యాపిల్ ఎయిర్‌పోడ్స్‌లో సమస్యలా..? పరిష్కరించుకోండిలా..

Posted By: BOMMU SIVANJANEYULU

యాపిల్ సంస్థ నుంచి ఇప్పటి వరకు మార్కెట్లో లాంచ్ అయిన విప్లవాత్మక ప్రోడక్ట్స్‌లో యాపిల్ ఎయిర్‌పోడ్స్ ఒకటి. భారీ అంచనాల మధ్య మార్కెట్లో లాంచ్ అయిన ఈ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్, వినియోగం విషయంలో యూజర్లను అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. యాపిల్ ఎయిర్‌పోడ్స్‌ను వినియోగించుకుంటోన్న సమయంలో కాల్స్ డ్రాప్ అవ్వటం, పెయిరింగ్ ఎర్రర్స్ వంటి ఇష్యూస్ ఎక్కువుగా ఉన్నట్లు తెలుస్తుంది. మీరు కూడా ఇటువంటి సమస్యలనే ఫేస్ చేస్తున్నట్లయితే ఈ సింపుల్ ట్రిక్స్‌ను ఫాలో అవ్వటం ద్వారా ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేసుకోవచ్చు.

యాపిల్ ఎయిర్‌పోడ్స్‌లో సమస్యలా..? పరిష్కరించుకోండిలా..

ఫైండ్ మై ఎయిర్‌పోడ్స్...
ఎయిర్‌పోడ్ యూజర్లను వేధిస్తోన్న కామన్ సమస్యల్లో ఫైండ్ మై ఎయిర్‌పోడ్స్ సమస్య ఒకటి. వాస్తవానికి ఇదిపెద్ద సమస్యేమి కాదు. ఎయిర్ పోడ్స్ సైజ్ అలానే వాటి వైర్‌లెస్ స్వభావాన్ని బట్టి వాటిలో ఒకటి మిస్ అవ్వచ్చు. కాబట్టి మిస్ అయిన బడ్స్‌ను ఐఫోన్‌లోని ఫైండ్ మై ఐఫోన్ ఫీచర్ ద్వారా ట్రాక్ చేసుకునే వీలుంటుంది. ఈ ఫీచర్‌ను వినియోగించుకోవాలంటే ముందుగా మీ ఐఓఎస్ డివైస్‌లో ఫైండ్ మై ఫోన్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది. యాప్ ఓపెన్ అయిన తరువాత ఎయిర్‌పోడ్స్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని మ్యాప్ ద్వారా వాటిని లొకేట్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ జరిగే సమయంలో ఎయిర్‌పోడ్స్ తప్పనిసరిగా పనిచేసే స్థితిలో ఉండాలి.

స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా వాడితే భయంకర ఫలితాలు, తేల్చి చెప్పిన స్డడీ

పెయిరింగ్ సమస్యలా..?
ఎయిర్‌పోడ్ యూజర్లను వేధిస్తోన్న కామన్ సమస్యల్లో పెయిరింగ్ ఎర్రర్ ఒకటి. ఇటువంటి సమస్యను మీరు కూడా ఫేస్ చేస్తున్నట్లయితే వాటిని ఛార్జింగ్ కేస్‌లో ప్లేస్ చేసి 10 సెకన్ల పాటు వెయిట్ చేయండి. తరువాత వాటిని బయటకు తీసి చెవుల్లో పెట్టుకోండి. ఇప్పుడవి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇలా చేసినప్పటికి హెడ్‌ఫోన్స్ పెయిర్ కాని పక్షంలో ఫోన్‌లోని బ్లుటూత్‌ను ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేయండి. ఇప్పటికి కూడా అవి పెయిర్ కాకపోయినట్లయితే ఎయిర్ పోడ్స్‌ను రీసెట్ చేసి చూడండి.

ఆడియో అవుట్‌పుట్ సమస్యలా..?
యాపిల్ ఎయిర్‌పోడ్స్‌ను ఆండ్రాయిడ్ డివైస్‌కు కనెక్ట్ చేసినపుడు వాల్యుమ్ తక్కువుగా వినిపిస్తోందా..? వాస్తవానికి యాపిల్ ఎయిర్‌పోడ్స్‌లో పొందుపరిచిన అనేక ఫీచర్లు W1 చిప్‌ను వినియోగించుకోవటం వల్ల ఐఫోన్ ఇంకా ఐప్యాడ్ డివైసుల్లో ఇవి బాగా వర్క్ అవుతాయి. ఆండ్రాయిడ్ డివైస్‌ల్లో W1 చిప్‌ లోపించటం వల్ల వాల్యుమ్ అనేది చాలా తక్కువుగా వస్తుంది. స్టాక్ ఆండ్రాయిడ్ యూజర్లు యాపిల్ ఎయిర్‌పోడ్స్‌కు కనెక్ట్ అయినపుడు వాల్యుమ్ రాకర్స్‌ను కంట్రోల్ చేసుకోవటం ద్వారా వాల్యుమ్‌ను పెంచుకోవచ్చు.

కాల్స్ డ్రాప్ అవుతున్నాయా..?
యాపిల్ ఎయిర్ పోడ్స్‌ను వినియోగించుకుంటోన్న సమయంలో తరచూ కాల్స్ డ్రాప్ అవుతున్నాయా..? అయితే కాల్ రిసీవ్ చేసుకునేటపుడు ఒక బడ్‌ను మాత్రమే చెవిలో ఉంచుకోండి. ఇలా చేయటం వల్ల కాల్ డ్రాప్స్ అనేవి అదుపులోకి వచ్చినప్పటికి బ్యాటరీ డ్రెయినేజీ వేగంగా జరిగిపోతుంది. పూర్తిగా చార్జ్ కాబడిన ఎయిర్‌పోడ్స్‌ను 5 గంటల పాటు నిర్విరామంగా వినియోగించుకోవచ్చని యాపిల్ చెబుతోంది. అయితే ఇంతకన్నా తక్కువు టాక్ టైమ్‌ను మీరు పొందుతున్నట్లయితే ఆటోమెటిక్ ఎయిర్ డిటెక్షన్‌ను ఆన్ చేసుకున్నట్లయితే ఎయిర్‌పోడ్స్‌ను పక్కనపెట్టిన ప్రతిసారి అవి స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోతాయి. దీంతో బ్యాటరీ బ్యాకప్ అనేది పెరిగే అవకాశముంటుంది.

English summary
Apple AirPods would be the first thing that comes to mind when we talk about truly wireless headphones, but even they aren't perfect. AirPods users often come across common problems such as call drops, pairing errors, audio woes, and others.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot