9 సంవత్సరాల్లో తొమ్మిదింటిని చంపేసింది
3295 రోజులు లేక 9 సంవత్సరాలకు ముందు ఆపిల్ అధినేత దివంగత స్టీవ్ జాబ్స్ మ్యాజిక్ రివల్యూషనరీ ఉత్పత్తి అయిన ఆపిల్ ఐప్యాడ్ ని ప్రపంచానికి పరిచయం చేసి దిగ్గజాలకు షాక్ ఇచ్చిన సంగతి విదితమే.
3295 రోజులు లేక 9 సంవత్సరాలకు ముందు ఆపిల్ అధినేత దివంగత స్టీవ్ జాబ్స్ మ్యాజిక్ రివల్యూషనరీ ఉత్పత్తి అయిన ఆపిల్ ఐప్యాడ్ ని ప్రపంచానికి పరిచయం చేసి దిగ్గజాలకు షాక్ ఇచ్చిన సంగతి విదితమే. ఈ 9 సంవత్సరాల కాలంలో ఆపిల్ ఐప్యాడ్ మొత్తం ట్యాబ్లెట్ మార్కెట్ నే తిరగరాసింది. దిగ్గజాల చేత అనేక ప్రశంసలను అందుకుంది. అమ్మకాల్లో ఓ కొత్త సునామిని తలపించింది. అదే స్థాయిలో దిగ్గజాల ఉత్పత్తులను ఒక్కసారిగా ఖంగుతినిపించింది. మొత్తం 9 రకాల ఉత్పత్తులను చంపేసింది. మరి ఆ తొమ్మిది ఉత్పత్తులు ఏంటో ఓ సారి చూద్దాం.

Motorola Xoom
ఇది ఒకప్పుడు చాలా పాపులర్ అయిన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్. అయితే ఆపిల్ ఐ ప్యాడ్ రాకతో ఇది తెర వెనక్కి వెళ్లిపోయింది.

Sony Tablet P
ఆపిల్ ఐప్యాడ్ ని సవాల్ చేస్తూ సోని ట్యాబ్లెట్ మార్కెట్లోకి ప్రవేశించింది. రెండు డిస్ ప్లేలతో వచ్చిన ఈ ట్యాబ్లెట్ ఆపిల్ ఐప్యాడ్ దెబ్బకు కనుమరుగుకాక తప్పలేదు.

Asus Transformer Prime
డాకింగ్ కీబోర్డుతో వచ్చిన ఈ ట్యాబ్లెట్ కూడా ఆపిల్ ఐప్యాడ్ ముందు నిలవలేక చతికిలపడింది.

Google Pixel C
2015లో లాంచ్ అయిన ఈ ట్యాబ్లెట్ అమ్మకాలు ఆశించినంతగా జరగకపోవడంతో కంపెనీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

HP TouchPad
ఈ ట్యాబ్లెట్ 2011లో లాంచ్ అయింది. అయితే లాంచ్ అయిన కొద్ది రోజులకే ఇది ఐప్యాడ్ ముందు నిలవలేక చతికిలపడింది.

Microsoft Windows tablets
ఆపిల్ తో పోటీపడుతున్న దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా ట్యాబ్లెట్ ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది 2001లో లాంచ్ అయింది. అయితే ఇది అంతగా ఆదరణకు నోచుకోలేదు.

HTC Flyer
ఇది కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే మార్కెట్ నుంచి వైదొలిగింది.

BlackBerry Playbook
ఐప్యాడ్ కి పోటీగా బ్లాక్ బెర్రి ఈ ప్లే బ్యాక్ ని తీసుకొచ్చింది. అయితే ఇది కేవలం కొన్ని యాప్స్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుండటం వల్ల ఇది యూజర్లను ఆకట్టుకోలేకపోయింది.

Dell Streak
డెల్ నుంచి వచ్చిన phablet ట్యాబ్లెట్ కూడా ఆపిల్ ఐప్యాడ్ దెబ్బకి వెనక్కి వెళ్లింది. 2011లో లాంచ్ చేసిన ఈ ట్యాబ్లెట్ వినియోగదారులను అంతగా ఆకట్టుకోకపోవడంతో కంపెనీ వీటిని తీసివేసింది.


Click it and Unblock the Notifications








