Home
Gadgets

ఆపిల్‌ కొత్త ఐప్యాడ్‌ ఎయిర్‌ 2026 విడుదల.. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వివరాలు..!

Apple iPad Air 2026 : ఆపిల్‌ నుంచి ఐఫోన్ 17e తోపాటు ఐప్యాడ్‌ ఎయిర్‌ 2026 మోడల్‌లు విడుదల అయ్యాయి. ఈ ఐప్యాడ్ రెండు డిస్‌ప్లే వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. M4 చిప్‌సెట్‌, iPadOS 26 పైన పనిచేస్తుంది. నాలుగు కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. వైఫై, వైఫై + సెల్యూలర్ మోడల్‌లో అందుబాటులోకి వచ్చింది.

ఐప్యాడ్‌ ఎయిర్‌ 2026 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ ఐప్యాడ్‌ ఎయిర్‌ 11 అంగుళాలు, 13 అంగుళాల లిక్విడ్‌ రెటీనా IPS డిస్‌ప్లేతో లాంచ్‌ అయింది. 600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. యాంటీ రిఫ్లక్టివ్‌ కోటింగ్‌, ఫింగర్‌ ప్రింట్ రెసిస్టెంట్‌ ఒలియోఫోబిక్‌ కోటింగ్‌ ను కలిగి ఉంది.

Apple iPad Air 2026 with M4 Chip  sale

M4 చిప్‌, iPadOS 26 :
ఈ ఐప్యాడ్‌ ఎయిర్ మోడల్ M4 చిప్‌ను కలిగి ఉంది. 12GB ర్యామ్, 1TB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. iPadOS 26 పైన పనిచేస్తుంది. ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఐప్యాడ్‌ ఎయిర్‌ ఆపిల్ పెన్సిల్‌ ప్రో, ఆపిల్ పెన్సిల్‌ USB-C లను సపోర్టు చేస్తుంది.

కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌, 5x డిజిటల్‌ జూమ్ సామర్థ్యాలతో 12MP కెమెరాను కలిగి ఉంది. ఆటోఫోకస్‌ ఫీచర్‌ కూడా ఉంది. 60fps వద్ద 4K వీడియోలను రికార్డు చేయవచేచు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12MP (Center Stage) కెమెరాను అమర్చారు.

Apple iPad Air 2026 with M4 Chip  sale

ఈ ఐప్యాడ్‌ 36.59Wh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేసి వైఫై కనెక్టివిటీలో 10 గంటలపాటు బ్రౌజింగ్‌ లేదా 10 గంటల వీడియో ప్లేబ్యాక్‌ టైంను పొందవచ్చని ఆపిల్‌ చెబుతోంది. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్‌ 6, వైఫై 7, N1 నెట్‌వర్క్ కనెక్టివిటీ చిప్ ఉన్నాయి. భద్రత కోసం టచ్‌ ఐడీని కలిగి ఉంది. దీంతోపాటు యాంబియంట్‌ లైట్‌, బారోమీటర్‌, యాక్సెలిరోమీటర్‌, గైరోస్కోప్‌ ఉన్నాయి.

ఐప్యాడ్‌ ఎయిర్‌ M4 (2026) ధర, సేల్‌ వివరాలు :
11 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్‌ -
- 128GB స్టోరేజీ (Wi-Fi) ధర రూ.64900 / 128GB స్టోరేజీ (Wi-Fi + సెల్యూలర్‌) ధర రూ.79,900
- 256GB స్టోరేజీ (Wi-Fi) ధర రూ.74900 / 256GB స్టోరేజీ (Wi-Fi + సెల్యూలర్‌) ధర రూ.89,900
- 512GB స్టోరేజీ (Wi-Fi) ధర రూ.94900 / 512GB స్టోరేజీ (Wi-Fi + సెల్యూలర్‌) ధర రూ.1,09,900
- 1TB స్టోరేజీ (WiFi) ధర రూ.114900 / 1TB స్టోరేజీ (Wi-Fi + సెల్యూలర్‌) ధర రూ.1,29.900

ఐప్యాడ్‌ ఎయిర్‌ 13 అంగుళాల వేరియంట్‌
- 128GB స్టోరేజీ (Wi-Fi) ధర రూ.84900 / 128GB స్టోరేజీ (Wi-Fi + సెల్యూలర్‌) ధర రూ.94900
- 256GB స్టోరేజీ (Wi-Fi) ధర రూ.94900 / 256GB స్టోరేజీ (Wi-Fi + సెల్యూలర్‌) ధర రూ.104,900
- 512GB స్టోరేజీ (Wi-Fi) ధర రూ.114900 / 512GB స్టోరేజీ (Wi-Fi + సెల్యూలర్‌) ధర రూ.124900
- 1TB స్టోరేజీ (Wi-Fi) ధర రూ.134900 / 1TB స్టోరేజీ (Wi-Fi + సెల్యూలర్‌) ధర రూ.1,44900

ఐప్యాడ్‌ ఎయిర్‌ M4 (2026) ను ప్రస్తుతం ఆపిల్‌ ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఐప్యాడ్‌ స్టార్‌లైట్‌, స్పేస్‌ గ్రే, పర్పుల్‌, బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple iPad Air 2026 with M4 Chip launched in india features, price sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X