Back To School పేరుతో Apple అద్భుత‌మైన ఆఫ‌ర్స్‌!

|

యూఎస్ కు చెందిన ప్ర‌ముఖ టెక్నాల‌జీ దిగ్గ‌జ సంస్థ Apple విద్యార్థుల‌కు శుభ‌వార్త చెప్పింది. భార‌త్‌లో హైబ్రిడ్ మోడ‌ల్ విధానాన్ని ప్రోత్స‌హించే విధంగా ఆక‌ర్ష‌ణీయ‌మైన ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. భార‌త విద్యార్థుల కోసం Back To School క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా విద్యార్థుల‌కు ఉప‌యోగ‌ప‌డే Apple ఎల‌క్ట్రానిక్ ఉత్ప‌త్తుల‌పై డిస్కౌంట్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు మెష‌బుల్ నివేదిక‌ స‌మాచారాన్ని బ‌య‌ట‌కు వెల్ల‌డించింది. Apple తెలిపిన స‌మాచారం ప్రకారం, కంపెనీ ద్వారా ధృవీకరించబడిన విద్యార్థులు మాత్రమే ఈ ఆఫర్‌కు అర్హులు మరియు ఇతర కుటుంబ సభ్యులు దీని ప్రయోజనాన్ని పొందేందుకు అనుమతించబడరు. ఐప్యాడ్‌లు, యాపిల్ పెన్సిల్స్, మ్యాక్‌బుక్స్ మరియు స్మార్ట్ కీబోర్డుల కొనుగోలుపై విద్యార్థులకు అపారమైన తగ్గింపులను అందిస్తు ఈ కార్యక్రమాన్ని కంపెనీ ప్రారంభించింది.

 
Back To School పేరుతో Apple అద్భుత‌మైన ఆఫ‌ర్స్‌!

రూ.10వేల డిస్కౌంట్

వార్తా నివేదిక‌ల నుంచి అందిన స‌మాచారం ప్ర‌కారం.. ఈ ఆఫ‌ర్‌లో భాగంగా Apple ల్యాప్‌టాప్‌ల‌పై రూ.10వేల వ‌ర‌కు డిస్కౌంట్ ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అంతేకాకుండా Apple కేర్ ప్ల‌స్‌పై అద‌నంగా 20శాతం డిస్కౌంట్ ల‌భించ‌నుంది. ఈ ఆఫ‌ర్‌పై ఆస‌క్తి ఉన్న‌వారు యాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ స్కీమ్‌కు అర్హులో కాదో చెక్ చేసుకోవ‌చ్చు. యాపిల్ అధికారిక వెబ్ స్టోర్‌లో విద్యార్థులు, త‌ల్లిదండ్రులు ఈ రూ.10వేల డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. త్వ‌ర‌లో అందుబాటులోకి రానున్న M2 Chipset క‌లిగిన‌ Apple MacBook Air ను ఆఫ‌ర్‌లో భాగంగా రూ.1,09,900 ల‌భించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అదేవిధంగా Apple కు చెందిన 13 అంగుళాల‌ MacBook Pro M2 రూ. 1,19,900 ల‌భించ‌నుంది.

Back To School పేరుతో Apple అద్భుత‌మైన ఆఫ‌ర్స్‌!

M1 మ్యాక్‌బుక్ ఎయిర్ ను రూ.89,900 ప్రారంభ ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. 14 అంగుళాల స్క్రీన్ క‌లిగిన Apple మ్యాక్‌బుక్ ప్రో ను రూ.1,75,410 గా అందుబాటులోకి రానుంది. ఇక 16 అంగుళాల స్క్రీన్ క‌లిగిన Apple మ్యాక్‌బుక్ ప్రో సాధార‌ణ ధ‌ర రూ.2,15,910 కొనుగోలు చేయ‌వ‌చ్చు. Apple తెలిపిన స‌మాచారం ప్రకారం, కంపెనీ ద్వారా ధృవీకరించబడిన విద్యార్థులు మాత్రమే ఈ ఆఫర్‌కు అర్హులు మరియు ఇతర కుటుంబ సభ్యులు దీని ప్రయోజనాన్ని పొందేందుకు అనుమతించబడరు. ఐప్యాడ్‌ల గురించి చెప్పాలంటే, ఆపిల్ ఐప్యాడ్ ఎయిర్ రూ.4వేల డిస్కౌంట్‌తో ధర రూ.50,780 నుండి ల‌భించ‌నుంది, 11 జెన్ ఐప్యాడ్ ప్రో ను ధర రూ.68,300 కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Back To School పేరుతో Apple అద్భుత‌మైన ఆఫ‌ర్స్‌!

M2 Apple MacBook ప్రో స్పెసిఫికేష‌న్లు:
(WWDC 2022) వేదిక‌గా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో కొత్త మాక్‌బుక్ ఎయిర్‌ల‌తో పాటుగా ఈ అధునాత‌న మ్యాక్‌బుక్ ప్రో ను విడుద‌ల చేశారు. ఈ మ్యాక్‌బుక్ కు మూడు ర్యామ్ మ‌రియు నాలుగు స్టోరేజీ కెపాసిటీల‌ను అందిస్తున్నారు. ర్యామ్ ఆధారంగా కొనుగోలుదారులు మూడు వేరియంట్ల‌లో ఈ మ్యాక్‌బుక్ ప్రోని ఎంపిక చేసుకోవ‌చ్చు. వాటిలో 8GB RAM, 16GB RAM, and 24GB RAM వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా SSD స్టోరేజీ విష‌యానికొస్తే 256GB, 512GB, 1TB, and 2TB లలో అందుబాటులో ఉండ‌నున్నాయి. ఈ మ్యాక్‌బుక్ ప్రో M2 chip ను క‌లిగి ఉన్న‌ప్ప‌టికీ, డిజైన్ ప‌రంగా చూస్తే M1 మోడ‌ల్‌లోనే ఉంది. దీనికి పాత జ‌న‌రేస్ డివైజ్‌ల‌లో మాదిరిగానే 720 పిక్సెల్స్‌తో ఫేస్ టైం కెమెరాను అందిస్తున్నారు. దాంతో పాటుగా ట‌చ్ బార్, యూఎస్‌బీ పోర్టులు కూడా ఇదువ‌ర‌కు విడుద‌లైన డివైజ్‌ల మాదిరిగానే త‌యారు చేశారు. ప్ర‌స్తుతానికి అయితే వీటిని స‌ప్లై చేయ‌డానికి ఎలాంటి అంత‌రాయాలు లేకున్న‌ప్ప‌టికీ, మ్యాక్‌బుక్ ఎయిర్ డివైజ్‌లు మాత్రం వ‌చ్చే నెల‌లో వ‌స్తాయ‌ని టెక్ వ‌ర్గాల సమాచారం.

Best Mobiles in India

English summary
Apple offers students with discounts on MacBook Air and MacBook Pro 13 models

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X