తేలికైనదిగా ఉంటుంది. అయితే మీరు వెళ్ళిన ప్రతిచోటికి మీ యొక్క సెట్-టాప్ బాక్స్‌ను మాత్రం తీసుకెళ్లలేరు. ఇండియా యొక్క మార్కెట్లో మీరు కొనుగోలు చేయడానికి కొన్ని ఉత్తమమైన ఆండ్రాయిడ్ టీవీ స్టిక్స్ చాలానే ఉన్నాయి కానీ మీ యొక్క బడ్జెట్ ధరలో లభించే ఉత్తమైన ఆండ్రాయిడ్ స్టిక్ గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

షియోమి Mi టివి స్టిక్ పూర్తి వివరాలు
చైనా యొక్క స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి Mi ఆండ్రాయిడ్ టివి స్టిక్ ను అందిస్తుంది. ఇది సరికొత్త ఆండ్రాయిడ్ టీవీ 9తో రన్ అవుతుంది. Mi టీవీ స్టిక్‌లో అంతర్నిర్మిత క్రోమ్‌కాస్ట్ ఫీచర్ కలిగి ఉండడం వలన మీరు వాయిస్ సెర్చ్ వంటి ఫీచర్లను కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే దీని సహాయంతో మీ యొక్క స్మార్ట్‌ఫోన్‌ను టీవీలోకి కూడా ప్రసారం చేయవచ్చు. దీనిని కనెక్ట్ చేయడం చాలా సులభం ఒక వ్యక్తి దీనిని కేవలం 30 సెకన్లలోనే కనెక్ట్ చేయగలడని షియోమి సంస్థ పేర్కొంది. మీరు మీ కంటెంట్‌ను ఫుల్ HD రెసొల్యూషన్ వద్ద 1080p వరకు ప్రసారం చేయవచ్చు. ఈ Android TV స్టిక్ సహాయంతో మీరు అన్ని రకాల OTT యాప్ లను యాక్సెస్ చేయవచ్చు. మెరుగైన సౌండ్ అనుభవం కోసం డాల్బీ ఆడియో మరియు డిటిఎస్ డిజిటల్ మద్దతుతో కూడా వస్తుంది. ఈ ఆండ్రాయిడ్ టీవీ స్టిక్ 64-బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మీకు Android TV స్టిక్ తో పాటుగా ఒక USB కేబుల్, పవర్ అడాప్టర్ మరియు రిమోట్ కూడా అదనంగా లభిస్తాయి. దీనిని అమెజాన్ లేదా Mi యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా కేవలం రూ.2,799 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ యొక్క MarQ పూర్తి వివరాలు
ఆండ్రాయిడ్ టీవీ స్టిక్ ను కొనుగోలు చేయాలనుకునే వారు ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న మార్క్యూ టీవీ స్టిక్ కూడా ఒక ఆసక్తికరమైన ఎంపికగా ఉంటుంది. మీరు దీన్ని ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ.3,499 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. దీని యొక్క సాయంతో మీరు ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ యొక్క 10,000లకు పైగా యాప్ లను యాక్సెస్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ టీవీ 9తో ఈ టీవీ స్టిక్ రన్ అవుతుంది. ఇందులో అంతర్నిర్మిత గూగుల్ అసిస్టెంట్‌ను ఉపయోగించి మీకు ఇష్టమైన షోలను నావిగేట్ చెయ్యడానికి మీ వాయిస్‌ని ఉపయోగించవచ్చు. అంతర్నిర్మిత Chromecast సాయంతో మీ స్మార్ట్‌ఫోన్‌ను టీవీలో ప్రసారం చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. 7 రోజుల రిప్లేస్ మెంట్ విధానంతో పాటు ఉత్పత్తిపై 1 సంవత్సరం వారంటీ కూడా ఉంది. ఈ ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ లో రిమోట్, యుఎస్‌బి ఛార్జింగ్ కేబుల్, ఐఆర్ బ్లాస్టర్ కేబుల్, 2 బ్యాటరీలు మరియు పవర్ అడాప్టర్ కలిపి ఇందులో లభిస్తుంది.

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ టీవీ స్టిక్ పూర్తి వివరాలు
ఇండియా మార్కెట్లో ప్రస్తుతం అత్యంత ప్రాచుర్యం పొందిన ఆండ్రాయిడ్ టీవీ స్టిక్లలో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ టీవీ స్టిక్ ఒకటి. పైన పేర్కొన్న రెండింటితో పోలిస్తే ఇది అత్యంత ఖరీదైనది. దీనిని వినియోగదారులు రూ.3,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ స్టిక్ తో పాటు బాక్స్ లో లభించే రిమోట్ సాయంతో వాయిస్ ఆదేశాలను అనుమతిస్తుంది. మీరు HD నాణ్యతలో మీకు ఇష్టమైన షోలను చూడగలరు లేదా ప్రసారం చేయగలరు. అంతర్నిర్మిత Chromecast సాయంతో మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను టీవీలో ప్రసారం చేయవచ్చు. ఇది సరికొత్త ఆండ్రాయిడ్ టీవీ 9 లో రన్ అవుతుంది. మీరు దీన్ని ఫ్లిప్‌కార్ట్ నుండి లేదా ఎయిర్‌టెల్ యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








