Home
Gadgets

ఆపిల్‌ ఎయిర్‌పాడ్స్ ప్రో 3 విడుదల.. లైవ్‌ ట్రాన్స్‌లేషన్, ANC, హెల్త్ ట్రాకర్లు..!

ఆపిల్ Awe Dropping ఈవెంట్‌ లో ఐఫోన్ 17 సిరీస్‌, వాచ్‌ 11 సిరీస్‌ తోపాటు ఎయిర్‌పాడ్స్‌ ప్రో 3 విడుదల అయ్యాయి. ఆపిల్ పార్క్‌ లోని స్టీవ్‌ జాబ్స్‌ థియేటర్‌ లో నిర్వహించిన కార్యక్రమంలో లాంచ్ చేశారు. ఈ బడ్స్‌ అనేక ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ ఎయిర్‌పాడ్స్‌ ANC, లైవ్‌ ట్రాన్స్‌లేషన్ సపోర్టును కలిగి ఉంది. హెల్త్‌ సెన్సార్‌లు కూడా ఉన్నాయి. ఆపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ ప్రో 3 (Apple Airpods Pro 3 Launched) ఫీచర్లు, ధర వివరాలు.

ఎయిర్‌పాడ్స్‌ ప్రో 3 వివరాలు :
ఈ బడ్స్‌ Ultra Low Noise మైక్రోఫోన్స్‌ ను కలిగి ఉన్నాయి. ఈ బడ్స్‌ మల్టీ పోర్ట్‌ డిజైన్‌ ను కలిగి ఉంది. ఈ డిజైన్ ఎయిర్‌ ఫ్లో ను కంట్రోల్ చేసి, స్పేషియల్‌ సౌండ్‌ అనుభూతిని మెరుగుపరుస్తుందని చెబుతోంది. మరియు అడాప్టివ్‌ EQ మోడ్‌ ను కలిగి ఉంది.

Apple airpods Pro 3

లైవ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఫీచర్‌ :
ఈ ఇయర్‌బడ్స్ లైవ్‌ ట్రాన్స్‌లేషన్‌ (Live Translation) వంటి ఆపిల్ ఇంటెలిజెన్స్ సపోర్టును కలిగి ఉంటుంది. లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ ప్రస్తుతం ఇంగ్లీష్, ఫ్రెంచ్‌, జర్మన్‌, పోర్చుగీస్, స్పానీష్‌ వంటి భాషలను మాత్రమే సపోర్టు చేస్తుంది. అయితే ఈ సంవత్సరం చివరి నాటికి చైనీస్‌, కొరియన్‌, జపనీస్‌, ఇటాలియన్‌ భాషలను కూడా సపోర్టు చేస్తుంది.

హార్ట్‌ రేట్‌ ట్రాకింగ్ తో హెల్త్‌ సెన్సర్లు :
ఎయిర్‌పాడ్స్ ప్రో 3 ఇయర్‌ఫోన్స్‌ అనేక హెల్త్‌ సెన్సర్‌ లను కలిగి ఉంది. ఇందులో హార్ట్‌ రేట్‌ ట్రాకింగ్ సహా అనేక ట్రాకర్లు ఉన్నాయి. దీంతోపాటు PPG సెన్సార్‌ ను కూడా కలిగి ఉంది. దీంతోపాటు 50 వర్కౌట్‌ ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు మరిన్ని అనేక ఫీచర్లున్నాయి.

Apple airpods Pro 3

ఎయిర్‌పాడ్స్‌ బ్యాటరీ లైఫ్‌ :
గత మోడల్స్‌ తో పోలిస్తే బ్యాటరీ లైఫ్‌ పరంగానూ మెరుగుపరిచారు. ఈ ఎయిర్‌పాడ్స్‌ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 8 గంటలపాటు (ANC On) వినియోగించుకోవచ్చు. అదే ట్రాన్స్‌పరెన్సీ మోడ్‌ లో 10 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ ను పొందవచ్చు. ఛార్జింగ్‌ స్థితిని తెలుసుకొనేందుకు లైట్‌ ను కూడా అమర్చి ఉంటుంది.

ANC, IP57 రేటింగ్‌ :
ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో 3 బడ్స్‌ యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ (ANC) సపోర్టుతో వచ్చాయి. ఈ బడ్స్‌ మెరుగైన భద్రతను కలిగి ఉన్నాయని ఆపిల్‌ తెలిపింది. ఈ ఎయిర్‌పాడ్స్‌ IP57 రేటింగ్‌ తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉన్నాయి.

ఆపిల్‌ ఎయిర్‌పాడ్స్ ప్రో 3 ధర, సేల్ వివరాలు :
ఎయిర్‌పాడ్స్ ప్రో 3 ( Apple Airpods Pro 3 Price and Sale ) ధర $249 (భారత కరెన్సీ ప్రకారం రూ.21,968) గా ఉంది. ఇవాళ్టి నుంచి ముందస్తు ఆర్డర్‌ చేసుకొనేందుకు ఆపిల్‌ అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 19 నుంచి అందుబాటులో ఉంటుంది.

Best Mobiles in India

English summary
Apple airpods Pro 3 launched with ANC, Live Translation support in india full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X