ఒకే సారి 6 ప్రాడెక్ట్స్ ను లాంచ్ చేయనున్న ఆపిల్..అవేంటో చూడండి
టెక్ ప్రపంచంలో తిరుగులేని ఆధిపత్యంలో దూసుకుపోతున్న అమెరికా దిగ్గజం ఆపిల్ సరికొత్తగా ముందుకు దూసుకువస్తోంది.త్వరలో ఈ కంపెనీ నుంచి 6 నూతన ప్రాడెక్ట్స్ మార్కెట్లోకి రానున్నట్టు తెలుస్తుంది.
టెక్ ప్రపంచంలో తిరుగులేని ఆధిపత్యంలో దూసుకుపోతున్న అమెరికా దిగ్గజం ఆపిల్ సరికొత్తగా ముందుకు దూసుకువస్తోంది.త్వరలో ఈ కంపెనీ నుంచి 6 నూతన ప్రాడెక్ట్స్ మార్కెట్లోకి రానున్నట్టు తెలుస్తుంది. కాగా దీనిక సంబంధించిన కొన్ని వివరాలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. కాగా ఈ నెల 26వ తేదీన సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ ఆపిల్ తన నూతన ప్రాడెక్ట్స్ యొక్క లాంచ్ ఈవెంట్ జరపనున్నట్టు తెలుస్తుంది. లీక్ అయిన వివరాల ప్రకారం యాపిల్ విడుదల చేస్తున్న ఆ నూతన ప్రాడెక్ట్స్ ఏంటో మీరే చూడండి....

New iPad Pro
ఆపిల్ ఈ iPad Pro ను రెండు వేరియంట్లలో మార్కెట్లోకి విడుదల చేయనుంది. మొదటి వేరియంట్ 11 అంగుళాలతో కాగా రెండవ వేరియంట్ 12.9 అంగుళాలు . అంతేకాకుండా,iPad Pro మోడళ్లు ఫేస్ ఐడితో ఫీచర్ తో రానున్నాయి అలాగే ఆపిల్ లైట్నింగ్ పోర్ట్ కి బదులుగా USB టైప్-సి పోర్ట్ను యాడ్ చేయనుంది.

New Macs
ఆపిల్ ఈ నెల ఒక కొత్త డిజైన్ తో ఒక కొత్త Mac ను షో కేస్ చేస్తునట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. ఆపిల్ ఇటీవలే దాని MacBook Pro లైన అప్ ను అప్ గ్రేడ్ చేసింది, ఇది ఇప్పుడు కొత్త రూపాన్ని పొందడానికి మాక్ కోసం కొంత సమయం పడుతుంది.

Brand new Mac Mini
Mac Mini ఇప్పటికీ 2014 హార్డ్ వేర్ లో నిలిచి ఉంది. ఆపిల్ దానిMac Mini ను అప్ గ్రేడ్ చేయడానికి భావిస్తున్నారు అదే విధంగా ఈ నెల ఒక కొత్త Mac Mini ని ప్రారంబిస్తున్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి .

New Macbook Air
అత్యంత సరసమైన Macbook - Macbook Air - ఎంతగానో ఎదురుచూస్తున్న హార్డ్ వేర్ అప్ గ్రేడ్ ను అందుకుంటుంది. టచ్ బార్ తో మరియు రెండు రకాలలో టచ్ ID తో ఆపిల్ ఈ నెలలో కొత్త Macbook Air ను విడుదల చేయబోతుంది . అయితే, ధరలు ఈ సారి ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

Apple AirPower
ఆపిల్ ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ మరియు 2017 లో ఐఫోన్ X స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసినప్పుడు Qi వైర్లెస్ ఛార్జింగ్ ను ప్రవేశపెట్టింది. అదే ఆపిల్ ఈవెంట్ సమయంలో, కుపెర్టినో టెక్ దిగ్గజం AirPower అని పిలిచే మరొక ప్రొడుక్ట్ ను ప్రదర్శించారు అదే వైర్లెస్ ఛార్జింగ్ మ్యాట్ . ఇది సైమల్టేనియస్ గా ఐఫోన్ ను ఛార్జ్ చేస్తుంది.

Apple AirPods 2
ఆపిల్ నెక్స్ట్ జనరేషన్ ఆపిల్ వైర్లెస్ AirPods earphones ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీనిని AirPods 2 అనే పేరుతో మార్కెట్లోకి విడుదల చేయబోతుంది. ఈ earphones మంచి బ్యాటరీ లైఫ్ ,మంచి ఆడియో క్వాలిటీ తో పాటు వాటర్ రెసిస్టెంట్ తో రానున్నటు పుకార్లు వినిపిస్తున్నాయి


Click it and Unblock the Notifications








