"Apple MacBook Pro M2" ప్రీ ఆర్డ‌ర్స్‌కు డేట్ ఫిక్స్‌.. ప్రారంభ ధ‌ర ఎంతంటే!

|

టెక్ ప్రియుల‌కు యాపిల్ కంపెనీ శుభ‌వార్త చెప్పింది. అతి త్వ‌ర‌లో M2 chipset తో త‌యారు చేసిన 13 అంగుళాల యాపిల్ మ్యాక్ బుక్ ప్రో డివైజ్‌ల‌కు సంబంధించి ప్రీ ఆర్డ‌ర్స్ ప్రారంభించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. జూన్ 17 వ తేదీ నుంచి M2 chip యాపిల్ మ్యాక్‌బుక్ ప్రో ప్రీ ఆర్డ‌ర్స్ ప్రారంభం కానున్న‌ట్లు తెలిపింది. మేర‌కు ఆ సంస్థ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

ప్రారంభ ధర ఎంతంటే !

ప్రారంభ ధర ఎంతంటే !

ఈ M2 chipset క‌లిగిన‌ 13 అంగుళాల మాక్‌బుక్ ప్రో 2022 డివైజ్‌లకు సంబంధించి ఆ సంస్థ ఇదువ‌ర‌కే ఈ నెల‌లో నిర్వ‌హించిన వ‌ర‌ల్డ్ వైడ్ డెవ‌ల‌ప‌ర్స్ కాన్ఫరెన్స్ "WWDC 2022" వేదిక‌గా వివ‌రాల‌ను వెల్ల‌డించింది. కాగా, తాజాగా ప్రీ ఆర్డ‌ర్స్ తేదీని వెల్ల‌డించడం విశేషం. జూన్ 17 నుంచి వినియోగ‌దారులు కంపెనీ సైట్ ద్వారా ప్రీ ఆర్డ‌ర్స్ చేసుకోవ‌చ్చ‌ని స‌మాచారం. మూడు వేరియంట్ల ఆధారంగా వీటిని విడుద‌ల చేయ‌నున్నారు. క‌నిష్ఠం ప్రారంభ వేరియంట్ ధ‌ర రూ.1,29,900 గా నిర్ణ‌యించారు.

మూడు వేరియంట్ల‌లో

మూడు వేరియంట్ల‌లో

(WWDC 2022) వేదిక‌గా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో కొత్త మాక్‌బుక్ ఎయిర్‌ల‌తో పాటుగా ఈ అధునాత‌న మ్యాక్‌బుక్ ప్రో ను విడుద‌ల చేశారు. Apple M2 chipతో వ‌స్తున్న ఈ మ్యాక్‌బుక్ ప్రో కు సంబంధించి జూన్ 17, శుక్ర‌వారం రోజున సాయంత్రం 5:30PM IST గంట‌ల‌కు ప్రీ ఆర్డ‌ర్స్ ప్రారంభం కానున్నాయ‌ని యాపిల్ కంపెనీ వెల్ల‌డించింది. ఆ త‌ర్వాత జూన్ 24 నుంచి సేల్స్ ప్రారంభ‌మ‌వుతాయని సంస్థ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. భార‌త్‌లో ఈ మ్యాక్‌బుక్ ప్రో ధ‌ర‌ని రూ.1,29,900 గా నిర్ణ‌యించింది. ఈ మ్యాక్‌బుక్ కు మూడు ర్యామ్ మ‌రియు నాలుగు స్టోరేజీ ఫెసిలిటీని క‌ల్పిస్తున్నారు. ర్యామ్ ఆధారంగా కొనుగోలుదారులు మూడు వేరియంట్ల‌లో ఈ మ్యాక్‌బుక్ ప్రోని ఎంపిక చేసుకోవ‌చ్చు. వాటిలో 8GB RAM, 16GB of RAM, and 24GB of RAM వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా SSD స్టోరేజీ విష‌యానికొస్తే 256GB, 512GB, 1TB, and 2TB లలో అందుబాటులో ఉండ‌నున్నాయి

గరిష్ట ధర ఎంతంటే

గరిష్ట ధర ఎంతంటే

ఈ వేరియంట్ల‌లో 24GB of RAM, 2TB SSD స్టోరేజీ మోడ‌ల్ ధ‌ర గ‌రిష్ఠంగా రూ.2,49,900 ధ‌ర నిర్ణ‌యించారు. వినియోగ‌దారులు యాపిల్ అఫిషీయ‌ల్ వెబ్ సైట్ ఓపెన్ చేసి అందులో కాన్ఫిగ‌రేష‌న్ ప్ర‌కారం వారికి కన‌చ్చిన మోడ‌ల్ ను ఎంపిక చేసుకుని అమౌంట్ చెల్లించి మ్యాక్‌బుక్ ప్రోను బుక్ చేసుకోవ‌చ్చు.

డిజైన్ ప‌రంగా M1 మోడ‌ల్‌

డిజైన్ ప‌రంగా M1 మోడ‌ల్‌

ఈ మ్యాక్‌బుక్ ప్రో M2 chip ను క‌లిగి ఉన్న‌ప్ప‌టికీ, డిజైన్ ప‌రంగా చూస్తే M1 మోడ‌ల్‌లోనే ఉంది. దీనికి పాత జ‌న‌రేస్ డివైజ్‌ల‌లో మాదిరిగానే 720 పిక్సెల్స్‌తో ఫేస్ టైం కెమెరాను అందిస్తున్నారు. దాంతో పాటుగా ట‌చ్ బార్, యూఎస్‌బీ పోర్టులు కూడా ఇదువ‌ర‌కు విడుద‌లైన డివైజ్‌ల మాదిరిగానే త‌యారు చేశారు. ప్ర‌స్తుతానికి అయితే వీటిని స‌ప్లై చేయ‌డానికి ఎలాంటి అంత‌రాయాలు లేకున్న‌ప్ప‌టికీ, మ్యాక్‌బుక్ ఎయిర్ డివైజ్‌లు మాత్రం వ‌చ్చే నెల‌లో వ‌స్తాయ‌ని టెక్ వ‌ర్గాల సమాచారం.

యాపిల్ MacBook Pro M2 స్పెసిఫికేష‌న్స్‌, ఫీచ‌ర్స్ ఇలా ఉన్నాయి..

యాపిల్ MacBook Pro M2 స్పెసిఫికేష‌న్స్‌, ఫీచ‌ర్స్ ఇలా ఉన్నాయి..

యాపిల్ MacBook Pro M2 పెర్ఫార్మెన్స్ గ‌త డివైజ్‌ల‌తో పోలిస్తే 18శాతం వేగంగా పనిచేస్తుంది. దీనికి 40శాతం వేగంఆ చేయ‌గ‌ల న్యూర‌ల్ ఇంజిన్ సామ‌ర్థ్యం ఉంది. పెర్ఫార్మెన్స్ ను మిన‌హాయిస్తే మిగ‌తా అన్ని స్పెసిఫికేష‌న్స్ M1 మోడ‌ల్ త‌ర‌హాలోనే ఉన్నాయి. దీనికి 13.3 అంగుళాల రెటీనా డిస్‌ప్లే అందిస్తున్నారు. ట‌చ్ ఐడీ సెన్సార్, USB Type-4 speed థండ‌ర్ బోల్ట్ పోర్ట్స్ క‌లిగిఉంది. ఇది బ్లూటూత్ 5.0, వైఫై 6 ఫెసిలిటీని స‌పోర్ట్ చేస్తుంది. ఈ మ్యాక్‌బుక్ ప్రోకు 58.2 వాట్ అవ‌ర్ బ్యాట‌రీ ఉప‌యోగించి త‌యారు చ‌చేశారు.

సిలికాన్ చిప్ టెక్నాలజీ

సిలికాన్ చిప్ టెక్నాలజీ

యాపిల్ ఈ అధునాతన Apple M2 చిప్ టెక్నాల‌జీని ఈ నెల ప్రారంభంలో నిర్వ‌హించిన WWDC 2022 వేదిక‌గా విడుద‌ల చేసింది. ఈ M2 చిప్ అనేది యాపిల్ నుంచి విడుద‌లైన సెకండ్ జ‌న‌రేష‌న్ సిలికాన్ చిప్ టెక్నాల‌జీ. ఈ టెక్నాల‌జీ కేవ‌లం 13 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో, మ‌రియు రాబోయే కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌లలో మాత్ర‌మే క‌లిగి ఉంది.

మ్యాక్‌బుక్ ఎయిర్ M2 Vs మ్యాక్‌బుక్‌ Pro M2: Camera

మ్యాక్‌బుక్ ఎయిర్ M2 Vs మ్యాక్‌బుక్‌ Pro M2: Camera

మ్యాక్‌బుక్ ఎయిర్ M2 లో కెమెరా అప్‌గ్రేడ్ ముఖ్య‌మైన అంశం. మ్యాక్‌బుక్ ఎయిర్ M2 కు 1080 పిక్సెల్ క్వాలిటీ గ‌ల వెబ్ కెమెరా అందిస్తుండ‌గా.. మ్యాక్‌బుక్ ప్రో M2 కు 720 పిక్సెల్ క్వాలిటీ గల కెమెరా అందిస్తున్నారు. మ్యాక్‌బుక్ ఎయిర్ M2 కెమెరా వీడియో కాల్స్‌, వీడియో కాన్ఫ‌రెన్స్‌ల‌కు చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.

మ్యాక్‌బుక్ ఎయిర్ M2 Vs మ్యాక్‌బుక్‌ Pro M2: బ‌్యాట‌రీ లైఫ్

మ్యాక్‌బుక్ ఎయిర్ M2 Vs మ్యాక్‌బుక్‌ Pro M2: బ‌్యాట‌రీ లైఫ్

సంస్థ అధికారిక ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. మ్యాక్‌బుక్‌ Pro M2 డివైజ్ సింగిల్ ఛార్జ్ తో 20 గంట‌ల పాటు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. అదే మ్యాక్‌బుక్ ఎయిర్ M2 డివైజ్ సింగిల్ ఛార్జ్ తో 18 గంట‌ల పాటు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. రెండు ల్యాప్‌టాప్‌ల‌కు ఛార్జింగ్ కు USB Type-C port అందిస్తున్నారు.

Best Mobiles in India

English summary
Apple MacBook Pro M2 13-Inch Up For Pre-Orders From June 17

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X